Ullipaya Bondalu : బొండాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. అందరూ లొట్టలేసుకుని తినేస్తారు. అందులోనూ ఉల్లిబొండాలంటే చాలు.. నోరూరి పోతుంది కదా.. ఎక్కువగా వంటల్లో వాడే వాటిలో ఉల్లిపాయలు.. ప్రతి వంటింట్లో ఎక్కువగా లభిస్తుంటాయి. ఉల్లిపాయలు లేకుండా వంట ఉండదని చెప్పవచ్చు. ఉల్లిపాయతో అనేక రకాలుగా వంటలు చేస్తుంటాం. కరకరలాడే వంటకాలను ఉల్లిపాయలతో చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ బోండాలను రుచిగా తయారుచేసుకోవచ్చు. ఉల్లిపాయ బొండాల తయారీకి అవసరమైన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
తయారీకి కావల్సిన పదార్థాలు ఇవే :
మూడు, ఉల్లిపాయలు, ఒక కప్పు మైదా పిండి, పావు కప్పు బియ్యం పిండి, అర కప్పు పెరుగు, ఒక బంగాళాదుంప, రెండు పచ్చిమిర్చి చిన్నగా తరిమినవి, టీ స్పూన్ అల్లం తరమినిది, పావు టీ స్పూన్ వంటసోడా, తగినంత ఉప్పు, సరిపడా నూనె, ఒక రెమ్మ తరిగిన కరివేపాకు తీసుకోవాలి.

తయారీ విధానం ఇదే :
మిక్సీలో బంగాళాదుంప మెత్తగా పేస్ట్ చేసుకోండి. గిన్నెలో పెరుగు కలుపుకోవాలి. ఆ పెరుగులో మిక్సీ పట్టిన బంగాళాదుంప పేస్ట్ కలపాలి. మైదాపిండి, బియ్యం పిండి, ఉప్పు కలపాలి. తగినన్ని నీళ్లు పోసుకోవాలి. పిండిని పలుచగా మూడు నుంచి ఐదు నిమిషాల వరకు కలపాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వంటసోడా కలపాలి. ఉల్లిపాయ ముక్కలను కొన్ని కలపాలి.
కళాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడిక్కిన తర్వాత పిండిని కొంచెంకొంచెంగా బోండాలుగా చేసుకోవాలి. బొండాలను అంటుకోకుండా వేసుకోవాలి. ఈ బోండాలను సన్నని మంటపై ఎర్రగా అయ్యేవరకు చేసుకోవాలి. అంతే రుచికరమైన ఉల్లిపాయ బోండాలు రెడీగా ఉన్నట్టే.. పల్లి చట్నీ, టమాట చట్నీలతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
Read Also : Amaranth Plant : ఎర్ర రక్తకణాలు బాగా పెరగాలంటే.. ఈ మొక్కను రోజూ తినాల్సిందే.. అద్భుతంగా పనిచేస్తుంది..!