Entertainment

Drinking Hot Water : పరిగడుపున వేడి నీళ్లు తాగుతున్నారా? తప్పక తెలుసుకోండి..

Advertisement

10 Benefits of Drinking Hot Water : పరిగడుపున వేడి నీళ్లు తాగుతున్నారా? తప్పక తెలుసుకోండి..పరిగడుపున వేడి నీళ్లు తాగే అలవాటు ఉందా? అయితే తప్పక తెలుసుకోండి.. అనారోగ్యాల బారినపడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం లేవగానే వేడి నీళ్లు తాగాలంట.. అలా తాగిన వారిలో అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఊబకాయం డయాబెటిస్ (మధుమేహం), గుండె జబ్బులు, ఉదర సంబంధిత వ్యాధులు, తలనొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. గోరువెచ్చని నీళ్లతో అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.

అందులో జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే మీ కడుపులోని ప్రేగులు కూడా శుభ్రపడతాయి. మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. ఏమి తినకుండా పరిగడుపున నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా పొట్టలో పేర్కొన్న వ్యర్థపదార్థాలు తొలగించుకోవచ్చు. అప్పుడు గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు రావు. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే గోరువెచ్చని నీళ్లను తాగుతూ ఉండాలి. ఇదొక మంచి అలవాటుగా చేసుకోవాలి. అనారోగ్య సమస్యలను దరిచేరకుండా ఉండాలంటే మీ జీవనశైలిలో ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ ఆహారం తీసుకున్నా లేకున్నా నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని పలు అధ్యయనాల్లో తేలింది.

అందుకే ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోషక నిపుణులు. తరచూ వ్యాధులకు గురయ్యేవాళ్లు ఇంట్లో ఒక చిన్న చిట్కా పాటిస్తే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఉదయాన్నే పరిగడపున వేడి నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు. ఇలా చేయడం ద్వారా మీ శరీరంలోని మలినాలు, వ్యర్థాలు తొలగిపోతాయి. అంతేకాదు.. అధిక బరువుతో బాధపడేవారికి ఈ రెమడీ అద్భుతంగా పనిచేస్తుంది. సకాల రోగాలకు గోరువెచ్చని నీళ్లతో చెక్ పెట్టేయొచ్చు.

10-benefits-of-drinking-hot

శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. అధిక బరువు సమస్య కూడా తగ్గిపోతుంది. ప్రతి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు తాగడం ద్వారా ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. నిద్రలేచిన లేవగానే 2-3 గ్లాసుల గోరు వెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునేంత వరకు దాదాపు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగాలంట.. అంతకంటే ఎక్కువగా తాగిన పర్వాలేదు. అలా అని మితిమిరి తాగడం కూడా చేటే.. ఏది కూడా అతిగా చేయకూడదనే విషయం గుర్తించుకోవాలి.

అదే వేడినీళ్లు అయితే 4 గ్లాసుల వరకు తాగాలి.. తినడానికి ముందు తాగడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణలు సూచిస్తున్నారు. వేడినీళ్లు తాగితే మరో ప్రయోజనం ఏంటో తెలుసా? మీ శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీర అవయాలకు రక్తం అందుతుంది. అప్పుడు మీకు ఎలాంటి ఒళ్లునొప్పులు వంటి అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువగా గోరువెచ్చని నీళ్లను తరచూ తీసుకుంటుండాలి. నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా శరీరంలోని వేడిని కూడా తగ్గించుకోవచ్చు. గంటల తరబడి కంప్యూటర్ల దగ్గర కూర్చొని పనిచేస్తుండే వారంతా గ్యాప్ ఇస్తూ నీళ్లు తాగుతుండాలి. అది కూడా వేడినీళ్లు అయితే మంచిది. అప్పుడు రక్తప్రసరణ జరిగి పనిఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

మరో విషయం గుర్తించుకోవాలి..
ఎప్పడూ కూడా తినేటప్పడు అధికంగా నీళ్లు తాగకూడదు. అలా చేస్తే మీరు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు.. జీర్ణాశయంలోని ఆమ్లాలు పలచబడి అజీర్ణ సమస్యకు దారితీస్తుంది. ఫలితంగా అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు తలెత్తే పరిస్థితి ఉంటుంది. ఆహారం తీసుకోవడానికి రెండు గంటల ముందే నీళ్లు తాగాలి. ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత నీళ్లు తీసుకోవాలి. ఒకవేళ ఆహారం తినే సమయంలో దాహం వేసినా లేదా గొంతులో ఆహారం అడ్డం పడినట్టుగా అనిపిస్తే.. అది కడుపులో జారిపోయేంత నీళ్లు మాత్రమే తీసుకోవాలి.

వేడి నీళ్లు తాగడం వల్ల బెనిఫిట్స్ ఇవిగో :

* కడుపు నొప్పి, అజీర్తి, ఉదర సంబంధిత వ్యాధులు, ఊబకాయం, జీర్ణ సమస్య వంటి సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు. రక్త ప్రసరణ బాగామెరుగుపడుతుంది. మూత్ర సంబంధిత వ్యాధులు కూడా తగ్గిపోతాయి. గోరు వెచ్చని నీళ్లు తాగితే 3-4 రోజుల్లో చాలా మార్పు కనిపిస్తుంది. నోటిపూత సమస్యలతో బాధపడేవారు కూడా గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. గొంతులో మంటగా అనిపించినా లేదా నోటి అల్సర్ల సమస్యతో బాధపడేవారికి కూడా నొప్పి నుంచి రిలీఫ్ పొందాలంటే వేడినీళ్లను తాగితే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. గొంతులో గరగరగా అనిపించినా లేదా ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా వేడినీళ్లతో సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు.

10-benefits-of-drinking-hot

* అధిక బరువు, ఊబకాయం సమస్యలు ఉన్న వారు తరచూ వేడి నీళ్లు తాగుతుండాలి. శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఫలితంగా శరీరంలోని మలినాలు, వ్యర్థాలను బయటకు పంపిచేస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారు రోజూ గోరువెచ్చని నీళ్లు 2నుంచి 3 గ్లాసుల నీళ్లు తాగాలి. ఫ్రిజ్‌లో చల్లటి నీరు తాగొద్దని వైద్యులు సూచిస్తున్నారు. నీరు తక్కువగా తాగేవారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయనేది అందరికి తెలిసిన విషయమే. అయితే నీళ్లను ఎక్కువగా తాగేవారిలో శరీరం ఎప్పుడూ హైడ్రేడ్ గా ఉంటుంది. తేమగానూ కాంతివంతంగానూ కనిపిస్తుంది.

న్యూమోనియా, జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు గోరు వెచ్చని నీళ్లు తప్పనిసరిగా తాగుతుండాలి. గొంతు సమస్యలు ఉన్నవారిలో వేడి నీళ్లు తాగడం వల్ల గొంతులో బ్యాక్టీరియాలు చనిపోతాయి. డిహైడ్రేషన్‌ సమస్య ఉన్నవారు వేడినీటిలో నిమ్మరసం, తేనె, కలుపుకుని తాగాలి. ఇలా ప్రతిరోజూ చేస్తూ ఉంటే అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి..

గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ బారినపడినపపుడు అది మిగతా శరీర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అంటే.. ముక్కు, చెవి వంటి భాగాలకు ఇన్ఫెక్షన్ సోకవచ్చు. అందుకే జలుబు చేస్తున్నట్టు ముందుగా లక్షణాలు కనిపించిన వెంటనే ఆవిరి పట్టడం వంటివి చేయాలి. వేడి ఆవిరిని నోటి ద్వారా పీల్చి ముక్కు ద్వారా వదులుతుండాలి. తద్వారా గొంతు నొప్పి సమస్య నుంచి తొందరగా రిలీఫ్ పొందవచ్చు. చిన్నపాటి ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

1. ముక్కు దిబ్బెడ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
2. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
3. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపడుతుంది.
4. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు
5. హైడ్రేట్‌గా ఉంచుతుంది
6. చలిలో వణుకు తగ్గుతుంది
7. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
8. ఒత్తిడి స్థాయిలను తగ్గించవచ్చు
9. శరీరంలోని విషపదార్థాలను బయటకు తొలగిస్తుంది.
10. అచాలాసియా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఈ ఆరోగ్య చిట్కాలను పాటిస్తే :
ఆహారం అలవాట్లలో మార్పులతో పాటు నీళ్లను ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి. చాలామంది ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించవచ్చు. నిత్యం హైడ్రేట్ గా ఉండాలంటే మీ శరానికి కావాలిసినంత నీరు అందాలి. బాడీలోని శరీర అవయావాలు సక్రమంగా పనిచేయాలంటే నీళ్ల అవసరం చాలానే ఉంటుంది. నీళ్ల ద్వాారానే అవయాలు శుద్ధిచేయగా మిగిలిన వ్యర్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. లేదంటే మూత్రనాళంలోనే వ్యర్థాలు పేరుకుపోతాయి. మూత్రపిండాలు (కిడ్నీలు) బాగా పనిచేయాలంటే వాటికి తగిన మొత్తంలో నీళ్లు అవసరం.. అప్పుడే వాటి పనిని అవి విధిగా పూర్తి చేయగలవు. అలాగే శరీరంలో ప్రధాన అవయవం కాలేయం కూడా శరీరంలోని వ్యర్థాలను క్లీన్ చేస్తుంది. అలా క్లీన్ చేసిన మలినాలను మూత్రపిండాలకు పంపుతుంది. అక్కడే క్లీనింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.

ఇలా.. బాడీ మెకానిజం సరిగా పనిచేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది. నీళ్లు తక్కువగా తీసుకునేవారిలో అవయవాల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే నీళ్లను ఎక్కువగా సార్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒకేసారి నీళ్లను ఎక్కువగా తాగడం కంటే అప్పడప్పుడు పని మధ్యలో విరామం ఇచ్చుకుంటూ నీళ్లను తాగుతుండాలి. అలా రోజు మొత్తంలో ఎక్కువ గ్లాసులను నీళ్లను తాగవచ్చు. నీళ్లను ఒకేసారి తాగేయడం మంచిది కాదని గుర్తించుకోవాలి. గంట గంటకు మధ్య గ్యాప్ ఇస్తూ నీళ్లను తాగవచ్చు. ఫలితంగా మెరుగైన ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. అందుకు అంటారు కదా.. ఆరోగ్యమే మహాభాగ్యం..  అన్నమాట.. ఇంకెందుకు ఆలస్యం చేస్తారు.. ఈ రోజు నుంచే నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి..
Read Also :  Wife Avoiding Husband : మీ భాగస్వామికి శృంగారంపై ఆసక్తి తగ్గుతోందా? అందుకు కారణం మీరే?

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 days ago