Carrot Rice Recipe : 10 నిమిషాల్లో అయిపోయే టేస్ట్ లంచ్ బాక్స్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. దీని పేరే క్యారెట్ రైస్ ఈ క్యారెట్ రైస్ పదే పది నిమిషాల్లో అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది పిల్లలకు గాని ఆఫీస్ కి వెళ్లేక వాళ్లకు కానీ లంచ్ బాక్స్ లో పెట్టి పంపించారంటే లంచ్ బాక్స్ ఖాళీగా ఇంటికి వచ్చేస్తాయి ఇక లేట్ చేయకుండా క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. క్యారెట్ రైస్ కోసం ఇలా అన్నాన్ని పొడిపొడిగా ఉడికించుకుని పెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ తీసుకోవచ్చు మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రైస్ ని ట్రై చేయొచ్చు ఏ అన్నంతో చేసిన క్యారెక్టర్స్ బాగుంటుంది
కావలసిన పదార్థాలు… ఉడికించుకున్నరైస్, క్యారెట్ తురుము ఒక కప్పు , ఉప్పు, కొత్తిమీర,నిర్మరసం, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, దాల్చిన చెక్క ఒక చిన్న, లవంగాలు రెండు , యాలకులు రెండు ,మినప్పప్పు ఒక టీ స్పూన్ , కొద్దిగా జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి, ఆనియన్, ఒక రెమ్మ కరివేపాకు..
తయారీ విధానం.. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అనేది క్యారెట్ రైస్ కి స్పెషల్ టేస్ట్ వస్తుంది . తప్పకుండా వేసుకోండి ఇప్పుడు నూనె వేడయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఫ్లేవర్ కోసం ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు, రెండు యాలకులు, యాలకులు క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ మినప్పప్పు కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇందులో క్రాస్ గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.

ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి . ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి ఇందులో తురిమి పెట్టుకున్న ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు మూడు నాలుగు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి.
ఇప్పుడు మిశ్రమాల్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి అంతా బాగా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి . తర్వాత ఇందులో అరచక్క నిర్మరసం పిండి సర్వ్ చేసుకోవడమే అంతే పదే పది నిమిషాల్లో టేస్టీ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది ఈ క్యారెట్ రైస్ ఇలా తింటేనే బాగుంటుంది వేరే కాంబినేషన్లో తింటే దీని టేస్ట్ మారిపోతుంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి తయారు చేశాక..





