
5 best foods for 6 months old babies in telugu
5 best foods for 6 months old babies in telugu : శివువు జన్మించినప్పుడు మొదట తాగించేది తల్లి పాలు మాత్రమే.. తల్లి పాలు ఎంతో పోషకాహారంతో నిండి ఉంటాయి. అందుకే దాదాపు 5 నెలల నుంచి 6 నెలల వరకు తల్లి పాలను మాత్రమే పిల్లలకు పట్టించాలని అంటారు. కానీ, శిశువుకు 6 నెలల వయస్సు వచ్చిన తర్వాత పాలకు బదులుగా ఘన పదార్థాలతో కూడిన ఆహారాన్ని ఇవ్వాలని చెబుతారు. శిశువుకు పప్పు, అన్నం లేదా రోటీని తినిపించకూడదు. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. మీరు చిన్న పిల్లలకు అందించే అత్యంత పోషకమైన రుచికరమైన కొన్ని ఆహారాలేంటో తెలుసా? ఆరు నెలల పిల్లలకు ఎలాంటి ఆహారాలు ఇవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మూంగ్ దాల్ కిచిడీ :
ఈ కిచిడి కోసం మూంగ్ పప్పు, అన్నం కలిపి చిటికెడు ఉప్పు, పసుపు వేసి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. పూర్తయిన తర్వాత, ఆ మిశ్రమాన్ని గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి వేయాలి. దానికి కాస్త దేశీ నెయ్యి వేసి మీ పిల్లలకు తినిపించండి. మూంగ్ దాల్ కిచిడి తినడం వల్ల పిల్లలకు తగిన పోషకాహారం అందుతుంది. దాంతో పిల్లల ఎదుగుదల కూడా వేగంగా ఉంటుంది.
ఆపిల్ పురీ :
ఆపిల్ పురీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిల్లలకి ఆహారం ఇవ్వడానికి సులభమైన మార్గమని చెప్పవచ్చు. మీరు ప్రతిరోజూ శిశువుకు చిన్న మొత్తంలో ఆపిల్ పురీని తినిపించవచ్చు. ఇందుకోసం.. ఆపిల్‌పై తొక్క తీసి, గింజలను తొలగించి 1 విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. ఆ తర్వాత స్టీమ్ వదిలేయండి. అందులో ఆపిల్ కలిపి మీ పిల్లలకు తినిపించండి.
వోట్ మీల్ పూరీ :
మీ చిన్న బిడ్డకు చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. మీరు చేయాల్సిందల్లా ఒకటే.. వోట్ మీల్ మెత్తగా చేసి, ఆపై పాలతో ఉడికించాలి. మీకు కావాలంటే.. ఇందులో అరటిపండ్లు లేదా ఇతర పండ్లను కూడా యాడ్ చేయొచ్చు. పిల్లలకు రోజూ ఓట్ మీల్ పురీని తినిపించడం వల్ల ధృడంగా ఉంటారు. వోట్ మీల్ పిల్లల జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది.
బ్రోకలీ పూరీ :
బ్రోకలీలో పోషకాలు అధికంగా ఉండే కూరగాయ.. మీ పిల్లలను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. ఈ పూరీ చేయడానికి బ్రకోలీని చిన్న ముక్కలుగా కట్ చేసి, చిటికెడు ఉప్పుతో బాగా ఆవిరిలో ఉడికించండి. అంటే.. ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించాలి. ఆ తర్వాత, బ్రోకలీ పుష్పాలను బ్లెండ్ చేసి, వాటిని బేబీ రెగ్యులర్ డైట్‌లో చేర్చండి.
దాల్ వాటర్ :
కాయధాన్యాల్లో అవసరమైన విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది పిల్లల ఎదుగుదల కోసం ఈ దాల్ వాటర్ తాగిస్తుంటారు. దాల్ వాటర్ తయారీకి మీరు చేయాల్సిందల్లా.. మూంగ్ దాల్ లేదా ఏదైనా ఇతర పోషకాలు అధికంగా ఉండే పప్పు తీసుకోండి, పప్పును బాగా ఉడకబెట్టండి లేదా 1-2 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ ఉడికించాలి. పప్పు పూర్తిగా నీటిలో కరిగిన తర్వాత ఆ నీటిని ఒక చెంచా వరకు శిశువుకు తినిపించవచ్చు.
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్‌గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.