Ayurvedam

Eating raw garlic : ప్రతీ రోజు పచ్చి వెల్లుల్లి తినవచ్చా? లైంగిక సామర్థ్యాన్ని ఈ ఔషధం పెంచుతుందా?

Advertisement

Eating raw garlic : ఇప్పుడంటే డాక్టర్స్, ఆధునిక వైద్యం అరచేతిలో అందుబాటులో ఉంది. కానీ, ఒకప్పుడు ఇటువంటి పరిస్థితులు లేవు. మన పూర్వీకులకు అసలు అక్షర జ్ఞానం లేదు. కాని వారు చాలా కాలం పాటు ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా జీవించగలిగారు. అందుకు ప్రధాన కారణం వంటింటి ఔషధాలు. వారు తినే ఆహారపదార్థాల్లో అత్యద్భుతమైన గుణాలు కలిగిన ఔషధాలు వాడారు. దాంతో వారు ఆరోగ్యంగా ఉండగలిగారు. కాని నేటి పరిస్థితులు అలా లేవు. పాతికేళ్లకే పలు వ్యాధుల బారిన పడుతున్నారు జనాలు.

ఇందుకు మారుతున్న జీవనశైలితో పాటు కలుషిత ఆహార పదర్థాలు కారణం. ఈ సంగతులు పక్కనబెడితే.. నాడు మన పూర్వీకులు వాడిన ఔషధాలలో ఒకటిగా వెల్లుల్లి ఉంది. వెల్లుల్లిని కొన్ని ప్రాంతాల్లో తెల్లగడ్డని, మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లిగడ్డ, ఎల్లిపాయ అని పిలుస్తారు. వెల్లుల్లి కూరల్లో వేయడం ద్వారా కూరకు రుచి వస్తుంది. ప్రత్యేకమైన కూరగా అది మారిపోయి నోరూరుస్తుంది. ప్రతీ వంటలో వెల్లుల్లిని వాడటం ద్వారా మంచి ప్రయోజనాలుంటాయి. కాగా ప్రతీ రోజు పచ్చి వెల్లుల్లి తినడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారు? అనే విషయాలు మీ కోసం..

వెల్లుల్లితో వెయిట్ లాస్ :
సాధారణంగా వెల్లుల్లిని అందరూ ఇష్టపడుతుంటారు. అయితే, వాసన నచ్చని వాళ్లు కూడా కొందరుంటారు. కానీ, ఆరోగ్యానికి మేలు చేసే వెల్లుల్లి గురించి వారు తెలుసుకుంటే మాత్రం తప్పకుండా వెల్లుల్లిని తింటారు. ఇకపోతే ప్రతీ రోజు వెల్లుల్లిని తింటే చాలా మంచిదట. అయితే, పచ్చి వెల్లుల్లి తిన్నా మంచి ప్రయోజనమే ఉంటుంది. కానీ, ఆ ఘాటును తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఆహారంలో భాగం చేసుకుని తింటే చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు. వెల్లుల్లి మీ వెయిట్‌ను కూడా లాస్ చేసేందుకు సాయపడుతుంది. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైమ్స్‌ను ఉత్తేజపరుస్తుంది. తద్వారా మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. అయితే, వెల్లుల్లిని భోజనం చేసిన తర్వాత కూడా తీసుకోవచ్చని, అలా చేయడం వల్ల ఇంకా మంచి ప్రయోజనాలుంటాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తున్నదని కొందరు అంటున్నారు.

ప్రస్తుతం ఆధునిక కాలంలో ఫాస్ట్ ఫుడ్ తిని చాలా మంది ఊబకాయులు అవుతుండటం మనం చూడొచ్చు. అయితే, ఫాస్ట్ ఫుడ్ వల్ల మాత్రమే కాదు వారి లైప్ స్టైల్ వల్ల వారు ఇంకా వెయిట్ గెయిన్ అయి ఊబకాయంతో పాటు ఇంకా పలు రకాల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో వారు ఎక్సర్‌సైజెస్ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. వారు కనుక వెల్లుల్లిని తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలుంటాయని పెద్దలు చెప్తున్నారు. వెల్లుల్లి తినడం వలన ఆకలి తగ్గుతుంది. తద్వారా ఫుడ్ తినడం కంట్రోల్ అయి వెయిట్ లాస్ అయ్యే చాన్సెస్ పెరుగుతాయి.

వెల్లుల్లి హార్ట్ కు మంచిది :
మానవ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేయడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లి హార్ట్‌ కు చాలా మంచిది. వెల్లుల్లి తినడం ద్వారా రక్తనాళాల్లోని కొవ్వు ఆటోమేటిక్‌గా క్లీన్ అయిపోతుందని, గుండె సమస్యలు అసలు దరి చేరవని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. జీర్ణవ్యవస్థ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుందని, అన్నం త్వరగా జీర్ణం అవుతుందని చెప్తున్నారు. వెల్లుల్లి మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకుగాను తోడ్పాటు అందిస్తుంది. ఇకపోతే శరీరం లోపల మాత్రమే కాకుండా బాహ్య శరీరానికి కూడా వెల్లుల్లి మేలు చేస్తుంది. వెల్లుల్లి తినడం ద్వారా స్కిన్‌కు ప్రొటెక్షన్ లభించడంతో పాటు నల్లమచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.

వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్స్ హెల్త్‌కు చాలా మంచివి. రక్తాన్ని శుద్ధి చేయడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లులిల్లోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు రక్తాన్ని గడ్డకట్టనీయవు. ఇకపోతే ఇటీవల కాలంలో సంతానలేమి బాగా పెరిగిపోయింది. ఇందుకు మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణమవుతున్నాయి. మగ, ఆడవారిలో కూడా లైంగిక సామర్థ్యం తగ్గిపోతున్నది. సంతానోత్పత్తికి వెల్లుల్లిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతీ రోజు వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా సెక్స్ సామర్థ్యం బాగా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇక స్త్రీలు వెల్లుల్లిని తీసుకుంటే గర్భం ధరించేందుకు అవసరమైన శక్తి ఇట్టే లభిస్తుంది. వెల్లుల్లిలో ఉండే విటమిన్స్ బి6, సి, సెలినీయం ఇతర పోషకాలు పలు లోపాలను నివారిస్తాయి. వెల్లుల్లిలో సహజంగా లభించే అల్లిసిన్ కెమికల్ లిక్విడ్ లైంగిక అవయవాలను బలపరచడంతో పాటు రక్త ప్రస్తరణను కూడా తగినంత స్థాయిలో ప్రసరించేందుకు సాయపడుతుంది.

సంతానోత్పత్తి, లైంగిక శక్తిని పెంచుతుంది :
ఫలితంగా సంతానోత్పత్తి జరిగే చాన్సెస్ ఉంటాయి. వెల్లుల్లి ఆడ, మగ వారికి అవసరమైన లైంగిక శక్తిని పుష్కలంగా అందిస్తుంది. మగ వారిలో అయితే శుక్ర కణాల పెంపునకు, ఆడవారిలో అయితే పిండం తయారు చేసే గుడ్లను ఆరోగ్యంగా ఉంచేందుకుగాను వెల్లుల్లి సాయపడుతుంది. ఆడవారిలో సంతానోత్పత్తికి వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లి సహజ సిద్ధంగా గాయాలను నయం చేస్తుంది.

కరోనా మహమ్మారి వ్యాధి వల్ల చాలా మంది ఇమ్యూనిటీ పవర్ పెంచే పదార్థాలు తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. గతంతో పోల్చితే ప్రజెంట్ జనాల్లో హెల్త్ కాన్షియస్‌నెస్ బాగా పెరిగింది. అయితే, సహజ సిద్ధంగా లభించే వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుదల ఉంటుందన్న సంగతి గుర్తించాలి. రొమ్ము కేన్సర్ నిరోధించేందుకు వెల్లుల్లి సాయపడుతుంది.

Read Also : COVID-19 Recovery Home Exercises : ఈ వ్యాయామాలు చేస్తే కరోనా రాదట.. వచ్చినా వెంటనే కోలుకోవచ్చు!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 days ago