
Indian Travellers Can Go Australia Who Have Received Covaxin Shots
Covaxin : కరోనా మహమ్మారి భారతదేశానికి ఓ పెద్ద శాపంగా మారింది. దీని ప్రభావానికి మన దేశం మీద ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఆంక్షలు పెడుతున్నాయి. చాలా వరకు మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారికి అయితే కఠినమైన ఆంక్షల ఉన్నాయి. దుబాయ్, ఒమన్, లండన్, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ లాంటి దేశాలు మన దేశం నుంచి వెళ్లే వారిపై చాలా రకాల రూల్స్ పెట్టేశాయి. మన దేశంలో సెకండ్ వేవ్ సృష్టించిన విధ్వంసానికి కొత్త వేరియంట్ లు కూడా పుట్టుకొచ్చాయి. దీని దెబ్బకు మన దేశం అతలాకుతలం అయిపోయింది.
అయితే దీన్నిఅరికట్టేందుకు మన దేశంలో ఇప్పటికే రెండు రకాల టీకాలు అందుబాటులోకి వచ్చేశాయి. అవే కొవాగ్జిన్, కొవీషీల్డ్. వీటిపై కూడా కొన్ని దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటికి అన్ని రకాల పర్మిషన్లు ఇవ్వకపోవడంతో వీటిపై ఆయా దేశాలు కొన్ని రకాల ఆంక్షలు పెట్టేశాయి. వీటిని రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఆ దేశంలో క్వారంటైన్ ఆంక్షలు పెట్టేసింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా దేశం ఓ గుడ్ న్యూస్ చెప్పిది. కొవాగ్జిన్ టీకాను అధికారికంగా గుర్తించింది. ఈ టీకా తీసుకున్న వారిని నేరుగా అనుమతిస్తామని చెప్పేసింది.
ఇప్పటి దాకా తమ దేశంలో ఈ టీకా తీసుకున్న వారిమీద ఉన్నటువంటి ఆంక్షలను సడలిస్తూ భారత్ బయోటెక్ కంపెనీ డెవలప్ చేసినటువంటి కొవాగ్జిన్ టీకా మీద తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఈ టీకాలు తీసుకున్న వారు నేరుగా తమ దేశంలోకి రావొచ్చని తెలిపింది. ఈ వార్త ఆ దేశానికి వెళ్లే వారికి ఓ పెద్ద రిలీప్ అనే చెప్పాలి. ఎందుకంటే మన దేశంలో చాలామంది కొవాగ్జిన్ తీసుకున్న వారే ఉన్నారు. కాగా 18 నుంచి 60 ఏళ్ల వారు ఈ టీకాలు తీసుకుంటే వారికి ఈ ప్రతిపాదన వర్తిస్తుందని ప్రకటించింది ఆస్ట్రేలియా దేశం.
కోవాగ్జిన్ టీకాకు కొన్ని దేశాల్లో గుర్తింపు లేకపోవడంతో ఆ దేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలు ఎత్తేయడంతో ఆ దేశానికి భారతీయ ప్రయాణికులతో పాటు ఇతర దేశాల ప్రయాణికులు క్యూ కట్టేస్తున్నారు. కోవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. ఒకవేళ సింగిల్ డోసు మాత్రమే వేసుకుని ఉంటే.. వారిని ఆస్ట్రేలియా అనుమతించే పరిస్థితి ఉండదు. కరోనా టీకాల్లో ఒక్కో టీకా సమర్థత వేరుగా ఉంటుంది. అందుకే కొన్ని టీకాలకు కొన్ని దేశాలు మాత్రమే గుర్తింపునిచ్చాయి.
కోవాగ్జిన్ టీకాకు ఇప్పటికీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గుర్తింపు పొందలేదు. ఈ పరిస్థితుల్లో కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారు ఇతర దేశాలకు వెళ్లేందుకు ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా ఆంక్షలు ఎత్తేయడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు ఉపశమనం కలిగించింది.
కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారంతా స్వేచ్ఛగా ఆస్ట్రేలియాలో పర్యటించవచ్చు. ఆస్ట్రేలియన్లు కూడా భారత్ సహా ఇతర దేశాలకు వెళ్లిరావొచ్చు. మీరు కూడా ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే కోవాగ్జిన్ టీకా వేయించుకున్నారా? లేదా? ఒకవేళ కోవాగ్జిన్ టీకా వేయించుకుంటే.. మీరు స్వేచ్ఛగా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆస్ట్రేలియా వెళ్లి రావొచ్చు.
Read Also : Horoscope Today : ఈ రాశి వారికి సాయం చేసే గుణం ఎక్కువంట.. ఈ లిస్టులో మీరున్నారో లేదో చూసుకోండి
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.