Egg Puff Recipe : how to make egg puff without oven in telugu
Egg Puff Recipe : ఒవేన్ లేకుండా ఎగ్ పఫ్ ఎప్పుడైనా తయారుచేశారా? ఎప్పుడైనా ఎగ్ పఫ్ తినాలనిపించినా లేదా పిల్లలు అడిగినా గాని బేకరీకే వెళ్లి తేవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఓవెన్ లేకపోయినా చాలా క్రిస్పీగా లేయర్స్‌గా వచ్చేటట్లు ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు : ఎగ్, మైదా పిండి, బటర్, సాల్ట్, ఉల్లిపాయ, కారం, జీలకర్ర, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాల,ధనియాల పొడి, కొత్తిమీర, ఆయిల్..
తయారీ విధానం : ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు మైదా పిండి లేదా మైదా పిండి ప్లేస్ లో గోధుమపిండి అయిన తీసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ బటర్ని కూడా వేసుకొని బటర్ అనేది మైదా పిండిలో పూర్తిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఈ బట్టర్ ప్లేస్‌లో ఆయిల్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైనా పీట మీద గాని లేదా బండ మీద గాని వేసి పిండిని 2, 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే పిండిని లేయర్స్ అంత బాగా వస్తాయి తర్వాత ఈ పిండి ముద్దని ఒక బౌల్ లో పెట్టేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
ఎగ్ పఫ్లోకి కర్రీ తయారీ విధానం :
ఎగ్ పఫ్ లోకి ఎగ్స్ ని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే, మీడియం సైజు 3 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ లో 1లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చివేసుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. కాస్త మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఆఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత కారం అనేది టేస్ట్‌కు తగ్గట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని ఈ కర్రీని పక్కన పెట్టుకోవాలి.
ఒక బౌల్ తీసుకొని దీంట్లో కరిగించుకున్న బటర్ ని పావు కప్పు వేసుకోవాలి ఈ బట్టర్ ప్లేస్ లో ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బటర్ లో వన్ అండ్ ఆఫ్ టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఈ మైదా అనేది బటర్ లో పూర్తిగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న ఈ బాల్స్‌ని ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా పొడి పిండిని వేసుకొని చపాతీల్లాగా పల్చగా రుద్దుకోవాలి. బట్టర్ మైదా పేస్ట్ చపాతీలపైన అప్లై చేయండి. చపాతీ మొత్తానికి అప్లై చేసుకోవాలి. బట్టర్ లేకపోయినా ఆయిల్ తగిన చేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా మైదాని వేయండి. చపాతీ లేయర్స్ కూడా బాగా వస్తాయి. లైట్‌గా మైదానం వేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి.
పెద్ద చపాతి అయ్యేంతవరకు రుద్దుకోండి. లైట్ గా ప్రెస్ చేస్తూ కొద్దిగా పెద్దగా చపాతి వచ్చేంతవరకు రుద్దండి. మరీ పల్చగా రుద్దుకోవద్దు. కాస్త మందంగానే ఉండాలి. ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోండి. 4 వైపులను కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క షీట్ పైన కర్రీని పెట్టుకోండి. ఈ కర్రీ పైన ఎగ్‌ని ఆఫ్ కి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చివరిలో మొత్తాన్ని మైదా పేస్ట్‌ని అప్లై చేసుకోవాలి. అన్నింటికీ ఇలా అప్లై చేసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి. నచ్చిన షేపులో ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకున్న తర్వాత విడిపోకుండా లైట్‌గా ప్రెస్ చేయాలి.
అన్ని వైపుల లైట్‌గా ప్రెస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని లైట్‌గా వేడిక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేయించుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే లేయర్స్ అనేవి చక్కగా వస్తాయి. అన్ని ఒకేసారి కాకుండా ఆయిల్‌కు సరిపడినన్ని వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత అన్నింటిని ఆయిల్‌లో నుంచి తీసేసుకోవాలి. మీకు ఎప్పుడైనా ఎగ్ పఫ్ తినాలనిపించిన పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఎగ్ పఫ్ కావాలని అడిగినా ఇలా ఈజీగా చేసి పెట్టవచ్చు. ఇంట్లో ఓవెన్ లేకుండానే చాలా ఈజీగా చేసుకోవచ్చు.
Read Also : Egg Bajji Recipe : బండి మీద దొరికే ఎగ్ బజ్జి ఇంట్లోనే ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..!
Anjeer : డ్రై ఫ్రూట్స్‌లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.