Alasanda Vadalu : రాయలసీమ స్పెషల్ వంటకం అలసంద వడలు… రాయలసీమ స్టయిల్లో కరకరలాడే అలసంద వడలు, అలసంద గారెలు మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ స్నాక్స్ లా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. నాటుకోడి పులుసు, చికెన్ కర్రీ, మటన్ పులుసు, సూపర్ కాంబినేషన్.. అలాగే పల్లి చట్నీ ఎర్ర కారంతో తింటే మళ్లీమళ్లీ తినాలి అనిపిస్తుంది. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలసంద వడలు పర్ఫెక్ట్ గా రావాలి అంటే.. పిండి ఈ విధంగా చేసుకోండి. అలసంద వడలు ఇలాచేస్తే టేస్టీగా క్రిప్సిగా ఉంటాయి. అలసందలు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.. ఇంకెందుకు ఆలస్యం.. ఆంధ్రా స్టైల్ బొబ్బర్లు వడ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు.. అలసందలు 1/2 కేజీ, నూనె, పచ్చిమిర్చి 2, ధనియాలు 1/2 స్పూన్, అల్లం ముక్కలు 1టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, ఉల్లిపాయలు 2, కొత్తిమీర, ఉప్పు రుచికి తగినంత.. పసుపు1/2 స్పూన్, వంట సోడా…
తయారీ విధానం.. అలసందలను బొబ్బర్లు అని కూడా అంటారు. అలసందలను ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ లో బరకగా పట్టుకోవాలి. పిండి మెత్తగా చేస్తే ఆయిల్ పీల్చుకుంటుంది క్రిస్పీగా గారెలు రావు అందుకని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు, 8 వెల్లుల్లి రెబ్బలు, అరటి స్పూన్ ధనియాలు, రెండు పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా కట్ చేసుకోవాలి వెయ్యాలి. వీటన్నిటిని కచ్చాపచ్చాగా దంచాలి. గ్రైండ్ చేసిన అలసందల పిండిలో వేసుకోవాలి.
సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసిన కరివేపాకు రెండు రెమ్మలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ వంట సోడా ఆప్షనల్.. వీటన్నిటిని బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసి నూనె వేడి అయిన తర్వాత అరచేతిలో పిండిని తీసుకొని గారెల్లా చేస్తూ వేసుకోవాలి. గారెలను మీడియం ఫ్లేమ్ లో వేగనివ్వాలి. గారెలు సగం వేగిన తర్వాత తీసి పిండి మొత్తం అయిపోయిందాకా అలా చేసుకోవాలి సగం వేగిన గారెలను మళ్లీ వేడి నూనెలో ల్లో వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా రెండుసార్లు వేయించడం వల్ల క్రిస్పీగా వస్తాయి. అంతే ఎంతో రుచికరమైన రాయలసీమ అలసంద గారెలు రెడీ..
ఎర్ర కారం చట్నీతయారీ విధానం.. ఎండు మిరపకాయలు 15, పెద్ద టమాటో ఒకటి, వెల్లుల్లి రెబ్బలు 10, కట్ చేసిన ఉల్లిపాయ, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ జార్ లో గ్రైండ్ చట్నీ గట్టిగా రాకుండా కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చట్నీ రెడీ…