Chamadumpa Egg Pulusu : చామదుంప కోడిగుడ్డు పులుసు.. ఇలా చేశారంటే ఆ టేస్టే వేరబ్బా.. అదిరిపోయే కాంబినేషన్..!

Chamadumpa Egg Pulusu : చామదుంపల కోడిగుడ్డు పులుసు ఎప్పుడైనా తిన్నారా? కోడి గుడ్డుతో ఎన్నో రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటాం. అయితే చాలామంది కోడిగుడ్డు పులుసుని అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. చామదుంపల కోడిగుడ్లు పులుసు (Chamagadda Egg Pulusu) అదిరిపోయే కాంబినేషన్‌గా తయారు చేసుకోవచ్చు. అయితే మీ ఇంట్లో ఓసారి చేసి చూడండి.. ఒకసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకుని తినాలనిపించేలా ఉంటుంది. చామగడ్డల కోడిగుడ్డు పులుసు ఎంతో రుచికరంగా తయారు రావాలంటే ఇలా చేయాల్సిందే.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు… చామ దుంపలు-1/3 కేజీ, కోడిగుడ్లు -5, చింతపండు-( చిన్న నిమ్మకాయ సైజు అంత), కారం ఉప్పు( రుచికి తగినంత), జీలకర్ర-1 టీ స్పూన్, ఆవాలు-1 టీ స్పూన్, నూనె( తగినంత), ఎండుమిర్చి-3, అల్లం వెల్లుల్లి పేస్ట్-1 టేబుల్ స్పూన్, కరివేపాకు ఒకరెమ్మ, ధనియాల పొడి-1 టీ స్పూన్,

తయారీ విధానం.. ముందుగా స్టవ్ ఆన్ చేసి కోడిగుడ్లు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగి చామదుంపలను కూడా ఉడికించిన చల్లారిన తర్వాత చామదుంపల పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో చింతపండు నానబెట్టుకోవాలి..  chamadumpa egg pulusu in telugu recipe

chamadumpa egg pulusu in telugu recipeఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కూరకు సరిపోయేంత నూనె పోసి నూనె వేడి అయిన తర్వాత జిలకర, ఆవాలు, ఎండుమిర్చి, చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత కోడిగుడ్లు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి.

Chamadumpa Egg Pulusu : చామదుంపల పులుసు గుడ్లతో ఇలా చేశారంటే.. 

ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత చామదుంపల ముక్కలు వేసి కలిపి వెంటనే రుచికి తగినంత కారం ఉప్పు వేసుకుని ( ఉడికించిన చామదుంపలు కాబట్టి) కోడిగుడ్లకు, చామదుంపలకు ఉప్పు కారం పట్టేలా బాగా కలపాలి తర్వాత రెండు నిమిషాల మూత పెట్టి ఉడికించాలి ఇప్పుడు చింతపండు గుజ్జు వేసి పులుసుకు తగినన్ని నీళ్లు పోసి ఒక రెమ్మ కరివేపాకు వేసి మూత పెట్టి గ్రేవీ వచ్చి నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి.

రుచి కోసం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి. చామదుంపలు జిగుడుగా ఉంటాయి కాబట్టి చల్లారాక దగ్గర పడుతుంది. కొంచెం పులుసుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి.. ఎంతో రుచికరమైన కోడిగుడ్డు చామదుంపల పులుసు రెడీ..

Read Also : Spicy Egg Pulusu Recipe : ఆంధ్రా స్టైల్ కోడిగుడ్డు పులుసు.. ఇలా చేస్తే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉంటుంది.. కొంచెం కూడా మిగల్చకుండా గిన్నె ఊడ్చేస్తారు!

Leave a Comment