
Chettinad Ukkarai Sweet Recipe in telugu
Chettinad Ukkarai Sweet : నోరూరించే చెట్టినాడు స్పెషల్ ఉక్కరై స్పీట్ ఎప్పుడైనా తిన్నారా? ఉక్కరై స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో మంచి స్మెల్, కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పుని మాడేంతవరకు ఉంచకూడదు. ఈ కలర్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకుని ఇందులోకి నీళ్లను పోసుకుని శుభ్రంగా పెసరపప్పుని ఒకటి రెండు సార్లు బాగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత అదే కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారు అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వరకు నీళ్లను పోసుకోండి.
రెండు కప్పులు నీళ్ల పోసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టి హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ పక్కన పెట్టుకోండి. అందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పుకి 4 కప్పుల బెల్లం వేసుకోవాలి. ఒక 1/2 కప్ వరకు నీళ్లను పోసుకొని ఫ్లేమ్‌ని హైలో లేదా మీడియంలో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బెల్లం అంతా బాగా కరగనివ్వండి.
బెల్లం కొంచెం స్వీట్‌గా ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. కుక్కర్ విసిల్ పోయిన తర్వాత ఉడికిన పప్పును గరిటతో కలుపుకోండి. జస్ట్ ఒక్కసారి అలా కలపండి అంతే.. మెత్తగా చేయకూడదు. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. బెల్లం కూడా కరిగిపోయింది. బెల్లం కరిగిన తర్వాత పాకం అవసరం లేదు. కరిగించుకున్న బెల్లం పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడి అవ్వాలి. వేడి అయిన తర్వాత ఇందులో ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నె సెట్ చేసుకోండి. అదే గిన్నెతో అన్ని ఇంగ్రిడియంట్స్ కూడా వేసుకోండి.
ఇప్పుడు ఫ్లేమ్‌ని లో పెట్టుకుని మంచి స్మెల్, ఎర్రగా వేగేంత వరకు రవ్వను ఫ్రై చేసుకోవాలి. రవ్వ చక్కగా గోల్డెన్ కలర్‌లోకి రావాలి. ఆ తర్వాత నెయ్యి కూడా కాస్త రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్లేమ్ సిమ్‌లోనే ఉంచుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మొత్తం వేసుకొని జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే మరిగించి పెట్టుకున్నా బెల్లం నీళ్ళను వడకట్టుకుని పోసుకోండి. బెల్లం నీళ్ళు మొత్తం కూడా ఒకేసారి యాడ్ చేయకూడదు. కొంచెం కొంచెం పోసుకుంటూ అది కలుపుకున్న తర్వాత మళ్ళా కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. లేదంటే.. రవ్వ త్వరగా ఉండలు కడుతుంది. ఇలా కొద్ది కొద్దిగా పోసుకుని కలుపుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది.
బెల్లం నీళ్లు అన్ని పోసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. లో ప్లేమ్ మీడియంలో పెట్టుకుంటూ ఇంకా బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి . రవ్వ పెసరపప్పు నీళ్లతోనే చక్కగా ఉడికిపోతుంది. ముప్పావు కప్పు వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి క్వాంటిటీ హాఫ్ కూడా తీసుకోవచ్చు. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే స్వీట్ టేస్ట్ బాగుంటుంది. నెయ్యి లేదంటే.. ఆఫ్ వంతు నూనె వేసుకుని చేసుకోండి. ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని మరొకసారి కలుపుకోండి. కన్సిస్టెన్సీ తిక్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు నేతిలో ఫ్రై చేసుకుని వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వాటిని వేసుకోండి. అప్పుడు జీడిపప్పు అనేది మెత్త పడకుండా ఉంటుంది. చల్లారే కొద్ది కన్సిస్టెన్సీ గట్టిపడుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత చూడండి.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో చెట్టినాడు స్పెషల్ ఉక్కరై స్వీట్ ఓసారి ట్రై చేయండి..
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.