Mysore Bonda Recipe : హోటల్ స్టైల్ మైసూర్ బోండాను ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? అయితే ఇప్పుడు ట్రై చేయండి.. అంతేకాదు.. ఇనిస్టెంట్ చట్నీలు కూడా తయారు చేసుకోవచ్చు. వేడివేడి మైసూర్ బోండాలను ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మైసూర్ బోండా తయారు చేయాలంటే మైదాపిండి-రెండు గ్లాసులు, పుల్లటి పెరుగు-ఒక గ్లాస్, ఉప్పు, బ్రేకింగ్ సోడా, జీలకర్ర- ఒక టీ స్పూన్, నూనె వంటి పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే హోటల్ స్టయిల్‌లో ఎంతో రుచికరమైన మైసూర్ బోండాను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
తయారీ విధానం :
ముందుగా ఒక బౌలు తీసుకొని అందులో రెండు గ్లాసుల మైదాపిండి తీసుకొని ఒక్క టీ స్పూన్ ఉప్పు కలుపుదాము అలాగే ఒక గ్లాస్ పుల్లటి పెరుగు వేసి కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి జోరుగా ఉండకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి. రాత్రి అంతా నానపెట్టుకోవాలి. మరుసటి రోజు నాన పెట్టుకున్న పిండిలో బ్రేకింగ్ సోడా పావు టీ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్, ఇప్పుడు కొంచెం ఉప్పు తీసుకోవాలని రుచికి తగినంత.. ఇప్పుడు ఒక కళాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపోయేంత నూనె పోసుకోవాలి..

ఈ పిండిలో ఉల్లిపాయలు, కొత్తిమీర ,పుదీనా, కరివేపాకు, అల్లం తరుగు, కొంచెం ఇడ్లీ పిండి వేసుకుని చేస్తే చాలా టేస్టీగా వస్తాయి… కానీ మనం వాటర్ స్టైల్ బోండాలు కావాలని అనుకున్నాం కనుక ఇప్పుడు మనం ఇలా చేస్తున్నాం.. నూనె వేడెక్కిన తర్వాత మరీ పెద్ద సైజు కాకోకుండా మీడియం సైజ్ లో వేసుకోవాలి లోపట బోండా ఉడకాలి కాబట్టి ఇప్పుడు చిన్న చిన్నవిగా వేసుకుంటే బాలు బాగా పొంగుతాయి కొద్దిసేపు తర్వాత సగం వేగిన తర్వాత బొండాలను తీయాలి.. పిండి మొత్తం అయిపోయిన తర్వాత బొండాలను మళ్లీ వేసి ఎర్రగా కోవాలి. ఇలా చేస్తే మెత్తగా కరకర లాడేటి క్రిస్పీగా వస్తాయి. అంతే ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ మైసూర్ బోండాలు రెడీ…..
చట్నీ తయారీ విధానం…
స్టాప్ వెలిగించి ఒక కళాయిలో కొద్దిగా అల్లం ముక్కలు, చింతపండు రెబ్బలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి ఇప్పుడు అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి. గుప్పెడు పుదీనా ఆకులు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, కొంచెం కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి కలపాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ పోసి మరి మెత్తగా కాకోకుండా చట్నీ గ్రైండ్ చేసుకోవాలి. మంచి గ్రీన్ కలర్ అల్లం చట్నీ రెడీ…
కారం చట్నీ రెడీ…
స్టవ్ వెలిగించి కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసుకోవాలి. కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు , తాలింపులో చిటికెడు ఇంగువ, ఒక స్పూన్ నువ్వులు, కొంచెం కరివేపాకు వేసుకోవాల. తాలింపు మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అరకప్పు వాటర్ పోసుకోవాలి రుచికి తగినంత ఉప్పు, ఎర్ర కారం ఒక స్పూను, మెంతుపొడి అర టీ స్పూన్, సన్నగా తరిమిన ఒక ఉల్లిపాయ ముక్కలు. మూడు చెక్కల నిమ్మరసం, తరిగిన కొత్తిమీర కొంచెం అంతే ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ కారం చట్నీ రెడీ…
Read Also : Ullipaya Bondalu : పిండి నానబెట్టకుండానే.. కొద్ది నిమిషాల్లోనే ఉల్లిపాయ బొండాలను వేసుకోవచ్చు..!