Categories: Food RecipesLatest

Rava Milk Mysore Pak Recipe : స్వీట్ షాప్ స్టయిల్లో రవ్వతో మిల్క్ మైసూర్ పాక్.. మళ్లీ మళ్లీ తినాలిపించేలా టేస్టీ టేస్టీగా..!

Advertisement

Rava Milk Mysore Pak Recipe : నోరూరించే రవ్వ మిల్క్ మైసూర్ పాక్ ఎలా చేయాలో తెలుసా? నోట్లో వెన్నెల కరిగిపోయే ఈ కమ్మని స్వీట్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్‌లో అరకప్పు నెయ్యిని తీసుకోండి. ఇలా నెయ్యి బాగా వేడి అయ్యాక ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రవ్వను బాగా వేపాలి. ఈ రవ్వ వేపడానికి కనీసం 10 నిమిషాల పైనే పడుతుంది. రవ్వ మాడిపోకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా తిప్పండి. రవ్వ బాగా ఫ్రై అవుతున్నప్పుడు జీడిపప్పు వాసన వస్తుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఈ వేడి వేడి రవ్వలో మిల్క్ పౌడర్ వేసినప్పుడు ముద్దలు కడుతుంది. ముద్దలు కట్టకుండా కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపండి.

మిల్క్ పౌడర్ ముద్దలు కట్టకుండా బాగా కలిపి ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకోవాలి. మీ దగ్గర బట్టర్ పేపర్ లేకపోతే ఏదైనా అల్యూమినియం పాయింట్ తీసుకోవచ్చు. మైసూర్ పాక్ తీసుకోవడానికి మోడ్ ని సెట్ చేశాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే పాన్లోకి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు చక్కెరను తీసుకోవాలి. ఈ క్వాంటిటీకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా కావాలంటే కప్పు వరకే తీసుకోవచ్చు. అరకప్పు నీళ్లను తీసుకొని పాకాన్ని ప్రిపేర్  చేసుకోవాలి.

Rava Milk Mysore Pak Recipe in telugu

చక్కెర బాగా కరిగిపోయాక మూడు నిమిషాలు పాకాన్ని మరిగించాలి. పాకానికి కొంచెం తక్కువగా ఎక్కువ స్టిక్కీగా రావాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి ఫ్రై చేసి పెట్టిన రవ్వ మిల్క్ మిక్స్ కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే ముద్దలు కడుతుంది.

Rava Milk Mysore Pak Recipe : రవ్వతో మిల్క్ మైసూర్ పాక్.. తయారీ ఇలా..

కొంచెం కొంచెంగా పాకంలో యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక ఇప్పుడు ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని, ఒక పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి. ఈ మైసూర్ పాక్ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. కొంచెం పాన్ నుంచి సపరేట్ అయ్యేంతవరకు కలుపుతూ మాడిపోకుండా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం రవ్వ మిక్స్ తీసుకొని ఉండలా చేస్తే సాఫ్ట్ ఉండలా రావాలి. గట్టిగా చేస్తే మైసూర్ పాక్ అనేది గట్టిగా వస్తుంది.

టూ సాఫ్ట్ గా తీసుకుంటే సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్తీ లోకి తీసుకోవాలి. కొంచెం గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సిల్వర్ పేపర్ ని అతికించవచ్చు. పూర్తిగా చల్లారే అంతవరకు ఒక గంట రెండు గంటలు అలా పక్కన పెట్టండి. ఎప్పుడైతే ఇది పూర్తిగా చల్లారిపోతుందో అప్పుడు సైడ్ నుంచి కొంచెం చాకుతో కట్ చేసుకోవాలి. అంతే.. మైసూర్ పాక్ రెడీ అయినట్టే.

Read Also : Annavaram Prasadam Recipe : అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం.. ఆలయ ప్రసాదంలా ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

2 months ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

2 months ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

3 months ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

3 months ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

3 months ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

3 months ago