
mushroom health benefits in telugu
Mushroom Health Benefits : పుట్టగొడుగులను విదేశీయులు ఎక్కువ ఇష్టంగా తీసుకునే ఆహారం. ఒకప్పుడు భారతీయులు వీటికి దూరంగా ఉండేవారు. కానీ, వాటివలన కలిగే ప్రయోజనాల గురించి ఎప్పుడైతే తెలుసుకున్నారో… ఆ రోజు నుంచి తమ రెగ్యులర్ ఆహారంలో భాగం చేసుకున్నారు.
పుట్ట గొడుగులు శిలింధ్రాల జాతులకు చెందిన మొక్కలు.. చెత్తకుప్పల్లో, పాడుపడిన ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతుంటాయి. కానీ, ఇప్పుడు దీనిని ప్రధాన ఆదాయ, ఆరోగ్య పంటగా సాగు చేస్తున్నారు రైతులు. దిగుబడి విషయం అటుంచితే దీని ధర మాత్రం ఆకాశాన్నటుంది. తరచూ అనారోగ్యంతో బాధపడేవారు, అధిక ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడేవారు పుట్టగొడుకులను తింటే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
Mushrooms : పుట్టగొడుగులతో అంతులేని ఆరోగ్యం..
పుట్టగొడుగులను తరచూ తీసుకుంటే శరీరానికి సరిపడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటితో విభిన్న రకాల వంటలు చేసుకోవచ్చు. వెజిటేరియన్ ప్రియులు పుట్టగొడుగులను ఇష్టంగా తింటారు. ఇందులో అధికంగా యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి.
అవి శరీరంలో కలిగే వాపులను నియంత్రిస్తాయి. అదే విధంగా ఒబెసిటీ (అధిక బరువు), గుండె జబ్బులు,. డయాబెటిస్ వంటి రోగాలను దరిచేరనివ్వదు. పుట్టగొడుగులు తింటే మానసిక ఒత్తిడి, ఆందోళనలు దూరం అవుతాయి.
ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ జాషువా అధ్యయనం ప్రకారం.. మష్రూమ్స్ తరచూ తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయన్నారు. ఇందులో నిరోధక ఇన్ఫ్లమేటరీ అమైనో యాసిడ్స్ ఎక్కువగా కనిపిస్తాయన్నారు. పుట్టగొడుగులలో ఎర్గోథియోనిన్ ఉంటుందని.. ఈ అమైనో ఆమ్లం హ్యుమన్ బాడీలో తయారు కాదని.. కేవలం మష్రూమ్స్‌లో మాత్రమే మనం చూడవచ్చన్నారు. వీటిని ఎక్కువగా తినడం వలన ఎర్గోథియోనిన్ అనేది విడుదలై ఒత్తిడిని తగ్గిస్తుందన్నారు.
అనుకోకుండా వచ్చే స్కిజోఫ్రెనియా అనే వ్యాధులను కూడా పుట్టగొడుగులతో కంట్రోల్ చేయవచ్చట.. బై పోలార్ డిజార్డర్, డిప్రెషన్ వంటి పెను ప్రమాదాలకు నివారించడంలో కూడా పుట్టగొడుగులు యూస్ అవుతాయి.
అదనపు పొటాషియం వీటిలో అధికంగా ఉండటం వలన ఆందోళనను వెంటనే తగ్గిస్తుంది. మష్రూమ్స్ తినడం వలన బ్రెయిన్‌లో నరాల కనెక్టివిటీని 10 శాతం పెంపొందిస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరకుండా అడ్డుకోవడంలో పుట్టగొడుగులు సాయం చేస్తాయని తెలుస్తోంది.
పుట్టగొడుగుల సేకరణలో జాగ్రత్త :
సాధారణంగా పుట్టగొడుగులు అనగానే ప్రమాదమని భావిస్తుంటారు. విషపూరితమైనవని తినాాలంటేనే భయపడిపోతుంటారు. వాస్తవానికి చాలా పుట్టగొడుగులు విషపూరితమైనవే ఉంటాయి. అందులో కొన్ని బలమైన పోషకాలు కలిగిన పుట్టగొడగులు కూడా ఉంటాయి. అలాంటి తినగలిగే పుట్టగొడుగులను గుర్తించడమే అసలైన పని.
అలా సేకరించిన పుట్టగొడుగులను బాగా శుభ్రంగా కడగాలి. వేడినీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాతే ఆ పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవాలి. బాగా వేయించిన తర్వాత మాత్రమే ఈ పుట్టగొడుగుల రెసిపీని ఆస్వాదించాలి.
తినడానికి చాలా రుచిగా ఉండే పుట్టగొడుగులు అంటే చాలామంది ఇష్టంగా తింటారు కూడా. మీకు దగ్గరలో ఇలాంటి పుట్టగొడుగులు దొరికితే ఓసారి ట్రై చేయండి. ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోండి. పుట్టెడు పుట్టగొడుగులతో పుష్టికరమైన పోషకాలను పొందవచ్చు. అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు.
Read Also : Cheating Partner Revenge : మీ పార్టనర్ మోసం చేస్తున్నారా? రీవెంజ్ తీర్చుకోవాలని అనిపిస్తోందా?
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.