Mirabilis Jalapa Uses : ఈ చంద్ర కాంత మొక్క కనిపిస్తే అస్సలు వదలకండి.. ఎందుకంటే..?

Mirabilis Jalapa Uses : చంద్రకాంత మొక్క… దీని పూలు చాలా అందంగా కనిపిస్తాయి. దీని శాస్త్రీయ‌నామం మిరాబిలిస్ జలపా (Mirabilis Jalapa).. ఈ పూలు అనేక రంగుల్లో ఉంటాయి. దీనిని నాలుగు గంటల పువ్వు అనీ పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది కామన్ గా సాయంత్రం 4 గంటలకు వికసిస్తుంది. డే టైంలో ముడుచుకుని ఉంటుంది. దీని నుంచి వచ్చే పరిమళం చాలా బాగుంటుంది. ఇది చాలా సున్నితమైనది కూడా. ఎండ తగిలితే దీని పూలు వెంటనే వాడిపోతాయి. ఇందులోని గింజలు రుద్రాక్షల మాదిరిగా ఉండటం వల్ల ఈ పూలను రుద్రాక్ష పువ్వులు అనీ అంటారు. ఈ మొక్కలో పువ్వులు మినహా మిగతా భాగాల్లో ఔషధ గుణాలుంటాయి. ఆకులు, వేర్లు, దుంపులతో మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతున్నది.

మచ్చలు, తామర, మొటిమలు నివారించేందుకు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి కట్టులాగా కడితే అవి ఇట్టే నయమైపోతాయి. ఈ పువ్వులను ఆహరంలో వాడే రంగుల్లో ఎక్కువగా వినియోగిస్తారు. కేకులపైనా రంగుల కోసం వీటిని వాడుతుంటారు. మూత్ర విసర్జన, శుద్ధీకరణ, గాయాలు మానేలా చేయడంలో దీనిని వినియోగిస్తారు. ఈ మొక్కతో కషాయాన్ని తయారు చేస్తుంటారు. ఇది అనేక వ్యాధులకు నివారణిగా ఉపయోగపడుతుంది.

తేలు, తేనెటీగలు కుట్టిన టైంలో ఈ ఆకుల రస్తాన్ని ఆ చోట రాస్తే నొప్పి, మంట నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఈ మొక్క విత్తనాల నుంచి తీసిన ప్రొటీన్ పదార్థాలు క్యాన్సర్ ను నివారించడంలో, సూక్ష్మజీవులను నాశనం చేయడంలో పనిచేయస్తాయని ఇటీవలే జరిపిన పరిశోధనల్లో తేలింది. దీనిని చైనా వారు యాంటిడిప్రెసెంట్, మలేరియల్‌గా వినియోగిస్తారు. దురద కలిగిన చోటు ఈ మొక్క ఆకులను పేస్టులా చేసి రాస్తే రిలీఫ్ కలుగుతుంది.

Read Also : Prosopis Juliflora Benefits : పేరుకే పిచ్చి మొక్క.. దాని ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే…!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Leave a Comment