vankaya chicken curry : వంకాయ చికెన్ టమాట కర్రీ ఎప్పుడైనా తిన్నారా? అయితే ఈసారి తప్పకుండా తిని చూడండి.. ఆ తర్వాత మీరే వావ్ ఎంత టేస్టీ అంటారు. అంత రుచిగా ఉంటుంది. వంకాయ చికెన్ టమాట కర్రీ ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు చేయాల్సిందిల్లా.. ఎలా తయారు చేయాలో తెలిస్తే చాలు.. రెస్టారెంట్ స్టయిల్‌లో అంత రుచి రావడానికి అందులో వాడే ఇంగ్రేడియంట్స్ ఏంటి? వాటిని ఎలా తయారుచేసుకోవాలి? వంకాయ చికెన్ టమాట కర్రీ తయారీలో ఎలా వాడాలి ఇప్పుడు తెలుసుకుందాం..
వంకాయ చికెన్ టమాట కర్రీ కావాల్సిన పదార్థాలు… నూనె 3 టేబుల్ స్పూన్ , ఉల్లిపాయ 1, వంకాయ 100 గ్రాముల, 1/2 కేజీ చికెన్, టమాట 200 గ్రాముల, చిన్నకట్ట మెంతుకూర కూర 1, పసుపు 1, అల్లం ముక్కలు 1, పచ్చిమిర్చి 3, కారం 2 టేబుల్ స్పూన్ల, చింతపండు గుజ్జు 1 టీ స్పూన్, కొత్తిమీర, మెంతుపొడి 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, పంచదార, ఉప్పు

వంకాయ చికెన్ టమాట కర్రీ తయారీ విధానం.. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలి అందులో 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు ఒక టీ స్పూన్ వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు చిన్న కట్ట మెంతుకూర కూర పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు అందులో ఆఫ్ కేజీ చికెన్ వేయాలి హై ఫ్లేమ్ లో ఉంచి చికెన్ లో వాటర్ పోయే అంతవరకు వేయించుకోవాలి. చికెన్ లో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాలు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఆఫ్ కేజీ చికెన్ కు 200 గ్రాముల టమాటాలు వేసుకోవాలి 5 నిమిషాలు తర్వాత అల్లం ముక్కలు ఎప్పుడైనా కూరలో వాటర్ వచ్చినప్పుడు 50 ml హాట్ వాటర్ వేసుకోవాలి.
రెండు నిమిషాల తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన మూడు వేసుకోవాలి.100 గ్రామ్స్ వంకాయ కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి 5 నిమిషాల తర్వాత కారం 2 టేబుల్ స్పూన్ల వేసి కలపాలి. పులుపు కావాలనుకున్నవాళ్లు చింతపండు గుజ్జు వేసుకోవాలి ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు.. కొంచెం కొత్తిమీర చల్లాలి మెంతుపొడి హాఫ్ టీ స్పూన్, కొంచెం దాల్చిన చెక్క పొడి, హాఫ్ టీ స్పూన్ పంచదార వేసి బాగా కలపాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ లో నూనె పైకి తేలేంతవరకు గ్రేవి వచ్చేవరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. ఎంతో రుచికరమైన వంకాయ టమాట చికెన్ రెడీ..
Read Also : Natu Kodi Pulusu Recipe : నాటుకోడి పులుసును ఇలా వండి చూడండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఓసారి ట్రై చేయండి..!