Categories: Health TipsLatest

Eating Banana After Meal : భోజనం తర్వాత అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిదా? ఎందుకు?

Advertisement

Eating Banana After Meal is good or bad : సాధారణంగా బనానా.. అంటే అందరికీ ఇష్టముంటుంది. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండటంతో పాటు ధర కూడా మిగతా పండ్లతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇది పేదలకు యాపిల్ పండులాంటిదని అంటుంటారు. కాగా, ప్రతీ రోజు అరటి పండ్లు (Eating Banana After Meal )తింటే చాలా మంచిదని పెద్దలు చెప్తుంటారు. అరటి పండు తిన్నపుడు వెంటనే శక్తి లభించి అలసిపోయి బాడీకి నూతన ఉత్తేజం కలుగుతుందని వివరిస్తుంటారు.

ఇకపోతే చాలా ఆకలిగా ఉన్న వారు ఒక రెండు అరటి పండ్లు తింటే చాలు.. వారి కడుపు నిండిపోతుంది. వారు ఇక రోజంతా ఏమీ తినకున్నా ఏం కాదు. హాయిగా వారి పనులు కూడా చేసుకోవచ్చు. అంతటి ఎనర్జీని అరటి పండ్లు అందిస్తాయి. అయితే, అరటి పండ్లు ఏ టైంలో తినాలి అనే విషయమై పలు అనుమానాలు జనాల్లో ఉన్నాయి.

డే టైంలో పొద్దున, మధ్యాహ్నం అరటి పండ్లు తింటే మంచిదేనని అభిప్రాయం ఎక్కువ మంది‌లో ఉంది. కానీ, రాత్రి పూట భోజనం తర్వాత అరటి పండ్లు అస్సలు తినకూడదనే భావన చాలా ఎక్కువ మందిలో ఉంది. అయితే, ఇది అపోహేనని, రాత్రి పూట భోజనం తర్వాత కూడా (Banana )బనానాస్ తినొచ్చని మరి కొందరు వాదిస్తున్నారు. ఈ వాదనల్లో ఏది నిజమో తెలుసుకుందాం.

Eating Banana After Meal is good _ Eating Banana After Meal is good or bad, You Must Know Why_

అరటి పండులో సమృద్ధిగా ఉండే పోషకాలు మానవుడికి చాలా అవసరం. కాబట్టి అరటి పండును ఎప్పుడైనా తినొచ్చని పెద్దలు చెప్తున్నారు. అరటిలోని పోషకాలతో పాటు ఖనిజాలు మానవ శరీరానికి చాలా ఉపయోగపడతాయి. అయితే, ఆయుర్వేదం ప్రకారం.. రాత్రిపూట అరటి పండును తినొద్దు. ఎందుకనే విషయమై కారణాలు కూడా తెలిపారు. అవేంటంటే… అరటి పండును రాత్రిపూట తినడం ద్వారా దగ్గు, జలుబు రావడంతో పాటు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.

ఈ నేపథ్యంలో శరీరానికి బాగా ఇబ్బంది కలుగుతుంది. రాత్రిపూట అరటి పండు తినొద్దని పోషకాహార నిపుణులు కూడా చెప్తున్నారు. అరటి పండు సాధారణంగా శక్తిని అందించే అత్యద్భుతమైన ఫ్రూట్ అయినప్పటికీ రాత్రి పూట తినడం వల్ల కొన్ని ఇబ్బందులుంటాయని వివరిస్తున్నారు.

రాత్రి పూట భోజనం తర్వాత అరటి పండు తినడం వల్ల ఉబ్బసం, జలుబు వస్తాయని పేర్కొంటున్నారు. ఇకపోతే ఆల్రెడీ జలుబు, సైనస్ ఉన్న నైట్ టైమ్స్‌లో అస్సలు బనానా ఫ్రూట్ తినొద్దని చెప్తున్నారు.

వారు ఒకవేళ అరటి పండ్లు తింటే జలుబు, సైనస్ ఇంకా ఎక్కువయ్యే చాన్సెస్ ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అయితే, ఈవినింగ్ టైంలో ఎక్సర్‌సైజెస్ చేసిన తర్వాత బనానాస్ తీసుకుంటే మంచిదేనని వివరిస్తున్నారు. ఇకపోతే అరటి పండు తినడం ద్వారా హార్ట్ డిసీజెస్ ప్రమాదాలు తగ్గిపోతాయని, మంట, కడుపు పూతలు తగ్గుతాయని అంటున్నారు.

అరటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

జనాల్లో ఇటీవల కాలంలో నిద్రలేమి సమస్య బాగా పెరిగిపోతున్నది. స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగి, బ్లూ స్క్రీన్‌ను అదే పనిగా చూడటం వల్ల ప్రజలు నిద్ర పోకుండా రాత్రిళ్లు కూడా మేల్కొనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే వారికి అరటి పండు డే టైంలో తింటే మంచి మేలు జరుగుతుంది. వారు రాత్రి పూట ఇట్టే నిద్ర పోవడానికి ఈ ఫ్రూట్ సాయం చేస్తుంది. అరటి పండులోని పొటాషియం (Potassium) వల్ల మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. సాయంత్రం పూట ఒకటి లేదా రెండు బనానాస్ తినడం ద్వారా మీరు మంచి నిద్ర పోవచ్చని నిపుణులు చెప్తున్నారు. వెయిట్ పెరగకుండా (weight loss) ఉండేందుకూ అరటి పండు తోడ్పడుతుంది.

ఫైబర్ కంటెంట్ చాలా అవసరం :
అరటిలో ఉండే ఫైబర్ కంటెంట్ మానవుడికి చాలా అవసరం. అరటి పండ్లు ఇష్టపడే ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. అరటిలో ఉండే సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్స్ వివిధ వ్యాధుల నుంచి మనకు ఉపశమనం కలిగిస్తాయి.

Eating Banana After Meal is good _ Eating Banana After Meal is good or bad, You Must Know Why_

టైప్ టూ డయాబెటిస్‌ను (Diabetes) అరటి పండ్లు కంట్రోల్ చేయడంతో పాటు మానవ నాడీ వ్యవస్థను నిర్వహించడానికి అవసరమైన సాయం చేస్తాయి. అరటి పండులో ఉండే (Vitamin B6) విటమిన్ బి 6 బ్లడ్‌లోని వైట్ బ్లడ్ సెల్స్ సంఖ్య పెంచేందుకు సాయపడతాయి. ఫలితంగా బాడీ ఇమ్యూనిటీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక రక్తహీనతతో బాధపడే వారు కంపల్సరీగా తినాల్సిన ఫ్రూట్స్‌లో బనానా ఒకటని గుర్తించాలి.

అరటిలో ఉండే ఐరన్ కంటెంట్ మానవుడిని హెల్దీగా (Healthy) ఉంచుతుంది. అరటిలో ఉండే ఫైబర్ కడుపులో జీర్ణక్రియకు అవసరమైన గుడ్ బ్యాక్టీరియా పెరుగుదలకు సాయపడుతుంది. ఈ బ్యాక్టీరియా మనిషికి అవసరమైన బ్యాక్టీరియా కాగా అది ఆహారాన్ని జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ బ్యాక్టీరియా పెరుగుదలకు సాయపడటంతో పాటు మాంసాన్ని జీర్ణం చేసేందుకు అవసరమైన ఎంజైమ్స్‌ను అరటి పండు అందిస్తుంది. హ్యూమన్ బాడీని చల్లబర్చేందుకు అరటి సాయపడుతుంది.

మొత్తంగా అరటితో మనిషికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. (banana benefits) ఇలా బోలెడు ప్రయోజనాలున్న అరటి పండును ప్రతీ ఒక్కరు తీసుకోవాల్సిందే. కానీ, రాత్రి పూట తీసుకుంటే మంచిదే కాదు. మరీ ముఖ్యంగా జలుబు కాని సైనస్ ప్రాబ్లమ్ ఉన్న వారు కాని రాత్రి పూట అరటి పండు తీసుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఒకవేళ వారు అరటి పండును రాత్రిపూట భోజనం తర్వాత తీసుకుంటే వారికి ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి.

Read Also : Ayurveda Moolika Benefits : ఈ ఆయుర్వేద మూలికలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Anjeer : అంజీర్ పండ్లలో అసలు రహస్యమిదే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More

3 months ago

Mango Health Benefits : మామిడి పండ్లు మాత్రమే కాదు, కాయలు తింటే ఏంలాభం!

Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More

3 months ago

Atibala plant Benefits : అతిబల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More

3 months ago

Aloo curry : ఈ సీజన్ లో రైస్ రోటి లోకి అద్ధిరిపోయే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఆలూతో ఇలా ఓసారి ట్రైచేయండి.

Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More

3 months ago

Sky Fruit : ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం…

Sky Fruit :  స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More

3 months ago

Graha Dosha Nivarana : స్త్రీ శాపం, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు, గ్రహణ దోషాల పరిహారానికి ఈ దానం చేసి ఈ మంత్రం పఠించండి..

Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More

3 months ago