Money Remedies : పుట్టిన తేది ప్రకారం.. మీ ఇంట్లో ఈ శక్తివంతమైన వస్తువులను ఉంచితే డబ్బే డబ్బు.. కనకవర్షంలా కురుస్తుంది..!

Money Remedies In Telugu : మీరు పుట్టిన తేదీని బట్టి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా ఇంట్లో వ్యతిరేక శక్తులను బయటకు పంపవచ్చు. అనుకూల శక్తులను ఇంట్లోకి ఆహ్వానం పలకవచ్చు. ఎవరైనా సరే.. 1,10,19, 28 తేదీల్లో జన్మిస్తే.. అదృష్ట సంఖ్య 1 కలిగిన వాళ్ళు ఎవరైనా రాగి లోహంతో తయారు చేసిన గుండ్రని సూర్యుడు రూపాన్ని మీ గుమ్మం ముందు ఏర్పాటు చేసుకోండి. మీ ఇంట్లో తూర్పు దిక్కులు ఎక్కడైనా సరే రాగి లోహంతో చేసిన గుండ్రని సూర్యుడు రూపాన్ని ఉంచుకోండి. తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. వెదురుతో తయారు చేసిన వేణువు అంటే.. ఒక ఫ్లూట్‌ను మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోండి. ఇలా చేస్తే అదృష్ట సంఖ్య 1 వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసొస్తుంది.

అదే విధంగా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్లు అదృష్ట సంఖ్య.. 2 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే తెల్లటి గవ్వలతో చేసిన బొమ్మని మీ ఇంట్లో వాయువ్యం మూల పెట్టుకోండి. దానివల్ల తొందరగా ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. అదే విధంగా, 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్లు అంటే అదృష్ట సంఖ్య 3 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో ఒక రుద్రాక్షను పెట్టుకోండి. పూజ గదిలో రుద్రాక్ష ఉంచుకుంటే.. సకల శుభాలు కలుగుతాయి. అదే విధంగా, 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వాళ్లు. అంటే.. అదృష్ట సంఖ్య 4 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే అది దుర్గాదేవికి సంబంధించిన అంకె కాబట్టి దుర్గాదేవి స్వరూపం చాముండా దేవి స్వరూపమైన హత జోడిని మీ గృహంలో పెట్టుకోండి. దాంతో చండీ అమ్మవారి అనుగ్రహం కలిగి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తొందరగా పొందవచ్చు.

Money Remedies : మీ ఇంట్లో సిరిసంపదలు కలగాలంటే ఇలా చేయాల్సిందే..  

మీరు పుట్టిన తేదీ 5, 14, 23 తేదీల్లో జన్మించి ఉంటే.. అదృష్ట సంఖ్య 5 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే కుబేరుడి విగ్రహం లేదా కుబేరుడి బొమ్మ, కుబేరుడి ఫోటో మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోండి. దాంతో అదృష్టం బాగా కలిసొస్తుంది. కుబేరుడి బొమ్మ కుబేరుడి ఫొటో మీకు అందుబాటులో లేకపోతే.. మరకత గణపతిని మీ పూజ గదిలో ఉంచుకోండి. దానివల్ల అదృష్ట సంఖ్య 5 వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్లు అదృష్ట సంఖ్య 6 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే నెమలి పించాన్ని మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోండి. నెమలి పించం మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకుంటే.. అదృష్ట సంఖ్య 6 వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది.

Money Remedies : based on your birth date, you should keep these things in your house
Money Remedies In Telugu : based on your birth date, you should keep these things in your house

అదే విధంగా, 7, 16, 25 తేదీల్లో జన్మించినవాళ్లలో అదృష్ట సంఖ్య 7 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే శ్వేతార్క గణపతిని అంటే.. తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి విగ్రహాన్ని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. దాంతో గృహంలో తొందరగా అదృష్టాన్ని పొందవచ్చు. అదే విధంగా, 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళలో అదృష్ట సంఖ్య 8 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే.. మీ ఇంట్లో దక్షిణ దిక్కులు నల్లటి క్రిస్టల్స్ ని ఏర్పాటు చేసుకోండి. దాని వల్ల తొందరగా అదృష్టం కలిసొస్తుంది. చివరగా 9, 18, 27 తేదీల్లో జన్మించినవాళ్లు అంటే.. అదృష్ట సంఖ్య 9 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే.. మీ గృహంలో దక్షిణ దిక్కులో ఏదైనా ఒక పిరమిడ్‌ను ఏర్పాటు చేసుకోండి. అలా చేస్తే, అదృష్ట సంఖ్య 9 వాళ్లకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. పుట్టిన తేదీని బట్టి ఈ ప్రత్యేకమైన వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోండి. అలా, వీలుకాని పక్షంలో మీ ఇంటి సింహద్వారం మీ గుమ్మంపై భాగంలో వాస్తు హనుమాన్ ఫొటో ఉంచుకోండి.

Read Also : Adhika Shravana Masam 2023 : అధిక శ్రావణ మాసంలో ఈ ఒక్క పని చేస్తే.. 14 ఏళ్ల పాటు ఐశ్వర్యం కలుగుతుంది..!

Leave a Comment