Idly Karam : ఇడ్లీ కారం పొడి రుచిగా ఇలా చేయండి ఇడ్లీ దోశల్లో ఈ పొడి వేసి నెయ్యితో తింటే సూపర్ గఉంటుంది..

Idly Karam : ఈ కారం మనకు ఇడ్లీ దోసెల్లోకి చాలా బాగుంటుంది చట్నీ లేకపోయినా సరే ఈ కారం తో మనం ఇడ్లీలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియో లోకి వెళ్ళిపోదాం ఇడ్లీ కారం చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత 15 మిరపకాయలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి . ఎండుమిరపకాయలను మాడిపోకుండా దోరగా వేగనివ్వాలి ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు మూడు టేబుల్ స్పూన్ల మినప గుళ్ళు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్ లో దినుసులను మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత రెండు రెబ్బల చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.

ఇలా కలుపుకున్న తర్వాత దినుసులు అన్నింటినీ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు ఎండు మిరపకాయలు టేస్ట్ కు తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులు చింతపండు రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇడ్లీ కారాన్ని ఈ విధంగా కొంచెం బరకగా వేసుకుంటే బాగుంటుంది ఈ కారం మనకు ఇడ్లీ, దోస రెండిట్లోకి బాగుంటుంది మనకి ఇడ్లీ కారం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కారాన్ని ఇడ్లీ మీద చల్లుకొని నెయ్యి వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ కారం రెడీ.

Read Also : Idli Dosa Recipe : బండి మీద దొరికే ఇడ్లీ, కరకరలాడే దోసె.. నోరూరించే మూడు రకాల వెరైటీ చట్నీలు.. తింటే టేస్ట్ అదిరిపోద్ది..!

Leave a Comment