Get Rid of Mouth Ulcers fast Naturally
Mouth Ulcers Fast Naturally : నోటిపూత సమస్య ఈ మధ్య ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతోంది. చూడటానికి చిన్నగా కనిపించినా దాని మంట భరించలేకుండా ఉంటుంది. బయట వాళ్లకు అది మామూలుగానే కనిపించినా.. దానిని అనుభవించే వారికి మాత్రమే దాని బాధ తెలుస్తుంది.
ఆ మంటను మాటల్లో వర్ణించలేము. ఏమీ తినలేం. మనకు చాలా ఇష్టమైన ఆహారం మన కళ్ల ముందే కనిపిస్తున్నా.. దానిని ఆస్వాదించలేము. ఇది పెదవులకు లోపలి వైపు, చిగుర్ల దగ్గర ఎక్కువగా వస్తుంటుంది. తెల్లగా పొక్కుల మాదిరిగా కనిపిస్తుంది. అక్కడ కారం తగలితే ఇక అంతే సంగతులు. కనీసం టీ తాగేందుకు కూడా చాలా మంది వెనకడుగు వేస్తారు. ఇది కొందరినే బాధిస్తుంది. వచ్చిన వారికే మళ్లీ మళ్లీ వస్తుంటుంది.
Mushrooms : పుట్ట గొడుగులతో అంతులేని ప్రయోజనాలు.. అధిక ఒత్తిడి, డిప్రెషన్‌కు చెక్..!
నోటి పూతకు కారణాలు ఏంటి ?
నోటి పూత రావడానికి ఆహారపు అలవాట్లు, జీవన శైలి, విటమిన్ల సమత్యుల్యం కారణంగా చెప్పవచ్చు. సైంటిఫిక్‌గా విటమిన్ బీ కాంప్లెక్స్ లోపం కూడా కారణం అని చెపుతారు. కొందరికి జన్యు పరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
నివారణ మార్గం ఏమిటి ?
నోటి పూతకు అల్లోపతిలో మందులు ఉన్నాయి. దీనిని నివారించేందుకు బీ కాంప్లెక్స్ విటమిన్‌లు, పూతపై రాసుకునే క్రీమ్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడితే కొంత మేరకు నివారించవచ్చు. తక్షణ ఉపషమనం కూడా లభిస్తుంది.
సహజ పద్దతిలో ఎలా తగ్గించుకోవాలి..?
ఈ నోటి పూతను సహజ పద్దతిలో కూడా తగ్గించుకోవచ్చు. అంటే ఎలాంటి మెడిసిన్ వాడకుండా కూడా నివారించుకోవచ్చు. మనకు అందుబాటులో ఉండే వనరులను వాడుకొని నొప్పి నుంచి ఉపషమనం పొందవచ్చు. మంచి నాణ్యతగా ఉన్న నెయ్యి తీసుకొని, పొక్కులు వచ్చిన చోట రాయాలి. ముఖ్యంగా దానిని రాసి ఒక అరగంట వరకు దానిపై ఉండేలా చూసుకోవాలి. అంటే నీళ్లు కానీ ఆహారం కానీ తీసుకోకుంటే బాగుటుంది. ఇలా తరచుగా చేస్తూ ఉంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇలాగే గడ్డ పెరుగును కూడా ఉపయోగించవచ్చు.
Star Anise Benefits : అనాస పువ్వుతో అన్ని రోగాలకు చెక్ పెట్టొచ్చట.. నిజంగా సూపర్ కదూ..!
బియ్యం కడిగిన నీటిని ఒక గ్లాసులో తీసుకొని, కలండర్ కలిపి తాగితే తొందరగా ప్రభావం చూపుతుంది. బెల్లంని దచ్చి పొడిలా చేసి, దానికి కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేసి పొక్కులపై రాయాలి.
నోటిపూత సమస్య అనేది చాలా సర్వసాధారణమైనదిగా చెప్పవచ్చు. నోటిపూతను తగ్గించేందుకు ఇంగ్లీష్ మందులతో పనిలేదు. వంటింట్లో దొరికే సహజమైన దినుషులతోనే సులభంగా తగ్గించుకోవచ్చు. శొంఠి గురించి వినే ఉంటారు. ఈ శొంఠి కూడా నోటిపూతను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నోటిపూత లేదా నోటిపొక్కులుగా పిలిచే ఈ వ్యాధి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. నోటిపూత రావడానికి అనేక కారణాలు ఉంటాయి.
నోట్లో బ్యాక్టిరీయా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు నోటిభాగాల్లో ఏదో ఒక చోట ఇలాంటి నోటి పొక్కులు వస్తుంటాయి. చిన్నపాటి పొక్కు అయినప్పటికీ అది బాధించే స్థాయి తీవ్రత మాత్రం అధికంగా ఉంటుంది. ఏది తినలేని పరిస్థితి ఉంటుంది. నోటిలో కొంచెం కారం వస్తువులు తిన్నా ఎక్కడలేని మంటగా అనిపిస్తుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పైన చెప్పిన విధంగా రెమడీలు పాటిస్తే చాలు.. సాధ్యమైనంత తొందరగా బయటపడొచ్చు.
Negative Energy At Home : ఈ సమస్యలు ఉంటే.. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే? ఇలా తరిమేయండి!
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.