Entertainment

Asthma Control : మందులు లేకుండా ఆస్తమాను తగ్గించుకోవడం ఎలాగో తెలుసుకోండి

Advertisement

How do I overcome asthma without medication : దీర్ఘకాలిక శ్వాస సంబంధ సమస్యల్లో ఒకటిగా ఆస్తమా ఉండగా, ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం..భారత్‌లోనే దాదాపుగా రెండు కోట్ల మంది ప్రజలు ఈ సమస్యతో సతమతమవుతున్నారు. ఈ ఆస్తమా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. పిల్లలు సైతం ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆస్తమా తగ్గించేకునేందుకుగాను మందులు వాడుతున్నారు. అయితే, ఇంగ్లిష్ మందుల వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మరిన్ని ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మందులు లేకుండా ఎలా ఆస్తమాను కంట్రోల్ చేయొచ్చు, ఆస్తమా లక్షణాలెంటి, వాటిని పరిపూర్ణంగా తగ్గించుకోవచ్చనే విషయాలు తెలుసుకుందాం.

ఇవన్నీ కూడా ఆస్తమా లక్షణాలే (asthma symptoms) :
మనిషి బతకాలంటే కంపల్సరీగా ఊపిరి తీసుకోవాలి. అనగా పీల్చే గాలి ఊపిరితిత్తులలోకి వెళ్లాలి. అలా ఊపిరి పీల్చినపుడు గాలి లోపలికి వెళ్లడంతో పాటు బయటకు కూడా రావాలి. అలా రావడానికి, లోపలికి వెళ్లడానికి మనిషికి వాయునాళాలు ఉంటాయి. అయితే, వివిధ కారణాల వల్ల కండరాలు వాచి వాయునాళలు సన్నబడిపోతాయి.

అలా వాయునాళాలు సన్నబడిపోవడం వల్ల మనుషులకు గాలి తీసుకోవడం, వదలడం ఇబ్బందిగా మారుతుంది. కొద్దిదూరం నడిచినా, ఏదేన చిన్న పని చేసినా ఆయాసం వస్తుంది. గొంతులో విజిల్ వేసినట్లు సౌండ్ వస్తుంది. చాతి బిగుసుకున్నట్లు అవుతుంది. ఇవన్నీ కూడా ఆస్తమా లక్షణాలే. ఆస్తమాను ఉబ్బసం అని కూడా అంటుంటారు.
Eating Banana After Meal : భోజనం తర్వాత అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిదా? ఎందుకు?

శ్వాస ద్వారా పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం బయటకు వచ్చేందుకు వీలుగా వాయు నాళాలు ఉంటాయి. అనేక కారణాల వల్ల శ్వాస కండరాలు వాచిపోతుంటాయి. అప్పుడు శ్వాస నాళాలు సన్నబడతాయి. ఫలితంగా గాలి వేగంగా పీల్చడం చేస్తుంటారు.. అలాగే బయటకు గాలిని వదలడం చేస్తుంటారు. ఇలా తరచూ చేయడం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం దూరం నడిచినా, ఏదైనా పని చేసినా బాగా ఆయాసంగా అనిపిస్తుంటుంది.

గొంతులో ఏదో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. ఈ లక్షణాలు అన్నీ ఆస్తమా కిందకే వస్తాయి. దీనిని ఉబ్బసం అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆస్తమా డిసీజ్ వల్ల శ్వాసకు సంబంధించిన వాయునాళాలు సంకోచిస్తాయి. ఫలితంగా వాపు వచ్చి శ్లేష్మం ఎక్కువై ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది.

ఇకపోతే ఆస్తమా ఉన్న వాళ్లు ఎండ లేకపోతే చాలా ఇబ్బంది పడుతుండటం మనం గమనించొచ్చు. వాతావరణం చల్లగా ఉన్నా ఆస్తమా పేషెంట్స్‌కు ఇబ్బందికరమే. ఎయిర్‌లోని కెమికల్స్ స్మెల్, పుప్పొడి రేణువులు, ఘాటు వాసనల వల్ల ఆస్తమా తీవ్రత ఇంకా పెరిగే చాన్సెస్ ఉంటాయి. ఈ క్రమంలోనే వాయునాళాలు ఫ్రీ అయ్యేందుకు అనగా సంకోచించేందుకుగాను మందులు వాడుతుంటారు.

మందులు అలవాటు పడితే కష్టమే (Medicines Habbit) :
ఈ మందులు ఉపశమనం కలిగిస్తాయి. కానీ, అది తాత్కాలికంగానే ఉంటుంది. ఇక ఈ మందులకు అలవాటు పడే చాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రతీ సారి ఆ మందులు వాడాల్సి ఉంటుంది. అవి వాడితేనే ఆస్తమా నుంచి ఉపశమనం లభించే పరిస్థితులుంటాయి. ఈ నేపథ్యంలోనే మందులు లేకుండా ఆస్తమాను తగ్గించేందుకు తీసుకునే ఆహార పదార్థాలలో మార్పు చేసుకోవడంతో పాటు పలు జాగ్రత్తలు పాటించాలి.

యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నటువంటి ఉల్లిపాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. తద్వారా ఆస్తమా పేషెంట్స్‌కు రిలీఫ్ లభిస్తుంది. విటమిన్ సి ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. కరోనా వల్ల ప్రతీ ఒక్కరు విటమిన్ సి ఫ్రూట్స్ బాగానే తీసుకుంటున్నారు. కాగా ఆస్తమా పేషెంట్స్ విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఫలాలను తీసుకోవడం ద్వారా ఆస్తమ లక్షణాలు తగ్గినట్లు కొన్ని పరిశోధనల్లో తేలింది. రెడ్ క్యాప్సికంతో పాటు, ఆపిల్ పండు కూడా ఆస్తమా ఉన్న వారు తీసుకోవాలి. ఆపిల్ పండు తినడం ద్వారా ఊపిరితిత్తుల పనితీరు బాగా మెరుగుపడుతుంది. ఆపిల్ పండులో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయనేది తెలుసు..

అంతేకాదు.. ఆస్తమా లక్షణాలు తగ్గించడంలో పాలకూర కూడా దోహదపడుతుంది. ఇకపోతే విటమిన్ సి‌తో పాటు డి ఉండే ఫలాలు కూడా ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి. ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నపుడు స్టెరాయిడ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే, అవి డాక్టర్స్ సజెషన్ మేరకే తీసుకోవాలి. ఆస్తమా ఉన్న వారు ఇన్‌హేలర్‌ను క్యారీ చేయడం మస్ట్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యోగా చేయడం ద్వారా ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి.

యోగాసాలతో బ్రీతింగ్ ఫ్రీ (Breathing Free) :
యోగా ఆసనాలు వేయడం ద్వారా బాడీ బ్రీతింగ్ ఫ్రీ అవుతుంది. అయితే, అన్ని ఎక్సర్‌సైజెస్ కాకుండా మీరు చేయగలిగినవి చేస్తే మీకు మంచి జరుగుతుంది. పచ్చి కూరగాయలు భోజనంగా తీసుకున్నా మంచి ఫలితమే ఉంటుంది. కానీ, అది అందరికీ వర్తించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి డాక్టర్స్ సూచన మేరకు పచ్చి కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

ఇక ఆస్తమా ఉన్న వారు సిగరెట్ తాగకపోవడమే మంచిది. ఆస్తమా ఉన్నప్పటికీ సిగరెట్ తాగితే ఇంకా ఎక్కువయ్యే చాన్సెస్ ఉంటాయి. దుమ్ము, పొగల్లో కూడా తిరగొద్దు. దుమ్ము, ధూళి బాగా ఉన్న ప్రాంతంలో ఉంటే ఆస్తమా ఇంకా బాగా పెరుగుతుంది. కాబట్టి నీట్ అండ్ క్లీన్ ప్లేసెస్‌లోనే ఉండాలి. ఇక కూల్ డ్రింక్స్, ఫ్రిజ్ వాటర్ తీసుకోకపోవడమే మంచిది. ఐస్ క్రీమ్స్ కూడా తీసుకోకూడదు.
COVID-19 Recovery Home Exercises : ఈ వ్యాయామాలు చేస్తే కరోనా రాదట.. వచ్చినా వెంటనే కోలుకోవచ్చు!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 days ago