Entertainment

Biting Your Nails : గోళ్లు కొరికే అలవాటు ఉందా? ఈ జబ్బుల ముప్పు ఎక్కువ

Advertisement

stop biting your nails : సాధారణంగా గోళ్లను కొరికే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఎన్నిసార్లు వద్దని చెప్పినప్పటికీ వారు అదేపనిగా గోళ్లు కొరకుతుంటారు. తమకు తెలియకుండానే గోళ్లను కొరికేస్తుంటారు. ఒత్తిడిగా ఉన్ప సమయంలో ఏదో ఆలోచిస్తూ గోళ్లు కొరికేస్తుంటారు. ఈ చెడు అలవాటు కారణంగా మన ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు గోళ్లను ఎందుకు కోరుకుతుంటారు.. ఇలా గోళ్లు కొరకటం వల్ల కలిగే అనారోగ్యకర ప్రయోజనాలు ఏంటో నిపుణలు చెబుతున్నారు.

సాధారణంగా గోళ్లు కొరకడానికి అనేక కారణాలు ఉంటాయని అంటున్నారు. కొందరు మానసిక రుగ్మతలతో బాధపడేవారు అదేపనిగా గోళ్లు కొరుకుతుంటారు. అది వారికి తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు అయితే వెంటనే గోళ్లను కొరకడం ఆపేస్తారు. ఏమౌతుందిలే అనుకునేవారు అయితే గోళ్లను అలానే కొరికేస్తుంటారు.
Ayurvedic Remedies : వాస‌నను కోల్పోయారా ? ఈ ఆయుర్వేద చిట్కాలను ఓసారి ట్రై చేసి చూడండి

గోళ్లు కొరికే అలవాటుకు 5 కారణాలివే :
హెల్త్ సైన్స్ సెంటర్ నిపుణులు గోళ్లు కొరికే అలవాటుకు గల ఐదు కారణాలను వివరించారు. గోళ్ళను కోరడం తిరిగి నమలడం చేస్తూంటారు. చిన్నప్పటి నుంచి గోళ్లను కొరికే అలవాటు ఉంటుంది. ఈ గోళ్లను కొరికి తిరిగి నమలడం వల్ల అనేక జబ్బులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం మంది గోళ్లను కొరికి, నములుతున్నారు. గోళ్లు కొరకడం వల్ల ఎలాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందో ఓసారి తెలుసుకుందాం..

1. మీ వేలుగోళ్ల క్రింద చాలా సూక్ష్మక్రిములు ఉంటాయి.
2. వైరస్, బ్యాక్టిరియాల వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుంది
3. మీ దంతాల ఆరోగ్యానికి హానికరం
4. ఎక్కువ హ్యాంగ్‌ నెయిల్స్ లేదా ఇన్గ్రోన్ గోర్లు ఉండవచ్చు
5. టాక్సిక్ పాయిజనింగ్ ముప్పు రావొచ్చు..

గోళ్లు దెబ్బతింటాయి :
ప్రతి రోజు అలవాటు ఉంటే మీ గోళ్లని పూర్తిగా దెబ్బతింటాయి. పళ్ళకి నష్టం కలుగుతుంది. గోళ్ళని కొరకడం వల్ల పళ్లు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. పళ్ళు ఊడిపోవచ్చు.. తరచు గోళ్లు కొరకడం వల్ల పళ్లు వంకరపోతాయి. అదేపనిగా గోళ్లను కొరికే వారిలో ఇన్ఫెక్షన్లు వస్తాయి.. మీ చేతివేళ్లలో దాగి ఉన్న సూక్ష్మజీవులు నోటి లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉంది. అంతేకాదు.. మీ గోళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
Dangerous Zodiac Signs : ఈ రాశి మీదేనా? వీరికి హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వస్తాయట.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి

గోళ్లు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మంచి నెయిల్ కట్టర్ సాయంతో గోళ్లను అందంగా కత్తిరించుకోవాలి. అంతేకానీ ఇలా గోళ్లను పళ్లతో కొరకడం వల్ల మంచి కంటే చెడు ప్రయోజనాలు ఎక్కువ.. సాధ్యమైనంతవరకు గోళ్లను కొరికే అలవాటును మానుకోనేందుకు ప్రయత్నించండి.

చర్మపు ఇన్ఫెక్షన్లు :
గోళ్లను కొరికేవారిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మం ఎర్రగా మారి వాపులు వస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా చీము పడుతుంది. ఎక్కువగా నొప్పి వస్తుంది. గోళ్లను కొరికేవారిలో చర్మపు ఇన్ఫెక్షన్లు వస్తాయి.. గోరు కొరకడం ద్వారా చిన్నపాటి గోళ్ల ముక్కలు మీ జీర్ణశయంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. వాటి కారణంగా ప్రేగుల్లో ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశం ఉంది. గోళ్ల చుట్టూ ఉండే చర్మం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే గోళ్లను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలని చర్మవ్యాధి నిపుణులు సూచిస్తున్నారు.

జీర్ణ సంబంధిత సమస్యలు:
గోళ్లు కొరకడం ద్వారా వాటిలోని బాక్టీరియా నోటిలోకి వెళ్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది. బ్యాక్టీరియా కడుపు లోపలి వెళ్లిపోతుంది. ఇలా అయితే మాత్రం గ్యాస్ట్రో ఇంటెస్టినల్ వంటి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కడుపులోకి వెళ్లిన గోళ్లు మీ జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్ల కారణమయ్యే అవకాశం ఉంది.

గోళ్లను అరగించగల శక్తి కడుపులోని ఆమ్లాలకు ఉండదు. అవి అలానే విసర్జన సమయంలో బయటకు వెళ్లిపోతాయి. కానీ, గోళ్లలో ఉన్న మలినాలు, బ్యాక్టిరీయా అప్పటికే శరీరంలో చేరిపోతుంది. ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్లు ఇతర అవయాలకు కూడా పాకే ప్రమాదం లేకపోలేదు.

పంటి నొప్పి:
గోళ్లు పళ్ళల్లో ఇరుక్కుపోవడం ద్వారా పళ్లు నొప్పి వస్తుంది. చిగుళ్ల నుంచి రక్తస్రావానికి దారితీస్తుంది. దంతాలతో నొప్పు వచ్చి తొందరగా పళ్లు ఊడిపోతాయి. గోళ్లను అదేపనిగా కొరికేవారిలో పంటిసమస్యలు అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు పదునైన గోళ్లు పళ్ల చిగుళ్లకు రాసుకుపోవడం ద్వారా నొప్పితో పాటు చిట్లిపోయే ప్రమాదం ఉంది. చిగుళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
First Night Milk Secret : ఫస్ట్‌నైట్ రోజు పాలే ఎందుకు తాగాలి.. అందులో ఉన్న సీక్రెట్ ఏంటి?

అంతకాదు.. పళ్లు పటుత్వం కోల్పోతాయి. చిగుళ్లలో బలం తగ్గిపోయి తొందరగా పళ్లు ఊడిపోవచ్చు. తీవ్రమైన పంటినొప్పికి దారితీస్తుంది. పళ్ల చిగుళ్లకు గోళ్లు గుచ్చుకోవడం ద్వారా తీవ్ర రక్రస్రావం జరిగే అవకాశం ఉంటుంది.

గోళ్ల ఆరోగ్యం కోసం :
గోళ్లు పళ్ళల్లో ఇరుక్కుపోవడం ద్వారా పళ్లు నొప్పి వస్తుంది. చిగుళ్ల నుంచి రక్తస్రావానికి దారితీస్తుంది.చాలామందిలో గోర్లును పెంచుకోవడం ఇష్టపడతారు. పెరిగిన చేతివేళ్ల గోళ్లపై నెయిల్ పాలిష్, రంగురంగుల కలర్లు అప్లయ్ చేస్తుంటారు. చూడటానికి గోళ్లు అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు అన్ని ప్రయోగాలు చేస్తుంటారు.

అయితే మీ గోళ్ల ఆరోగ్యం కోసం ఈ అద్భుతమైన రెమడీని ట్రై చేయండి.. నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆ నిమ్మకాయ ముక్కలను మీ గోర్ల చివరన పెట్టండి.. ఇలా పది నిమిషాల పాటు నిమ్మకాయ ముక్కలను పెట్టుకని ఉంచాలి. కొన్నిరోజుల పాటు ఇలా చేయడం ద్వారా మీ గోళ్లు అందంగా పెరగడమే కాదు.. పటిష్టంగా మారుతాయి.

గోర్ల పెరుగదలకు విటమిన్ ఈ అవసరం.. గోర్లను పెంచుకోవాలి అనేకునేవారు కొంచెం కొబ్బరినూనెను తీసుకోండి. అందులో కొంచెం నిమ్మరసాన్ని కలిపాలి. అలా కలిపిన మిశ్రమాన్ని గ్యాస్ మీద స్విమ్‌లో పెట్టి కాసేపు వేడి చేయాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని గోర్ల పైభాగంలో రుద్దాలి. మీ వంటింట్లో దొరికే వెల్లుల్లి కూడా గోర్లు అందంగా పెరగడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

కొబ్బరినూనె-నిమ్మరసంతో :
ఈ విటమిన్‌ జుట్టు పెరుగుదలకు గోర్లు పెరగడానికి సహయపడుతుంది. గోర్లను పెంచడంలో మంచి ప్రయోజనరంగా ఉంటుంది. కొబ్బరి నూనెను తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి గోరువెచ్చగా వేడి చేయాలి. కొద్దిసేపటి తర్వాత ఆ మిశ్ర‌మాన్ని స్ట‌వ్‌పై ఉంచి ఒక నిమిషం వరకు వేడి చేయాలి. ఆ మిశమ్రాన్ని గోర్ల‌కు అప్లయ్ చేయాలి..

అంతేకాదు.. వెల్లుల్లిని కూడా తీసుకుని రాయడం ద్వారా మీ గోర్లు అందంగా పొడ‌వుగా పెరిగేందుకు సాయపడతాయి. వంటింట్లో దొరకే మసలా దినుషుల్లో వెల్లుల్లి గోర్ల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. గోళ్లను కొరకడం మానేసి.. గోళ్లను అందంగా ఆరోగ్యంగా పెంచుకునేందుకు ప్రయత్నించండి..
Ayurveda Diet Tips : అధిక బరువు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 days ago