Chicken Pakoda : చికెన్ పకోడీని ఎప్పుడైనా ట్రై చేశారా? స్ట్రీట్ స్టయిల్లో కొంచెం డిఫరెంట్ చికెన్ పకోడీని తయారుచేసుకోవచ్చు. ముందుగా 700 గ్రాములు చికెన్ తీసుకోవాలి. మీడియం సైజులో ముక్కలు కొట్టించుకోండి. అప్పుడే చికెన్ బాగా వేగుతుంది. బోన్స్‌తో ఉంటే చికెన్ మంచి టేస్ట్ వస్తుంది. బోన్ లెస్ అయినా పర్వాలేదు. ఒక టీ స్పూన్ నూనె, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఇంకా బాగా స్పైసీగా కావాలి అంటే కొద్దిగా వేసుకోవచ్చు.
అలాగే, వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్, వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మసాలా ఫ్లేవర్ మరీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. కలర్ కోసం కాశ్మీరీ చిల్లి పౌడర్ 2 టీ స్పూన్లు వేసుకోవాలి. దీంట్లోనే చిల్లి ఫ్లెక్స్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఒకవేళ చిల్లీ ఫ్లెక్స్ లేనట్లయితే ఎండు మిరపకాయలని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవచ్చు.
రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక రెండు రెమ్మలు కరివేపాకు తీసుకొని సన్నగా కట్ చేసి వేయాలి. కొత్తిమీరను కూడా కొద్దిగా తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. కొద్ది నిమ్మకాయను తీసుకొని రసాన్ని పిండుకోండి. గుడ్డు పగలగొట్టి వేసుకోండి. ఒక్క రెండు టేబుల్ స్పూన్లలో కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది లేదంటే బియ్యం పిండి వేసుకోవచ్చు. ఒక రెండు టేబుల్ స్పూన్లు శెనగపిండి కూడా కలిపాలి. అన్ని వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి సరిపోతుంది. ఈ చికెన్ ముక్కలకి అన్ని బాగా పట్టేటట్టు కలిపేసుకున్న తర్వాత గిన్ని మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి.
ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇలా కొద్దికొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి. ఫస్ట్ ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించాలి. వేసిన వెంటనే తిప్పకండి. ఒక 2 నిమిషాలు ఆగి నిదానంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుంది. లోపల సాఫ్ట్ పైపైనా క్రిస్పీగా ఉండేలా వేయించుకుంటే సరిపోతుంది.
చికెన్ ముక్కను నోట్లో వేసుకొని చూస్తే తెలిసిపోతుంది. వేగేటప్పుడే వేగాయా లేదా చెక్ చేసుకోవాలి. అన్నింటినీ ఆయిల్ లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్ల వేసేసుకోవాలి. అన్ని వేయించేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఆయిల్ లోనే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలకు మధ్యలో గాట్లు పెట్టి వేసి వేయించుకోవాలి. గాట్లు పెట్టకపోతే పేలుతాయి. పచ్చిమిర్చిని వేయించేసిన తర్వాత చికెన్ ముక్కల పైన వేసుకోవాలి. అందులో ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసి లైట్‌గా నిమ్మకాయ పిండుకోవాలి. ఉల్లిపాయలతో నంచుకుని తిన్నారంటే చికెన్ పకోడీ చాలా రుచిగా క్రిస్పీగా ఉంటాయి.
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.