Mango Curry Recipe : మామిడికాయ పులుసు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ మామిడికాయ పులుసుని వేడివేడిగా అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది .
కావలసిన పదార్థాలు… మామిడికాయ, ఆయిల్, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 2,టమాటాలు 2, ఉప్పు,కారం, పసుపు 1/2 టీ స్పూన్, మెంతులు 1/4 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్,ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చింతపండు రసం(నిమ్మకాయ సైజు), కరివేపాకు 2రెమ్మలు, కొత్తిమీర..
తయారీ విధానం… ముందుగా మామిడికాయ పులుసు చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర 1/4 టీ స్పూన్ మెంతులు, చిటికెడు ఇంగువ వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి . పోపు దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి . ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మగ్గనివ్వాలి.

టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి . ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల కారం కారాన్ని మీరు తినే దాన్నిబట్టి వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలా అంతా కలిసేలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి . ఇలా కలుపుకున్న తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం ఒక గ్లాసు నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఈ పులుసు మీకు కొంచెం చిక్కగా లేదా పల్చగా కావాలంటే వాటర్ ని అడ్జస్ట్ చేసుకోండి.
ఇలా కలుపుకున్న తర్వాత పులుసును మీడియం ఫ్లేమ్ లో ఒక మరుగు రానివ్వాలి. తులసిలా మరుగుతున్నప్పుడు ఒక చిన్న మీడియం సైజు మామిడికాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి . ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి మామిడికాయను పుల్లగా ఉండేది తీసుకోవాలి పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూతపెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి 10 నిమిషాల తర్వాత మామిడికాయ పులుసు మనకి ఈ విధంగా ఉడికిపోతుంది. మామిడికాయ ముక్కలను మరీ ఎక్కువగా ఉడికించకూడదు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి మామిడికాయ పులుసు చాలా టేస్టీగా రెడీ అయిపోయింది మామిడికాయ పులుసు రెడీ.











