Annavaram Prasadam Recipe : అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం.. ఆలయ ప్రసాదంలా ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు!

Annavaram prasadam Recipe :  వీర వేంకట సత్యనారాయణ స్వామిగా కొలువైన మహా పుణ్యక్షేత్రం అన్నవరం.. పిలిస్తే చాలు.. పలికే దైవంగా సత్యనారాయణ స్వామికి పేరుంది. 1891లో ఈ ఆలయాన్ని అన్నవరంలోని రత్నగిరి కొండపై నిర్మించడం జరిగింది. అయితే, అన్నవరం ఆలయంలో అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ.. స్వామి ప్రసాదాన్ని మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా… ఏ పండగ అయినా.. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ చేస్తే ఎంతో అద్భుతంగా, పర్ఫెక్ట్ గా, టేస్టీగా వస్తుంది. అదే రుచి,రంగు, సువాసన వచ్చి తీరుతుంది. ప్రసాదం.. నిజమైన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు :
ఎర్ర గోధుమ రవ్వ 1కప్పు,  బెల్లం 1కప్పు, పంచదార 1కప్పు, నెయ్యి 1/3కప్పు,  పట్టిక , యాలకుల పొడి ,  కుంకుమపువ్వు

తయారీ విధానం.. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టి అందులో ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ లో మీద కలుపుతూ వేపుకుంటే.. 10 నుంచి 12 నిమిషాలు లోపటిదాకా వెళ్లి రవ్వ వేగి బయటికి తెల్లగా కనిపిస్తుంది అప్పటిదాకా వేయించుకోవాలి. ఈ ప్రసాదానికి గోధుమ రవ్వ మంచిగా ఉండదు. ప్రసాదం తయారీకి బన్సీ రవ్వ (Bency Rava) తీసుకోవాలి. రవ్వ వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి.

ఇప్పుడు సుగంధద్రవ్యాల కోసం సగం జాజికాయ, పావు టీ స్పూన్ పట్టిక, పట్టిక నీళ్లను శుభ్రపరుస్తుంది, అలాగే ఇంటికి దిష్టి తీయడానికి కడతారు. అలాంటి పటిక తీసుకోవాలి. ఒకటి స్పూన్ యాలకపొడి, రెండు చిటికెల్లా కుంకుమ పువ్వు వేసి మెత్తగా దంచుకోవాలి. అన్నవరం ప్రసాదం చల్లారిన తర్వాత కూడా తేమగా మృదువుగా ఉండడానికి రహస్యం..

annavaram prasadam recipe in telugu
annavaram prasadam recipe in telugu

ఇప్పుడు స్టవ్ వెలిగించి కచ్చితంగా అడుగు మందంగా ఉన్న పాత్ర లో ఒక కప్పు రవ్వ కి మూడు కప్పులు నీళ్లు పోసి మరిగించండి ఎసరు తెరలు కాగుతున్నప్పుడే వేయించిన గోధుమ రవ్వ వేసి ఉండలు లేకుండా కలుపుతూ మెత్తగా ఉడకనివ్వాలి. 15 నిమిషాలు పడుతుంది. అందులో ఒక కప్పు పంచదార వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ప్రసాదం దగ్గర అయ్యే వరకు ఉడికించాలి. పంచదార కరిగిపోయి పాకం చిక్కబడి ప్రసాదం మంచి రంగులో వస్తుంది. 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది.. ఇప్పుడు బెల్లం తురుము వేసి కరగనివ్వాలి.

ఒక కప్పు రవ్వ కి కప్పు పంచదార కప్పు బెల్లం, తీసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ముప్పావు కప్పు నెయ్యి వేసి ప్రసాదాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పర్ఫెక్ట్ గా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం కలర్ తరవాత దంచి పెట్టుకున్న సుగంధ ద్రవ్యాలను వేసి కలపాలి. ప్రసాదంలో నెయ్యి పైకి తేలేంతవరకు మూత పెట్టి ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్న ప్రసాదాన్ని విస్తరాకుల చుట్టి పెడితే దాని పరిమళం ప్రసాదానికి దిగుతుంది. అప్పుడు ఇంకా రుచిగా ఉంటుంది ప్రసాదం.. అంతే ఎంతో రుచికరమైన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం రెడీ..

Read Also : Thiruvathirai Kali Prasadam : చిదంబర ఆలయంలో ప్రత్యేక కలి ప్రసాదం.. శివునికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని ఎలా తయారుచేస్తారో తెలుసా?

Leave a Comment