Instant Breakfast Recipes : ఇనిస్టెంట్ బ్రేక్ ఫాస్ట్… అప్పటికప్పుడు చేసే అద్భుతమైన రెసిపీ.. సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా?

Instant Breakfast Recipes :  ఇనిస్టెంట్ బ్రేక్ ఫాస్ట్… 2 బంగాళదుంపలు పల్లీలతో కొత్తగా ఈ టిఫిన్ చేసి పెట్టారంటే పిల్లలు వద్దన్నా మొత్తం ఖాళీ చేస్తారు ఎంతో ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి? మరమరాల ప్లేస్ లో అటుకులు, వేడివేడి అన్నం, మిగిలిన అన్నం తో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు.. మరమరాలు 2 కప్పు, బంగాళదుంప -2, ఉల్లిగడ్డ-1, పల్లీలు1/2 కప్పు, పచ్చిమిర్చి -2, నూనె, జీలకర్ర- 2 టీ స్పూన్, ఆవాలు – 1టీ స్పూన్, పచ్చిశనగపప్పు1 టీ స్పూన్, ఉప్పు, కొత్తిమీర, ఎండుమిర్చి – 6, ఎండు కొబ్బరి (సగం), వెల్లుల్లి రెబ్బలు-5.

తయారీ విధానం… ముందుగా పల్లీలను బ్రౌన్ కలర్ వేయించుకోవాలి. ఆ తర్వాత బంగాళా దుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్లలో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేయాలి.

10 minutes instant new breakfast recipes in telugu
10 minutes instant new breakfast recipes in telugu

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు, ఒకరెమ్మ కరివేపాకు, రెండు ఎండు మిర్చి ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి తర్వాత కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసి కలపాలి.

బంగాళదుంపలను డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరమరాలను శుభ్రంగా నీళ్లలో ముంచి కొంచెం సాఫ్ట్ గా అయిన తర్వాత తీయాలి. మరమరాలలో ఉన్న నీళ్లు పిండి.. (మరమరాలు వాటర్ పీల్చుకోకుండా చూసుకోవాలి. బంగాళదుంపలు ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన పల్లీల పొడిని వేసి తరవాత లో ఫ్లేమ్ లో ఉంచి ఒక నిమిషం పాటు మసాలా (పల్లీల కారం పొడి) ముక్కలు కు పట్టేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మరమరాలు వేసి కలపాలి. రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఎంతో రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ రెడీ..

Read Also : Instant Breakfast Recipes : 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్ ఫాస్ట్‌ల గురించి మీకు తెలుసా?

Leave a Comment