Cluster Beans Recipe : గోరుచిక్కుడు కాయలతో ఎప్పుడు చేసుకునే ఫ్రై కాకుండా ఈ విధంగా కుక్కర్లో కర్రీ చేసుకోండి. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలా త్వరగా అయిపోతుంది. కర్రీ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రై చేసిన పల్లీలు, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పొడిని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడిన వరకు ఫ్రై చేసుకోవాలి.
ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక సన్నగా తరిగిన టమాట ఒకటి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్‌లో కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో 1/4 కిలో గోరుచిక్కుడుకాయలను కడిగి ఇలాంటి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌కు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కొంచెం మగ్గనివ్వాలి. గోరుచిక్కుడుకాయ మగ్గిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. కర్రీ మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయాక స్టవ్ ఆన్ చేసుకొని కర్రీలో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చిక్కుడుకాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా కలుపుకున్నాక గోరుచిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్‌లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ..