Mamidikaya Menthi Baddalu : మామిడికాయ మెంతి బద్ద పచ్చడిని ఎప్పుడైనా తిన్నారా? లేదా ఇంట్లో తయారుచేశారా? మామిడి కాయ మెంతి పచ్చడిని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. మామిడి ముక్కల పచ్చడిని జీడి మామిడి కాయతో ఇలా తయారుచేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినవచ్చు. వేడివేడి అన్నంలో, రాగిసంకటిలో, చాలా రుచికరంగా ఉంటుంది. ఇంతకీ మామిడికాయ మెంతి బద్దల పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసా?
కావలసిన పదార్థాలు : మామిడికాయ 3, ఆవాలు 2, మెంతులు 2, ఎండుమిర్చి , పాల ఇంగువ..
తయారీ విధానం : మామిడికాయను శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడిచి మామిడికాయ పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని మెంతులు, ఆవాలు వేసి ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడి చేసుకోవాలి. కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి గుప్పెడు ఎండు మిరపకాయలను కొంచెం ఇంగువ వేసి దోరగా వేయించుకోవాలి మాడకుండా.

Mamidikaya Menthi Baddalu : మామిడికాయ మెంతి పచ్చడి రుచిగా రావాలంటే..
చల్లార్చిన మిరపకాయలను మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత వేరు శనగ నూనె అరకప్పు వేసి వేడి అయిన తర్వాత ఒక స్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి నూనెను చల్లారించాలి ఆ తర్వాత అందులో మామిడి ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, మూడు టేబుల్ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మెంతుల పొడి వేసుకొని మామిడి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.
ముక్కకు కి నీళ్లు ఊరుతుంది కాబట్టి సరిపోను ఉప్పు కారం వేసుకోవాలి లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు.. జాడీలో గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోటి పచ్చడిని అలాగే తిన్నా బాగానే ఉంటుంది. లేదంటే.. పొప్ (తాలింపు) పెట్టినా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ రోటి పచ్చడిని ఓసారి ట్రై చేయండి.