Pudina Pulao Rice : పుదీనా రైస్.. (Pudina Rice).. ఈ పేరు వినగానే ఎవరికైనా నోరూరిపోతుంది. పుదీనా రైస్ అన్నాన్ని చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వంటకాన్ని పుదీనా ఆకుల రుచులతో సుగంధ ద్రవ్యాలతో తయారుచేసుకోవచ్చు. ఈ సులభమైన వంటకాన్ని పుదీనా ఆకులతో చేసుకోవాల్సి ఉంటుంది. పుదీనా అన్నం, పుదీనా ఆకులు (Mint Rice), కూరగాయలతో కలిపి ఆరోగ్యకరమైన వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. పుదీనా ఆకుల్లో (Pudina Leaf) విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు.. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సాయపడుతుంది. ఈ వంటకం శాకాహారులకు బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇందులో గ్లూటెన్ రహితమైనది. అంతేకాదు.. లంచ్ బాక్స్ లేదా టిఫిన్ బాక్స్ రెసిపీగా అద్భుతంగా ఉంటుంది. ఇక పెరుగు, కూరతో కలిపి వడ్డిస్తే ఆహా ఆ రుచి చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే మీ ఇంట్లో పుదీనా పులావ్ తయారుచేసుకోండి.
కావలసిన పదార్థాలు :
నూనె, నెయ్యి, బిర్యానీ ఆకు1, దాల్చిన చెక్క2, యాలకులు5, లవంగాలు 4, పుదీనా, పచ్చిమిర్చి5, కరివేపాకు రెమ్మలు, సాజీర ఒక టీ స్పూన్, నిమ్మరసం, ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి.
పుదీనా పులావ్ తయారీ విధానం.. :
ముందుగా బాస్మతి రైస్ తీసుకొని లేదా ఇంట్లో ఉన్న బియ్యం అయినా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి రైస్‌ను కొంచెం పలుకు ఉండేలా ఉడికించాలి. ఒక కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు నూనె, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో ఒక బిర్యానీ ఆకు, రెండు ఇంచుల దాల్చిన చెక్క, నాలుగు యాలకులు, ఐదు లవంగాలు, సాజీర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
ఆ తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పుదీనా మిక్సీ జార్ లో వేసి కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. కనీసం 50 గ్రాముల పుదీనా పేస్టు.. మీడియం ఫ్లేమ్ లో ఉంచి పచ్చివాసన పోయి నూనె పైకి తేలాలి అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పిరికిడు పుదీనా ఆకులు వేసి కలపాలి.
ఆ తర్వాత ఉడికించిన బాస్మతి రైస్ వేసి కలపాలి. కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు ఆప్షనల్.. రైసు బాగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం పుదీనా ఆకులు, ఫ్రైడే ఆనియన్స్ వేసి కలపాలి. స్టవ్ ఆఫ్ చేయండి. ఈ పులావ్ లోకి కుకుంబర్ రైతా.. తింటే టేస్ట్ ఉంటుంది. అంతే అండి ఎంతో రుచికరమైన పుదీనా పలావ్ రెడీ..