Pappu Sambar Recipe : నోరూరించే పల్లెటూరి పప్పు చారు, సాంబారు.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ మరి తినేస్తారు.. చాలా టేస్టీగా ఉంటుంది!

Pappu Sambar Recipe : పప్సు సాంబారు.. ఈ పేరు వినగానే చాలామంది పెళ్లిళ్లు, ఫంక్షన్లు గుర్తుకువస్తాయి. పెళ్లి వంటకాల్లో పప్పు సాంబారు లేకుండా విందు భోజనమే ఉండదు. అలాంటిది పప్సు సాంబారును ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు తెలుసా? ఇలా పప్సు సాంబారును ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి చేశారంటే.. మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది.. ఇంట్లో వాళ్లు కూడా చాలా ఇష్టంగా తింటారు. పప్సు సాంబారు తయారు చేయడం చాలామందికి తెలిసే ఉంటుంది. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి నచ్చేలా సింపుల్‌గా ఈ పప్పు సాంబారు చేసి వడ్డించండి.. తిన్నాక వాళ్లు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. అంత టేస్టీగా ఉంటుంది ఈ సాంబారు.. ఇంతకీ ఈ పప్పు సాంబారు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు :
అర కిలో పప్పుకు రెండు కప్పుల నీళ్లు పోయాలి. కుక్కర్ మీడియం ప్లేమ్‌లో పెట్టి 5 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. ఆ తర్వాత పప్పును బాగా ఎనిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకుని కొద్ది సేపు నీటిలో నానా బెట్టుకోవాలి.

సాంబారు పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు :
ఒక అర టీ స్పూన్ దనియాలు, అప్ టీ స్పూన్ జిలకర్ర, చిటికెడు మెంతులు, అప్ టీ స్పూన్ మిరియాలు, నాలుగు ఎండు మిరిపకాయలు, కొన్ని కరివేపాకు రెమ్మలను ఒక గిన్నెలో వేసి మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడిగా పట్టుకోవాలి.

Pappu Sambar Recipe : పల్లెటూరి పప్పు చారు.. ఈ కొలతలతో సింపుల్‌గా టేస్టీగా..

పప్పు సాంబారు తయారీ విధానం ఇలా :
ముందుగా.. ఒక గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఒక టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపపప్పు, పచ్చి శెనగపప్పు, ఎండు మిరపకాయలు, నాలుగు వెల్లులి కచ్చపచ్చగా దంచుకోవాలి. ఉల్లిపాయలు (చిన్నవి అయితే బెటర్), నాలుగు పచ్చి మిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి.. మీడియం సైజులో ఒక టమాటా ముక్కలను కట్ చేసుకుని అందులో కలపాలి.

Pappu Sambar Recipe in telugu pappu charu recipe telangana style
Pappu Sambar Recipe in telugu pappu charu recipe telangana style

అన్ని బాగా మగ్గిన తర్వాత సాంబారు పొడిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు పులుసును అందులో పోయాలి. కొద్దిగా ఉప్పు వేసి.. ఆ తర్వాత రెండు గ్లాసులో నీళ్లు పోయాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసి కలపాలి. వెంటనే ఉడికిన పప్పును కూడా అందులో వేయాలి. నాలుగు ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి.. ఆపై గిన్నెతో పక్కన పెట్టేయండి.

చివరిగా.. కొద్దిగా ఆయిల్ తీసుకుని అందులో కొద్దిగా ఇంగువా, కరివేపాకు కలిపి వేయించుకోవాలి. చివరిగా అదంతా పప్పులో వేయాలి. కొద్దిగా తురిమిన కొత్తిమీర కూడా వేస్తే సరి.. గుమగుమలాడే రుచికరమైన పప్పు సాంబారు రెడీ..

Read Also : Tomato Bajji Recipe : వర్షం పడుతుండగా.. టమాటా బజ్జి తిన్నారంటే ఆ టేస్టే వేరబ్బా.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేసుకోండి..!

Leave a Comment