
Warm Milk Benefits : Benefits of Drinking Warm Milk at Night You Must Know
Warm Milk Benefits : ప్రస్తుత సమాజంలో చాలా మందికి పడుకోగానే నిద్ర పట్టదు. రాత్రి 10 నుంచి ట్రై చేస్తే ఉదయం 2 లేదా3 గంటల వరకు నేటి యువత, ఉద్యోగస్తులు మేల్కొనే ఉంటున్నట్టు తెలుస్తోంది. యువతనేమో మొబైల్ ఫోన్లకు అలవాటు నిద్ర వచ్చినా పడుకోకుండా గేమ్స్, చాటింగ్స్ లాంటివి చేస్తూ నిద్రను దూరం చేసుకుంటున్నారు. ఇకపోతే ఉద్యోగులు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల టైమింగ్స్ ప్రకారం రాత్రంతా మేల్కొని వర్క్ చేస్తూ ఉదయం పడుకుంటున్నారు.
ఇలాంటి సమయాల్లో పాలను తాగడం ద్వరా ఆరోగ్యానికి మంచిది కాదని చేటు చేస్తాయని పోషక నిపుణులు కూడా చెబుతున్నారు. పూర్వం మనవాళ్లు రాత్రి 9లోపే భోజనం పూర్తి చేసి నిద్రపోయేవారట. కానీ నేటి సమాజంలో ఆహార అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. అర్థరాత్రులు కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకుని భోజనాలు చేస్తున్నారు. ఇలా టైమింగ్ లేని ఆహారం, నిద్ర, అధిక పని ఒత్తిడి నిద్రలేమికి కారణం అవుతాయట..
నిద్రలేమికి వేడి పాలతో చెక్..
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకునే ముందు వేడి పాలు తాగితే మంచిగా నిద్ర పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. కొందరిలో ఇప్పటికీ పడుకునే ముందు వేడి పాలు తాగే అలవాటు ఉంటుంది. అలాంటి వారికి నిద్రలేమి సమస్య వేధించదు. ఒకప్పుడు తల్లిదండ్రులు రాత్రి భోజనం తర్వాత ‘పసుపు పాలు ‘ లేదా ‘బాదం పాలు’ తాగాలని బలవంతం చేసేవారు. ఎందుకంటే గోరు వెచ్చని పాలు తాగితే చక్కగా నిద్రపడుతుందని వారి నమ్మకం. కొందరు రాత్రి పూట కాఫీ, టీ లాంటివి తాగి నిద్రరావడం లేదని బాధపడుతుంటున్నారు. వాటిలో ఉండే గుణాలు నిద్రను దూరం చేస్తాయి. పాలు తాగితే వెంటనే ఎందుకు నిద్ర వస్తుందో తెలుసా..
సైంటిస్టులు ఏం చెప్పారంటే..
మనం రోజు తాగే పాలల్లో కేసిన్ ట్రిప్టిక్ హైడ్రోలైజేట్ అని పిలువబడే పాల పెప్టైడ్‌ల మిశ్రమం ఉంటుంది. ఇది ఒత్తిడిని నియంత్రించి మంచి నిద్రను ప్రోత్సహిస్తుందని సైంటిస్టులు స్పష్టంచేశారు. అంతేకాకుండా పాలు నిద్రకు ఏ విధంగా సాయపడుతుందని.. అమెరికా రసాయన సంఘనం జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ విభాగంలో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం సైంటిస్టులు సీటీహెచ్‌లో కొన్ని ఖచ్చితమౌన పెప్టైడ్‌లను కనుగొన్నారు.
నిద్రను బాగా ప్రోత్సహించే సిటీహెచ్‌లోని ఇతర కారకాలను మరింత అన్వేషించాలని వారు సూచించారు. ముఖ్యంగా పాలల్లో సీటీహెచ్ మూలకాలు అధికంగా ఉన్నాయని గుర్తించారు. అందుకోసం రాత్రి పడుకునే మందుకు గోరువెచ్చని పాలు తాగితే శరీరం రిలాక్స్ అవుతుందని, అందువల్ల మంచి నిద్ర వస్తుందని వెల్లడించారు.
పాలల్లో ఎన్ని పోషక విలువలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పాలు తాగడం ద్వారా మెదడులోని రక్తనాళాలు రిలాక్స్ అయి నిద్ర ముంచుకువచ్చేస్తుంది. అందుకే పాలు తాగితే నిద్ర వస్తుందని అంటుంటారు. అందులోనూ రాత్రి సమయంలో పాలు తాగడం ద్వారా కంటినిండా మంచి నిద్ర వస్తుందని చెబుతుంటారు. ఇందులోని పోషక విలువలు నిద్ర వచ్చేలా ప్రేరిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమితో సమస్య ఉన్నవారు పాలు తాగడం ద్వారా ఆ సమస్యను తొందరగా దూరం చేసుకోవచ్చు.
Read Also : Lemon Coffee Benefits : నిమ్మకాయ కాఫీతో ఇన్ని ప్రయోజనాలా? రుచిలోనే కాదు ఆరోగ్యానికి ది బెస్ట్!
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.