
Eating Chia Seeds can lose weight Fast in Few Days
Eating Chia Seeds : ఇటీవల కాలంలో చియా సీడ్స్(విత్తనాలు) ఎక్కువ ప్రాచూర్యంలోకి వచ్చాయి. ఇందులో మన శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు, విటమిన్స్, మినరల్స్ చాలా ఉన్నాయి. అందుకే వీటిని సూపర్ ఫుడ్ అని అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. మనలో బరువు తగ్గాలని చాలా మంది వివిధ కసరత్తులు చేస్తుంటారు. కానీ బరువును తగ్గించడంలో ఈ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయట. వీటిని ప్రతి రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
గుడ్లకు ప్రత్యామ్నాయంగా..
చియా విత్తనాల్లో జింక్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి ఎక్కువ. ఒమేగా3 ఫ్యాటీయాసిడ్స్, ఫైబర్‌తో పాటు కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. వీటిల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని గుడ్లకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చునని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. మెలనిన్ హార్మోన్స్, సెరొటోనిన్‌ను ఈ విత్తనాలు బ్యాలెన్స్ చేస్తాయి. దీని వల్ల నిద్రలేమితో బాధపడే వారికి హాయిగా నిద్ర పడుతుంది. వీటిని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల మంచి నిద్ర మీ సొంతమవుతుంది.
చిరు తిండ్ల జోలికి వెళ్లకుండా..
ఈ సీడ్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తీసుకుంటే తొందరగా ఆకలి కాదు. దీంతో చిరుతిండ్ల జోలికి వెళ్లకుండా ఉండొచ్చు. ఫలితంగా చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు. డయాబెటిస్ ను సైతం ఇది అదుపులో ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. నైట్ టైంలో ఓ గ్లాసు వాటర్ లో చియా విత్తనాలను నానబెట్టి మరుసటి రోజు మార్నింగ్ ఆ వాటర్‌ను తాగితే డయాబెటిస్ తగ్గుతుంది.
హై బీపీని సైతం ఇది కంట్రోల్ చేస్తుంది. ఈ విత్తనాల్లో మోనో శాచురెటెడ్ ఉండటం వల్ల అది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. బాడీలో పేరుకుపోయిన విష వ్యర్ధాలను సైతం తొలగిస్తుంది. గుండెను పదిలంగా ఉంచడంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ప్రొటీన్ పుష్కలంగా ఉండటంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. చర్మ, దంతాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌కు వీటితో చెక్ పెట్టొచ్చు.
శరీరంలో పెరుకుపోయిన చెడు కొవ్వును తొలగించడంలో ఈ చియా విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. తొందరగా బరువు తగ్గాలనుకునేవారు ఈ చియా విత్తనాలను ఓసారి ట్రై చేయండి. కొవ్వును మాత్రమే కాదు.. శరీరంలోని ఇతర వ్యర్థాలను కూడా బయటకు పంపేస్తాయి. చియా విత్తనాలను నానాబెట్టిన తర్వాత ఆ నీళ్లను నేరుగా తాగడం ద్వారా సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గడంలో ఇదో అద్భుతమైన చిట్కాగా చెప్పుకోవచ్చు.
బరువు తగ్గాలనే కోరిక ఉంటే సరిపోదు. దానికి తగినట్టుగా మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. అప్పుడే మీరు ఆశించిన ఫలితాలు తొందరగా వస్తాయి. షుగర్ వ్యాధితో పాటు ఇతర బీపీ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను కూడా ఈ చియా విత్తనాలతో దూరం పెట్టొచ్చు. అంత అద్భుతంగా పనిచేస్తాయని పోషక నిపుణులు చెబుతున్నారు. బీపీ అదుపులోకి ఉంచుకోవాలంటే ఈ చియా విత్తనాల నీటిని తాగేందుకు ప్రయత్నించండి. తద్వారా మీ బీపీ ఎప్పుడూ మీ కంట్రోల్లోనే ఉంటుంది.
Read Also : Horoscope Today : ఈ రాశి వారికి సాయం చేసే గుణం ఎక్కువంట.. ఈ లిస్టులో మీరున్నారో లేదో చూసుకోండి
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.