Durga Devi Mantra : దుర్గాదేవి ఆలయ దర్శనం, దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం ద్వారా అనేక కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. గృహంలో అయినా సరే మంగళవారం పూట దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన విధంగా దుర్గా అష్టోత్తరం చదువుకోవాలి. కుంకుమార్చన చేస్తే దుర్గాదేవి అనుగ్రహం వల్ల శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే, కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఎవరైనా సరే కుంకుమ బొట్టు పెట్టుకునే ముందు కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని తర్వాత కుంకుమ బొట్టును ధరించాలి.
అలా చేస్తే.. కుంకుమ బొట్టులో దైవీశక్తి మొత్తం ఆజ్ఞా చక్రంలోకి చేరి ఆ దైవీశక్తి ప్రచోదనమవుతుంది. అందుకే.. కాళ్లు చేతులు కడుక్కున్న తర్వాత కుంకుమ బొట్టు ధరించాలి. అయితే, దేవాలయంలో మాత్రం ఈ నియమం వర్తించదు. గృహంలో మాత్రమే వర్తిస్తుంది. అలాగే కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలుతో కానీ ఉంగరం వేలుతో గాని కుంకుమ బొట్టును ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో చూపుడు వేలుతో కుంకుమ బొట్టును ధరించరాదు. అలాగే బొట్టు పెట్టుకున్న తర్వాత దాన్ని సరి చేయటానికి జలాన్ని వినియోగించుకోవచ్చు. జలం ఉపయోగించి బొట్టు సరిచేసుకోవడం మంచిది.
అలాగే, కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు పార్వతీ పరమేశ్వరులను మనసులో స్మరించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మహిళలైతే కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు శ్రీ మాత్రే నమః అనే చిన్న మంత్రాన్ని చదువుకుంటూ కుంకుమ బొట్టు ధరించాలి. ఒక్కొక్కసారి తెలియకుండా బొట్టు పెట్టుకునేటప్పుడు కుంకుమ కింద పడుతూ ఉంటుంది. అలా కుంకుమ జారీ కిందపడినప్పుడు దుర్గాదేవిని మనసులో స్మరించుకోవాలి. దుమ్దుర్గాయై నమః అని చదువుకున్నట్లయితే కుంకుమ కిందపడినప్పటికీ పొరపాటున ఆ దోషం తొలగిపోతుంది. అదే విధంగా, కుంకుమ బొట్టు ధరించిన తర్వాత వెంటనే మంచం మీద నిద్రించరాదు. ముహూర్త కాలం అంటే.. 48 నిమిషాలు దాటిన తర్వాత మాత్రమే నిద్రించాలి. కుంకుమ బొట్టు సందర్భంగా ఈ నియమాలు పాటించడం ద్వారా సకల శుభాలను పొందవచ్చు.
మంగళవారం రోజున రాహుకాలంలో చేసే పూజ అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. రాహుకాలం అంటే దేవతా శక్తులన్నీ కూడా విశ్రమించే సమయం. రాహుకాల సమయంలో దుర్గాదేవికి నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించినట్లయితే అన్ని రకాలైన శత్రు బాధలు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. దుర్గాదేవి ఆలయానికి వెళ్లి రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించలేని వాళ్లు మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర కూడా నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవచ్చు. అయితే, మంగళవారం రాహుకాల పూజ సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేకమైన ముగ్గు వేసి నిమ్మదొప్పలు వెలిగించినట్లయితే తీవ్రమైన కష్టాలనుంచి సులభంగా బయటపడవచ్చు. దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన ముగ్గు షర్ట్ కోణం ముగ్గు.. మీరు ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర దుర్గాదేవి చిత్రపటాన్ని ఉంచి అక్కడ ఒక పీటని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట మీద షర్ట్ కోణం ముగ్గు వేయాలి. దాని పక్కనే అష్టదళ పద్మ ముగ్గు కూడా వేయాలి. దుర్గాదేవికి అష్టదళ పద్మ ముగ్గు కూడా చాలా ఇష్టం. 8 దళాలు ఉన్నటువంటి పద్మ ముగ్గు వేసుకోవాలి.
ఈ షర్ట్ కూడా ముగ్గులో మనకి మొత్తం 12 బిందువులు వస్తాయి. ఈ అష్టదళ పద్మం ముగ్గులో మొత్తం మనకి 8 స్థానాలు వస్తే.. ఈ 12 బిందువులు 8 స్థానాల్లో 12 ప్లస్, 8 మొత్తం 20చోట్ల నిమ్మ దప్పల్లో దీపాలు వెలిగించాలి. అలా 20 నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించినట్లయితే.. దుర్గాదేవి అనుగ్రహం వల్ల తీవ్రమైన కష్టాల నుంచి బయటపడవచ్చు. అలా నిమ్మదొప్పల్లో షర్ట్ కోణంలో ఉన్న బిందువుల్లో అష్టదళ పద్మల్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో నిమ్మ దోప్పలు పెట్టి దీపాలు వెలిగించిన తర్వాత దేవీ ఖడ్గమాలా స్తోత్రం చదువుకోవాలి. దుర్గాదేవికి పులిహోర నైవేద్యం పెట్టినట్లయితే జీవితంలో ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్న చాలా సులభంగా బయటపడవచ్చు. భార్యాభర్తల అనుకూలతకు శత్రు నివారణకు, అనారోగ్య సమస్యలు తొలగింప చేసుకోవడానికి ఈ ముగ్గులు వేసి రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి.
అలాగే, ఎప్పుడైనా సరే రాహుకాలం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో శుభ కార్యక్రమాలు చేయకూడదు. ధనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. వివాహం, గృహప్రవేశము ఇటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. ధనానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు అయినా రాహుకాలంలో కొన్ని పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా మొండి బాకీలు వసూలు చేసుకోవాలంటే రాహుకాలంలో వసూలు చేసుకుంటే చాలా మంచిది. మొండి బాకీలు తొందరగా వసూలు అవుతాయి. కోర్టులో దావా వేయాలంటే రాహుకాలంలో దావా వేస్తే చాలా మంచిది. కోర్టు వ్యవహారాల్లో తొందరగా విజయ ప్రాప్తిని పొందవచ్చు.
అలాగే, మంగళవారం సందర్భంగా దుర్గాదేవిని కుంకుమతో అర్చన చేస్తున్న లేదా కుంకుమ బొట్టు ధరిస్తున్న ఈ శ్లోకం చదువుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ‘కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం వాక్య శుభదం శాంతిరస్తు సదామయ్య‘ శ్లోకం. మీరు ఇంట్లో ఎప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకుంటున్న ఈ శ్లోకం చదువుకొని కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే.. దుర్గా దేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. దుర్గాదేవి అనుగ్రహం కోసం ముక్కోటి దేవతలు అనుగ్రహం పొందాలంటే కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ శక్తివంతమైన శ్లోకాన్ని చదువుకోవాలి.
Read Also : Adhika Shravana Masam 2023 : అధిక శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయొచ్చు? ఏది చేయకూడదు? ఏయే నియమాలు పాటించాలి?
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.