Jonna Laddu : ఈ జొన్న లడ్డు రోజుకు ఒకటి తింటే చాలు మీ ఆరోగ్యం మీ గుప్పెట్లో ఉన్నట్లే.. జొన్నల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ పోషక విలువలు కలిగి ఉంటుంది. కొలెస్ట్రాల్ అరికడుతుంది. ఇలా చేస్తే జొన్న లడ్డులు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.. జొన్న లడ్డులకు కావలసిన పదార్థాలు.. జొన్నలు ఆఫ్ కేజీ, బెల్లం ఆఫ్ కేజీ, నెయ్యి, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు, యాలకులు పొడి, ఎండు కొబ్బరి పొడి..
జొన్న లడ్డు తయారీ విధానం…
ముందుగా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకోవాలి ఇప్పుడు అందులో తెల్ల జొన్నలు 1/2 కేజీ తీసుకొని దోరగా వేయించాలి.. చల్లారే అంతవరకు పక్కన పెట్టుకోవాలి.. తరవాత మిక్సీ జారులో బరక పిండిలా తయారు చేసుకోవాలి.. ఇప్పుడు అదే మూకుడులో కొంచెం నెయ్యి వేసుకొని బాదంపప్పు ,జీడిపప్పు ,పిస్తా పప్పు, యాలకులు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఎండు కొబ్బరి పొడి కూడా తీసుకొని పచ్చివాసన పోయేంతవరకు రెండు నిమిషాలు వేయించుకోవాలి.. తర్వాత ఈ పదార్థాలన్నీ మిక్సీ జార్ లో వేసుకొని పొడిలా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు జొన్న పిండిలో బెల్లం, కొబ్బరి పొడి, మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్డూల చుట్టుకోవాలి.. తాటి బెల్లం, జిగురు బెల్లం లడ్డూలకి మంచిగా ఉంటుంది.. మీరు షుగర్ వాడాలనుకుంటే కండే చక్కెర వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. పటిక బెల్లం లో ఉంటుంది. అంతే ఎంతో రుచికరమైన జొన్న లడ్డులు రెడీ..
Read Also : Ragi Recipes : రాగి పిండితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. అనేక రకాల వంటలు తయారు చేసుకోవచ్చు తెలుసా?