Mutton Fry : మటన్ ఫ్రై.. ఒక్కసారి ఇలా చేసి చూడండి.. ఫంక్షన్లలో ఉన్నట్టే ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Mutton Fry : మటన్ అంటే చాలామంది ఇష్టంగా తింటారు. చికెన్ కన్నా మటన్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా ఫంక్షన్లలో రెస్టారెంట్లలోనూ మటన్ (Mutton Fry) వెరైటీ వంటకాలు సర్వ్ చేస్తుంటారు. సాధారణంగా పెళ్లి వంటకాల్లో ఇతర ఫంక్షన్లలోనూ మటన్ రెసిపీలను తయారుచేసి వడ్డిస్తుంటారు. ఇంట్లో తయారుచేసుకునే మటన్ కూడా అంత రుచిగా రావాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే. మటన్ ఫ్రై తయారీలో కొన్ని ఇన్‌గ్రిడియంట్స్ వాడటం ద్వారా ఎంతో రుచి వస్తుంది. రెస్టారెంట్లలో మటన్ ఫ్రై అంత రుచిగా ఉండటానికి ఇవే కారణమని చెప్పవచ్చు. ఇంతకీ మటన్ తయారీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

మటన్ ఫ్రై తయారీకి ముందుగా కావాల్సిన పదార్థాల్లో.. మటన్ 1/2కేజీ, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2స్పూన్, కారం, 1 టీ స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, లవంగాలు 3, దాల్చిన చెక్క1ఇంచు, కరేపాకు, ఉల్లిపాయ 2, ,ధనియాల పొడి 1 టీ స్పూన్ , జీలకర్ర పొడి 1/2టీ స్పూన్ , గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 5టేబుల్ స్పూన్..

Mutton Fry : spicy mutton fry recipe in telugu with rice
Mutton Fry : spicy mutton fry recipe in telugu with rice

మటన్ వేపుడు తయారీ విధానం….

చిన్న ముక్కలు చేసుకుని మటన్ శుభ్రంగా కడిగిన హాఫ్ కేజీ తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో మటన్ వేసి ఆఫ్ స్పూన్ పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడవుగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి, లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక రెమ్మ కరేపాకు, వేసి మటన్ మునిగేంత వరకు వాటర్ పోయాలి. సుమారుగా ఆఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ మూత పెట్టి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచి సెవెన్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి..

ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ తీసి మటన్ మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి రెండు మీడియం సైజు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి మూడు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన మటన్ ను నీళ్లతో సహా వేసుకోవాలి ఫ్లేమ్ ని ఐ ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ ఇంకిపోయేంతవరకు ఉడికించాలి.

ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది మరో ఐదు నిమిషాలు మటన్ ను ఆయిల్లో వేయించుకోవాలి . మటన్ ముక్క విరగకుండా కలర్ మారేంతవరకు అట్ల కాడతో నెమ్మదిగా కలుపుకోవాలి. మటన్ ఉడికేటప్పుడు ముందుగానే వేసుకున్నాం.. రుచికి తగినంత మళ్ళీ వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి.. ఇప్పుడు సన్నని మంటపై రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన మటన్ ఫ్రై రెడీ…

Read Also : Mutton Head Fry : మటన్ తలకాయ ఫ్రై.. వారంలో ఒక్కసారైనా తినాల్సిందే.. ఇలా వండితే చాలా రుచిగా ఉంటుంది.. ఓసారి ట్రై చేయండి..!

Leave a Comment