Psyllium Husk Benefits : ఈ మొక్కను తింటే అనారోగ్య సమస్యలు దూరం.. బీపీ, షుగర్‌కు బెస్డ్ మెడిసిన్..

Psyllium Husk Benefits : మానవ శరీరం కాలక్రమేణా అనారోగ్యం బారిన పడుతుంటుంది. అందుకు అనేక కారణాలుంటాయి. టైంకు ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి, నిద్రలేమి, రాత్రంతా మేల్కొని ఉండటం, పోషకాహార లోపం వలన మన శరీరం శక్తిని కోల్పోతుంటుంది. తద్వారా కొత్త కొత్త వ్యాధులు చుట్టుముడతాయి. కొందరు దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతుంటారు. అటువంటి వ్యక్తులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ తమ జేబులను గుల్ల చేసుకుంటుంటారు. అయితే, బీపీ మరియు డయాబెటీస్ వ్యాధులతో బాధపడేవారు ఈ మొక్కను ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Psyllium Husk Benefits : Psyllium Husk Powder Good Medicine for BP and Diabetes Patients
Psyllium Husk Benefits : Psyllium Husk Powder Good Medicine for BP and Diabetes Patients

ఇస్పాగులా లేదా సైలియం పొట్టు.. ఇది ఒకరకమైన మొక్క.. దీని నుంచి లభించే విత్తనాలే మెడిసిన్.. సైలియం పొట్టు అనేది ప్లాంటారోవా మొక్క నుంచి తయారైన ఒక ఫైబర్. ఇందులో ఆరోగ్యానికి మంచి చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ మొక్క మన దేశంలోని గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఏడారి ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే గుజరాత్‌లో దీని ఉత్పత్తి 35 శాతంగా ఉంది.ఈ మొక్కను “సిలియం” అని కూడా పిలుస్తారట.. ఇరాన్ దేశంలో దీని ద్వారా సాంప్రదాయ వైద్యం చేస్తున్నారని తెలుస్తోంది.

దీని నుంచి లభించే ఫైబర్ అనేది జంతువులకే కాదు.. మనుషులకు కూడా చాలా మేలు చేస్తుందట.. గుండె, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన ఔషధం.. సైలియం పొట్టును తీపి పదార్థాల్లో కంటే సాఫ్ట్ డ్రింక్స్‌లో ఎక్కువగా వాడుతుంటారట..ఇది ఆసియా, మధ్యధరా , ఉత్తర ఆఫ్రికా తర్వాత భారతదేశంలో అత్యధికంగా లభిస్తోంది. వాణిజ్యపరంగా కూడా దీనికి మంచి మార్కెట్ ఉంది. ఈ మొక్క నుంచి లభించే గింజల్లో అధిక ఫైబర్ దొరుకుతుంది. ఇది కాస్టిపేషన్, జీర్ణసమస్యలు, డయాబెటీస్, అధిక కొలెస్ట్రారల్, అధిక రక్తపోటు నివారణకు అద్భుత ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Read Also : Bermuda Grass Benefits : ‘గరికగడ్డి’తో బోలెడు ప్రయోజనాలు.. అన్ని ఆరోగ్య సమస్యలకు ఒక్కటే మెడిసిన్?

Leave a Comment