Back Pain Yoga : వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

Back Pain Yoga : యోగా.. దీని వల్ల హెల్త్‌కు ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇది చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్‌కు చెక్ పెట్టొచ్చు. కరోనా టైంలోనూ యోగా ఎంతో కీ రోల్ పోషించింది. ప్రతి రోజూ యోగా చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. చాలా మంది అనేక నొప్పులతో బాధపడుతుంటారు. కొన్ని ఆసనాల వేయడం వల్ల ఆ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Back Pain Yoga
Back Pain Yoga

ముందుగా మలాసనం గురించి తెలుసుకుందాం. రెండు కాళ్లను చాపీ.. చేతులు రెండు కిందకు పెట్టి మోకాళ్లను వంచి కూర్చోవాలి. ఈ సమయంలో మీ కాళ్లు కింద ఫ్లాట్‌గా ఉండేటట్లు చూసుకోవాలి. స్పైన్‌ను మాత్రం నిటారు ఉండేలా చూడాలి. కరోనా కారణంగా చాలా మంది ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సీటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల వెన్నునొప్పి వచ్చే చాన్స్ ఉంది. ఈ ఆసనం ద్వారా కాస్త ఉపశమనం పొందొచ్చు. ఇందుకు ఉపయోగపడేది మరో ఆసనం.. శలభాసనం.. నేలమీద పొట్టపై పడుకుని కాళ్లు చేతులు చాపాలి.

బ్రీతింగ్ హోల్డ్‌లో ఉంచి కాళ్లను పైకి ఎత్తాలి. బ్యాలెన్స్ మొత్తం పొట్టపై ఉంచండి. తలను భుజాన్ని సైతం పైకి ఎత్తాలి. కాళ్లను నిటారుగా ఉంచండి. ఇలా సుమారు పది సెకండ్స్ వరకు చేయండి. ఆ తర్వాత కాళ్లను కింద పెట్టి శ్వాసను వదలండి. ఇక ఇందులో మరో ముఖ్యమైనది అధోముఖి స్వనాశన..

దీనితో పాటు ఊర్ధ్వ ముఖ మర్జరి ఆసనం​అధోముఖ మర్జరి ఆసనం వేయడం వల్ల బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది. ఈ ఆసనాలు వేయడం వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఆసనాలు వేసే ముందు, వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోవద్దు. ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.

Read Also : Yoga Health Benefits : యోగా ఎవరికీ వారే చేస్తే మంచిదా..? అందరూ చేయాల్సిన అవసరం లేదా..!

Leave a Comment