Sheer Khurma Recipe : రంజాన్ మాసంలో ఎన్నో రకాల అద్భుతమైన వంటకాలను చేస్తుంటారు. ప్రత్యేకించి ఈ రంజాన్ పర్వదినాన స్పెషల్ షీర్ కుర్మా ప్రీపేర్ చేస్తుంటారు. అంతేకాదు.. ఇప్తార్ స్వీట్స్, షహీ షీర్ కుర్మా రెసిపీలను ఎంతో టేస్టీగా చేస్తుంటారు. ఈ అద్భుతమైన వంటకాలను చూడగానే ఎవరికైనా నోరూరి పోవాల్సిందే. ఎంతో కమ్మగా ఉండే ఈ తియ్యనైనా వంటకాలను ఎలా తయారు చేయాలో తెలుసా? ప్రత్యేకంగా రంజాన్ మాసంలో ఇలాంటి వంటకాలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు :
బాదంపప్పు10, పిస్తా పప్పు, ఎండు ఖర్జూర 6, జీడిపప్పు 10, నెయ్యి, పంచదార, సేమియా, పాలు ఒక లీటర్, ఎండు ద్రాక్ష పావుకప్పు, యాలకుల పొడి ఆఫ్ టీ స్పూన్,
తయారీ విధానం :
ముందుగా ఒక బౌల్లో ఎండు ఖర్జూర, బాదంపప్పు, పిస్తా పప్పు 15, జీడిపప్పు వీటన్నిటిని రాత్రి వాటర్ లో నాన పెట్టుకోండి. లేదా వేడినీళ్లలో ఐదు గంటలు నాన్న పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని పెట్టుకున్న ఎండు ఖర్జూరాలు గింజలు తీసి పొడవుగా కట్ చేసి వేడి అయిన నెయ్యిలో వేసుకోవాలి జీడిపప్పు, రెండు స్పూన్ల సిరోజిపప్పు, పొట్టు తీసిన బాదం పలుకులు, పిస్తా పప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూడు స్పూన్లు నెయ్యి వేసి సేమియా వేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఉంచి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు కచ్చితంగా అడుగు మందపాటి గిన్నెను తీసుకొని ఒక లీటర్ పాలు పోసి మరిగించాలి. పాలు (300ml) వచ్చేంతవరకు మరగబెట్టాలి. ఈ మిల్క్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ మిల్క్ దొరకని వాళ్ళు 250 గ్రామ్స్ పంచదార తీసుకోండి. వేసిన తర్వాత పాలను బాగా కలపాలి. లేదంటే అడుగుపట్టేస్తుంది. ఇప్పుడు ఎండు ద్రాక్ష పావుకప్పు పాలు మరగనివ్వండి ఇప్పుడు మరిగే పాలలో వేయించుకున్న నట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన సేమ్యా వేసి నెమ్మదిగా కలపాలి. 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో మరగనివ్వాలి. యాలకుల పొడి ఒక పొంగు రాంగానే, స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి మీద పల్చగా అనిపిస్తుంది కానీ చల్లారక చిక్కబడుతుంది. అంతే అండి ఎంతో రుచికరమైన కూర్మా రెడీ…