Chicken Dum Biryani : చికెన్ దమ్ బిర్యాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? ఏ రెస్టారెంట్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా పక్కకొలతలతో చేసుకోవచ్చు. దమ్ బిర్యాని అనగానే అది ఏదో పెద్ద ప్రొసీజర్ చాలా కష్టమని చాలామంది భయపడిపోతుంటారు. అలాంటిదేమీ లేదు. కొంచెం ప్రీ ప్రిపరేషన్ చేసుకుంటే చాలు.. బిర్యాని చేయడం చాలా ఈజీ. మీరు చేయాల్సిందిల్లా.. చికెన్ క్లీన్ చేసుకుని మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి. దమ్ బిర్యాని కోసం లెగ్ పీసెస్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది ఈ చికెన్ ని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక కిలో చికెన్ తీసుకోవాలి. దానికి వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకోండి. ఈ రైస్‌ని మనం బిర్యానీ వన్డే ముందు మినిమం ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి.
కావాల్సిన పదార్థాలు..
బ్రౌన్ ఆనియన్స్ అంటే.. దాదాపుగా పావు కేజీ ఆనియన్స్ వరకు పడతాయి. ఆయిల్లో కానీ, నెయ్యిలో కానీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్‌లో హాఫ్ టీ స్పూన్ సాజీర 4 లవంగాలు 4 ఇలాచీ ఒక్క అనాసపువ్వు నాలుగైదు చిన్న ముక్కల దాల్చిన చెక్క వేసుకోవాలి. వీటిని ఒకసారి పొడి సుకోవాలి. ఆ తర్వాత దీంట్లో పావు కప్పు పుదీనా వేసుకోవాలి. 1/4 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీంటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కావాలనుకుంటే.. కొన్ని వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్నా హాఫ్ కప్ పెరుగుని చికెన్‌లో వేసుకోవాలి. త్రీ టీ స్పూన్స్ లేదా టెస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫోర్ టీ స్పూన్స్ లేదా మీ కారాన్ని బట్టి కారంపొడి వేసుకోవచ్చు. టూ టీ స్పూన్స్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి.
హాఫ్ టీ స్పూన్ పసుపు 1/4 కప్పు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు మసాలాలన్నీ చికెన్‌కు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ బిర్యానిలోకి వేసుకోవాలి. అలాగే, సగం నిమ్మకాయని ఇందులో పిండుకోవాలి. మిగిలిపోయిన నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఒక టేబుల్ స్పూన్ ఇందులో వేసుకొని ఇవన్నీంటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని మినిమం ఒక గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. మనం ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత బాగుంటుంది.
తయారీ విధానం ఇలా :
మనం బిర్యాని దమ్ చేసుకోవడానికి ముందుగా రైస్‌ని కుక్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో సగానికి అన్నా ఎక్కువ వాటర్ పోసుకొని దాంట్లో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ వాటర్‌లో హాఫ్ టీ స్పూన్ సాజీర 4 లవంగాలు 4 ఇలాచి (యాలకులు) చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 2 నుంచి 3 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఈ వాటర్‌లో వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే.. రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడిపొడిగా ఉంటుంది ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ బియ్యాన్ని మొత్తం ముడకనివ్వద్దు. అంటే.. 62 శాతం నుంచి 70శాతం మాత్రమే ఉడకనివ్వాలి. ఈ రైస్ ఉడికే లోపు మనం దమ్ చేయడానికి చికెన్‌ని ప్రిపేర్ చేసుకోవాలి.
ఇప్పుడు, ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి.. బిర్యానీ వండాలంటే బిర్యాని గిన్నె మందంగా ఉంటే బాగుంటుంది. దాంట్లో అడుగున వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ, నెయ్యి కానీ వేసుకోవాలి. ఈ పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. అయితే, ఉడికించిన రైస్ పల్పాలుగా ఉండాలి. నొక్కి చూస్తే మనకి మొత్తంగా మెత్తగా అయిపోకూడదు. ఇప్పుడు దీంట్లోంచి ఈ రైస్ తీసేయాలి. నీళ్ళని వంచేసి ఆ రైస్‌ని చికెన్ మీద ఒక లేయర్ వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వెడల్పుగా రెండు లేయర్స్ మాదిరిగా వేసుకోవాలి. అందుకే.. సగం రైస్ వేసుకోవాలి. ఇక పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి.
ఇప్పుడు ఆ పైనుంచి ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. అంటే.. ఒక టు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన గట్టిగా మూత పెట్టుకోవాలి. ఈ బౌల్ చుట్టూ చపాతి పిండిని పెట్టుకుని ఆపైన మూత పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల ఆవిరి బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద బిర్యాని గిన్నెను పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. కుక్కర్ హోల్ నుంచి ఆవిరి పోకుండా చపాతీ పిండిని కొంచెం కలిపి పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ గిన్నెని పక్కకు తీసి దాని కింద ఇంకొక పాన్ పెట్టుకోవాలి.
బిర్యాని గిన్నెకి స్టవ్‌కి మధ్యలో ఒక పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ 10 నిమిషాల తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకుని ఇంకో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకో 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. అంతే.. ఘుమఘుమలాడే హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యాని రెడీ అయిపోయింది. చికెన్ పీస్ చాలా బాగా ఉడికాయి. ఇదే ప్రొసీజర్ మీరు కూడా ఫాలో అవ్వండి… ఎంతో ఈజీగా పర్ఫెక్ట్ చికెన్ బిర్యాని ప్రిపేర్ చేసుకోవచ్చు.
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.