coconut dry fruit laddu recipe in telugu
Coconut Dry Fruit Laddu : డ్రై ఫ్రూట్ కొబ్బరి లడ్డు.. రోజుకు ఒక లడ్డు చొప్పున తినండి.. మీ పిల్లలతో తినిపించండి.. మంచి బలంగా తయారవుతారు. అలాంటి మంచి హెల్తీ లడ్డూలని ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం. రెండు కొబ్బరి చెప్పులు తీసుకోండి. కొబ్బరికాయని ముక్కలుగా కట్ చేసుకోండి. కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే తురుముకొని చేసుకోవచ్చు. మిక్సీ జార్లో త్వరగా అయిపోతుంది. ఈ కొబ్బరి ముక్క పైన బ్లాక్ పార్క్ ఉంటుంది. అది వద్దు అనుకుంటే తీసేసైన వేసుకోవచ్చు. కచ్చాపచ్చాగా వేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా చేయొద్దు. ఇలా మిక్సీకి వేసుకున్న ఈ కొబ్బరి పొడిని ఎన్ని కప్పులు వస్తాయో చూసుకోవాలి.
గిన్నెలు ఏదైనా తీసుకొని కొలతగా పెట్టుకొని కొలుచుకోండి. మీరు మీడియం సైజు కొబ్బరికాయ తీసుకుంటే రెండు కప్పుల దాకా కొబ్బరి తురుము వస్తుంది. రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం పడుతుంది. ఆ బెల్లాన్ని కొలుచుకోవడం కోసం కొబ్బరి తురుమును కొలుచుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని అందులో బెల్లం తురుము ఒక కప్పు వేసుకోండి. ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుమును కొలుచుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము పడుతుంది. బెల్లం కరిగితే సరిపోతుంది. పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. అలాగే, ఒక కప్పు బెల్లం సరిపోతుంది. ఒకవేళ మీరు స్వీట్ కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక్క పావు కప్పు వేసుకోవచ్చు.
బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత గిన్నెను తీసి పక్కన పెట్టేసి ఇదే స్టవ్ పైన బాండిని పెట్టుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి మరీ ఎక్కువ అయిపోతే మీకు ఉండచుట్టడానికి సరిగ్గా రాదు. విడివిడిగా అయిపోతున్నట్లు ఉంటుంది. ఈ నెయ్యి కరిగిన తర్వాత ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ కొబ్బరిపొడిని కూడా వేసుకొని జస్ట్ ఒక నిమిషం అలా లైట్ గా వేయించుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయేలా నిమిషం వేయించుకోవాలి. మీరు కావాలంటే.. డైరెక్ట్ గా పచ్చికొబ్బరిని వేసేసుకొని దాంట్లోనే బెల్లం పాకం కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఒక నిమిషం పాటు సిమ్‌లోనే పెట్టి లైట్‌గా వేయించేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో బెల్లం నీళ్లు పోసుకోవాలి. ఇలా బెల్లం నీళ్లు మొత్తం పోసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి కంటిన్యూగా కలుపుతూ ఉండండి.
పాకం దగ్గర పడుతూ వస్తుంది. ముద్దకు వస్తుంది. అలా వచ్చిందాకా కలుపుతూ ఉడికించండి. బెల్లం నీళ్లలో ఈ కొబ్బరి అనేది బాగా ఉడుకుతుంది. కొబ్బరి అంతా ఉడికి కాస్త దగ్గర పడుతుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి. కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండండి. అడుగంటుకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక అయిదారు నిమిషాలకి ఈ విధంగా గట్టిపడుతుంది. ఒక్క రవ్వ తీసుకొని చేత్తో ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా మనకి రెడీ అయిందని అర్థం. ఇలా వచ్చిన తర్వాత ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా ఆరుతూ ఉంటుంది. ఈలోపు ఇదే స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకోండి. దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల బాదం పప్పులు రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు వేసుకొని ఫస్ట్ వీటిని లైట్‌గా వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. ఇంత క్వాంటిటీ వేయాలని ఏం లేదు. ఇలా లైట్‌గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండు ద్రాక్ష నల్ల కలర్‌లో ఉన్నవి తీసుకోవాలి.
ఏ కలర్‌లో ఉన్నవైనా వేసుకోవచ్చు. దీంట్లోనే కర్బూజ గింజలు ఒక టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్లేమ్ నీ లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి. మాడకూడదు. నువ్వులు గసగసాలు తొందరగానే వేగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసి వేయించుకున్న ఆ వేడికి వేగిపోతాయి. మీ దగ్గర ఏ డ్రైఫ్రూట్స్ ఉంటే ఇలా చేసుకోవచ్చు. లైట్‌గా కలర్ మారి దోరగా వేగాలి. వేగిన తర్వాత వీటిని అన్నింటిని తీసేసి ముందుగా ఉడికించి పెట్టుకుని కొబ్బరిలో వేసుకోండి. కొబ్బరిలో వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసి కాస్త ఆరనివ్వండి. వేడి మీదే ఉండ చుట్టలేం కాబట్టి కొద్దిగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చేసుకోండి. మీకు ఏ సైజులో లడ్డూలు కావాలి అనుకుంటున్నారా ఆ సైజులో లడ్డులను చేసుకోండి.. అంతే.. ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ కొబ్బరి లడ్డు రెడీ..
Read Also : Jonna Laddu : ఈ జొన్న లడ్డు రోజుకు ఒకటి తింటే చాలు.. మీ ఆరోగ్యం మీ గుప్పెట్లో ఉన్నట్లే..
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.