Food Recipes

Chicken Haleem Recipe : హైదరాబాద్ చికెన్ హలీమ్.. ఇంట్లోనే ఇలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు తెలుసా?

Advertisement

Chicken Haleem Recipe : హైదరాబాద్ చికెన్ హలీమ్ ఎప్పుడైనా తిన్నారా? చాలా టేస్టీగా ఉంటుంది. రంజాన్ మాసంలో చికెన్ హాలీమ్ ఒకసారైనా టేస్ట్ చూడాల్సిందే. ఒకసారి తింటే… మళ్లీ మళ్లీ తినాలపించేలా ఉంటుంది. అందుకే హైదరాబాద్ హాలీమ్‌కు అంత క్రేజ్.. అంతేకాదు.. రుచికి రుచికి ఆరోగ్యం కూడా… అందుకే చాలామంది ఈ చికెన్ హాలీమ్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.  ఇంతకీ.. ఈ హైదరాబాద్ చికెన్ హాలీమ్ ఇంట్లో చేసుకోలేమా? అంటే.. చాలా సింపుల్‌గా ఇంట్లోనే హాలీమ్ తయారు చేసుకోవచ్చు.

చికెన్ హలీమ్ కావలసిన పదార్థాలు…
మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్, ఎర్ర పప్పు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్స్, కందిపప్పు 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ 1, చికెన్ బౌన్ లెస్ ఆఫ్ కేజీ, జీడిపప్పు, గోధుమ రవ్వ ఒక కప్పు, దాల్చిన చెక్క రెండు ఇంచులు, యాలకులు 4, లవంగాలు , సాజీర, పచ్చిమిర్చి 5, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్1 టేబుల్ స్పూన్, కారం ఒక టీ స్పూన్, మిరియాలు, జీలకర్ర, ఉప్పు, నూనె, ధనియాల పొడి, గరం మసాల పొడి, పెరుగు, హలీమ్ చేయడానికి ఒక పెద్ద. వేయించుకోవాలి

తయారీ విధానం…
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పప్పులను దోరగా వేయించుకోవాలి.. అలా ఎంచుకోవడం వల్ల టేస్టీగా వస్తుంది. వేయించిన పప్పులు చల్లారాక మిక్సీ జార్ తీసుకొని ఐదు జీడి పలుకులు, పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొడిని ఒక బౌల్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపోయేంత ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో పెట్టుకోవాలి. వేడిగా ఉన్న నూనెలో15 జీడిపప్పు తీసుకొని ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.

Chicken Haleem Recipe : how to make Hyderabad chicken haleem at home in telugu

హలీం చేయడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి అందులో లీటర్ వాటర్ పోసి వేడి చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు ముందుగా నాన పెట్టుకున్న గోధుమరవ్వ, పప్పుల పొడి, సాజీర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సన్నగా నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వీటన్నిటిని వేడి నీళ్లలో వేసి 15,20 నిమిషాలు బాగా ఉడికించాలి..మూత పెట్టి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసుకోవాలి..

మరోవైపు కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తరవాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ లో ఉన్న వాటర్ అంత పోయే వరకు ఉడికించాలి. అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, మిరియాలు10,20, ధనియాల పొడి ఆఫ్ టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, హాఫ్ కప్పు పెరుగు, వేసి కలపాలి.

మూడు నిమిషాల తర్వాత చికెన్ లో పావు లీటర్ నీళ్లు పోసి మెత్తగా ఉడకడానికి కుక్కర్ మూత పెట్టి5,6 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. కుక్కర్ ప్రెషర్ తీసి చికెన్ కూర చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్ పేస్టు, గ్రైండ్ చేసిన గోధుమ రవ్వ, కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు, బ్రౌన్ చేసుకున్న ఉల్లిపాయ సగం, నెయ్యి వేసి కలపాలి. సరిపోయే కొన్ని నీళ్లు పోసి 10,15 నిమిషాలు స్టవ్ పై మీడియం ఫ్లేమ్ లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి.. ఇప్పుడు చికెన్ హలీం ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నెయ్యి, కొత్తిమీర ,పుదీనా, వేయించుకున్న జీడిపప్పు, బ్రౌన్ ఉల్లిపాయ వీటన్నిటిని పైన చల్లుకొని తింటే ఎంతో టేస్టీ రుచికరమైన హలీం రెడీ…

Read Also : Mutton Kaju Curry : హైదరాబాద్ స్టైల్‌లో మటన్ కాజు మసాలా కర్రీ.. ఇంట్లో చేయడం ఎంత ఈజీ తెలుసా? సూపర్ టేస్టీగా ఉంటుంది..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

2 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

2 months ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

2 months ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

2 months ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

2 months ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 months ago