Jonna Pelala Pindi : తొలి ఏకాదశి రోజున ఈ పేలాలతో చేసిన పేలాల పిండిని ప్రసాదంగా చేస్తారు. ఈ పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జొన్నలు తెచ్చుకున్న తర్వాత వాటిని చేరగడం కానీ లేదా ఇలా జాలి గిన్నెలో వేసుకొని శుభ్రం చేసుకోండి. లేదంటే చిన్న చిన్న జొన్న పలుకులు ఉంటే వేపేటప్పుడు మాడిపోతాయి. చెత్త ఏమైనా ఉంటే కూడా పోతుంది. ఇలా శుభ్రం చేసుకుని ఒక కప్పు జొన్నలు తీసుకోవాలి. స్టవ్ పైన పెద్ద గిన్నె పెట్టుకొని అదే కప్పుతో ఐదు కప్పుల నీళ్లు పోసుకోవాలి . ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి నీళ్లు మరుగుతున్నప్పుడు తీసుకున్న ఒక కప్పు జొన్నలు ఇందులో వేసుకోవాలి.
జొన్నలు వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటే బలం లేని గింజలు అవన్నీ పైకి తేలుతాయి. అన్నిటిని బయటకు తీసేయండి. ఈ నీళ్లు ఒక పొంగు వచ్చేవరకు కాగనివ్వాలి. ఎక్కువ సేపు అవసరం లేదు. రెండు నిమిషాలు మూడు నిమిషాలు పడుతుంది అంతే. జస్ట్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ జొన్నల్ని జాలి గిన్నెలో వేసి వాటిని డ్రై చేసుకోవాలి. రెండు మూడు నిమిషాల పాటు అలా ఉంచారంటే మిగిలిన నీళ్లు అంతా కూడా డ్రైన్ అయిపోతాయి. జొన్నలు నీళ్లన్నీ పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి. వీటిని పల్చగా స్ప్రెడ్ చేసుకుని కనీసం రెండు గంటల పాటు అయినా ఫ్యాన్ కింద హై స్పీడ్ లో పెట్టి బాగా ఆరనివ్వాలి.
లేదంటే.. మీరు ఓవర్ నైట్ కూడా ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. ఫ్యాన్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం వేడెక్కనివ్వాలి. ఫ్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక చిన్న పెరుగు గరిటెడు జోనల్ వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక గుప్పెడు జొన్నలైతే సరిపోతుంది. వీటిని రెండు నిమిషాల పాటు ఇలా వేయించిన తర్వాత పేలాల్ అవుతాయి. ఇప్పుడు వెంటనే మూత పెట్టేసి ఫ్లేమ్‌ని హైలో పెట్టాలి.

మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలాగే మూతను కూడా లైట్‌గా ఓపెన్ చేయాలి. లేదంటే ఆవిరి నీళ్లు లోపల పడతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూతని ఓపెన్ చేసుకుంటూ ఉండాలి. ఇవి ఈ పాప్ అవడం తగ్గిన తర్వాత వెంటనే ఫ్లేమ్‌ని లో పెట్టేసుకోవాలి. పేలాలు జొన్న పేలాలు వచ్చేంతవరకు అలానే ఉంచాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. జొన్నల్ని బట్టి ఈ పేలాలు మంచి క్వాలిటీ జోన్నలైతే చక్కగా పెద్దగా వస్తాయి. లేదంటే చిన్న చిన్న పేలాలు వస్తాయి ఒక్కొక్కసారి సగం మాత్రమే పేలాలవుతాయి. మిగతా సగం అలాగే గింజలు లాగే ఉండిపోతాయి. ఇదంతా తీసుకున్న జొన్నలపైనే డిపెండ్ అయి ఉంటుంది.
Jonna Pelala Pindi : జొన్న పేలాల పిండితో అనేక వెరైటీలు చేసుకోవచ్చు..
ఈ జొన్న పేలాలను ఇలాగే తినేయచ్చు. కరకరలాడుతూ చాలా టేస్ట్ బాగుంటాయి. వీటితో లడ్డూలు కూడా చేసుకోవచ్చు. ఒక కప్పు జొన్నలకు 12 కప్పుల పేలాలు వస్తాయి. ఇప్పుడు ఈ పేలాలతో పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. మిక్సీ జార్‌లో కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలాగే మిగిలిన పేలాలన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్ లో ఈ పేలాల పిండిలో ఒక కప్పు తురిమిన బెల్లం వేసి కలుపుకోవాలి.
ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముద్దగా అవకుండా చక్కగా పొడిపొడిగా వస్తుంది. బెల్లం వేసి గ్రైండ్ చేసుకుని ఈ పిండిని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పుట్నాలు తినే సెనగపప్పు వేసుకొని ఐదు యాలకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఇందులో వేసుకోవాలి. 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇంకా ఇందులో జీడిపప్పు, బాదంపప్పు కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి.. అంతే పేలాల పిండి రెడీ అయినట్టే.. తొలి ఏకాదశి రోజున స్పెషల్ ప్రసాదంగా ఈ పేలాల పిండిని తయారు చేసుకోవచ్చు.