Rajma Curry Recipe : రాజ్మా కర్రీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. ఎన్నో పోషక విలువలతో కూడిన రాజ్మా కర్రీని ఇలా చేస్తే ఎన్ని రోటీలు తింటామో లెక్కే ఉండదు.. రాజ్మా కర్రీని ఎప్పుడైనా ఇలా చేశారా? ఒకసారి చేస్తే ఇక వదలరు. రాజ్మా కర్రీని ఇలా తయారు చేసుకుంటే హోటల్ కన్నా చాలా రుచిగా ఉంటుంది. అలాగే అన్నం, చపాతీలోకి, బిర్యానీలతో తింటే చాలా చాలా బాగుంటుంది. రుచికరమైన రాజ్మా కర్రీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం…
కావలసిన పదార్థాలు.. రాజ్మా1/2 కప్పు, ఉల్లిపాయ2, టమోటా2, పచ్చిమిర్చి1, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1టీ స్పూన్, జిలకర 1టీ స్పూన్, గరం మసాలా 1/2టీ స్పూన్, నూనె, పసుపు 1టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కారం రుచికి తగినంత, బిర్యానీ ఆకు1, లవంగాలు3, యాలకులు2, దాల్చిన చెక్క1 ఎండుమిర్చి1, జీలకర్ర పొడి1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి1/2 టీ స్పూన్
తయారీ విధానం.. ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్పు రాజ్మా తీసుకొని శుభ్రంగా కడుక్కొని రాత్రంతా… కనీసం ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ లో మూడు కప్పుల నీళ్లు తీసుకొని అందులో రాజ్మా కొంచెం పసుపు, ఉప్పు ఒక టీ స్పూన్, కారం హాఫ్ టీ స్పూన్ వేసి కుక్కర్ మూత పెట్టి కనీసం 6 నుంచి 8 విజిల్స్ వచ్చేవరకు రాజ్మా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలా ఉడికితేనే కూర టేస్టీగా వస్తుంది.
స్టవ్ మీద కళాయి పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఒక దాల్చిన చెక్క, మూడు లవంగాలు, రెండు యాలుకలు, ఒక బిర్యానీ ఆకు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయల మిక్సీ లో గ్రైండ్ చేసుకొని ఉల్లి ముద్దను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు ఫ్రై చేసుకోవాలి. రెండు టమాటాలను మిక్సీలో గ్రైండ్ చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించాలి నూనె పైకి తేలుతుంది.
ఉడికించిన రాజ్మాను వాటర్ తో సహా మొత్తం వేసి కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి కనీసం 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడికించాలి. రాజ్మా కూర చిక్కగా అయిన తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి కలపాలి. ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో టేస్టీ రుచికరమైన రాజ్మా మసాలా రెడీ…