
best ayurveda moolika benefits : ఆయుర్వేద మూలికలు అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయనడంలో చేస్తాయనడంలో సందేహమే అక్కర్లేదు. ఆయుర్వేదంలో ఈ మూలికలకు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. కొన్ని ఆయుర్వేద మూలికల్లో ఎక్కువగా ఆశ్వగంధ, ఉసిరి, త్రిఫల చూర్ణయం, బ్రహ్మి, యూలుకలు అద్భుతంగా పనిచేస్తాయి. ఆయుర్వేద వైద్యంలో ఉసిరి, త్రిఫల చూర్ణం, అశ్వగంధాలకు ఎంతో పేరొంది. చాలా అనారోగ్య సమస్యలను తగ్గించగల మంచి ఔషధ గుణాలు వాటిలో పుష్కలంగా ఉన్నాయి. మరికొన్ని మూలికల్లో బ్రహ్మ మూలిక ఒకటి.. ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఉసిరి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెల్ల జుట్టుతో బాధపడేవారికి ఉసిరి మంచి ఔషధంగా పనిచేస్తుంది. కొన్నిరకాల క్యాన్సర్లను కూడా నిర్మూలించగల గుణాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారిలోనూ ఆయుర్వేద మూలికలతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఏయే మూలికలతో ఎలాంటి అద్భుత ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఉసిరి తినడానికి పుల్లగా వగరుగా ఉంటుంది. ఉసిరిని పొడిచేసి ఆ పొడిని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అలాగే వంటింట్లో దొరికే యాలకులు కూడా అద్భుతంగా పనిచేస్తాయని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
ముఖ్యంగా పొట్టలో ఏర్పడే అల్సర్ల వంటి సమస్యలను తొందరగా తగ్గించగల శక్తి వాటికి ఉందని అంటున్నారు. ప్రస్తుత జీవన విధానంలో మానసిక ఒత్తిడితో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటివారిలో అశ్వగంధ మూలిక మిశ్రమాన్ని సేవించడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని చెబుతున్నారు. ఆయుర్వేద వైద్యంలో చెప్పిన అనేక మూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటున్నారు. ఎందుకంటే.. నేచరుల్ గా దొరికేవి కావడంలో వీటిలో ఎలాంటి రసాయన పదార్థాలు ఉండవు. ఈ ఆయుర్వేద ఔషధ గుణాలున్న మూలికల్లో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఓసారి చూద్దాం..
ఉసిరి: ఆయుర్వేద వైద్యంలో ఉసిరి ఎంతో ప్రయోజనకారిగా పనిచేస్తోంది. ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జుట్టు సమస్యలను తొలగించగల ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఉసిరిని వాడటం ద్వారా అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ప్రతిఒక్కరూ తమ ఆహరంలో ఉసిరిని చేర్చుకోండి. పరిగడపున ఉసిరి చూర్ణాన్ని తాగినా మంచి ఫలితం ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. చుండ్రు సమస్యతో పాటు తెల్ల జుట్టును నల్లగా మార్చేయగల అద్భుత గుణాలతో ఉసిరి బాగా పనిచేస్తుంది.
త్రిఫల చూర్ణం : ఆయుర్వేదంలో త్రిఫల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నిర్మూలిస్తుంది. ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేషన్ తగ్గించగల శక్తి దీనికి ఉంది. ఈ చూర్ణాన్ని పరిగడపున ఏమి తినకుండా కొంచెం గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగేయాలి. ఇలా చేస్తే మలబద్ధకం సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఉదయం పూట ఒక మూడు చెంచాలు లేదా అంతకంటే తక్కువ మోతాదులో తీసుకున్నా సరిపోతుంది. రాత్రిపూట ఆహారం తిన్న తర్వాత కూడా ఒక గ్లాసులో గోరు వెచ్చని నీటిలో ఈ చూర్ణాన్ని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని తాగడం ద్వారా ఆ రాత్రి తిన్న ఆహారమంతా సులభంగా జీర్ణమవుతుంది. ఉదయానికి సుఖ విరేచనం అవుతుంది. ఇలా కొన్నివారాలపాటు చేస్తే గ్యాస్ ట్రబుల్ సమస్యలు తగ్గించుకోవచ్చు.
యాలుకలు: వంటింటిలో వాడే దినుషుల్లో యాలుకలు ఒకటి. యాలకులను పొడిగా చేసి వాడితే బ్లడ్ ప్రెషర్ అదుపులోకి తెస్తుంది. కడుపులో వచ్చే అల్సర్లని కూడా మటుమాయం చేస్తుంది. యాలకులు రుచికే కాదండీ.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని రుజువైంది. యాలుకలను రోజుకు ఒకటి రెండు లేదా యాలకులను నమలడం చేయండి.. ఇలా చేయడం ద్వారా మీ నోట్లో దుర్వాసన కూడా తగ్గించుకోవచ్చు. అలాగే రక్తపోటు సమస్య ఉన్నవారికి యాలుకలు అద్భుత ఔషధమని చెప్పవచ్చు. రక్తపోటు అదుపులోకి రావాలంటే మీ ఆహారంలో యాలకులను కూడా చేర్చుకోవడం చాలా మంచిది.
అశ్వగంధ మిశ్రమం: అశ్వగంధ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయుర్వేదం వైద్యంలో ఆశ్వగంధకు ఎంతో ప్రసిద్ధి. దీని వాడకం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడిని తొలగించడంలో అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్యలు కూడా అశ్వగంధ దూరం చేయగలదు. జ్ఞాపక శక్తి పెంచుకోవడమే కాదు.. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడానికి సాయపడుతుంది.
బ్రహ్మీ మూలిక : ఈ మూలికను ఆయుర్వేదంలో విరివిగా వాడుతుంటారు. ఆయుర్వేద వైద్యంలో బ్రహ్మీ అద్భుత ఔషధ మూలిక.. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. జ్ఞాపక శక్తి పెంచుతుంది. అలాగే మానసిక ఒత్తిడిని కూడా తగ్గించగలదు. మతిమరుపు సమస్యతో బాధపడేవారిలో ఈ బ్రహ్మీ మూలిక దివ్యాషధమని చెప్పవచ్చు. మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ మూలికను వాడటం ద్వారా త్వరలోనే మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చు. మూలికను వాడటం ద్వారా చిత్త వైకల్యం సమస్యను దూరం చేసుకోవచ్చు. మతిమరుపు సమస్య తగ్గిపోయి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.
ప్రెగ్నెన్సీ కోసం మీరు ప్లాన్ చేస్తున్నారా?
ఆయుర్వేద మూలికల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. కొత్త పరిశోధన ప్రకారం.. ఈ మూలికలు వాడటం ద్వారా ఫెర్టిలిటీ వంటి సంతాన సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో అద్భుతమైన మూలికల పనితీరుకు సంబంధించి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించేవారు ఈ ఆయుర్వే మూలికలతో తొందరగా గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. గర్భిణీలకు ఎదరయ్యే సమస్యను కూడా దూరం చేయగల గుణాలు ఉన్నాయి. చాలామందిలో ఫర్టిలిటీ (సంతానలేమి) వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. పిల్లలను కనేందుకు వారెంత ప్రయత్నించినా ఫలితం అనుకూలంగా రాదు. తమకు ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదని బాధపడి పోతుంటారు.
శతావరి (Asparagus) :
మహిళల్లో ఎక్కువగా సంతానలేమి సమస్యలు ఉంటే.. శతావరి (Asparagus) మూలికను తీసుకోవాలి. ఈ ఆయుర్వేద మూలికలను తీసుకోవడం వల్ల సంతాన సాఫల్యతను పొందవచ్చు. మహిల్లో రిప్రొడక్టివ్ టానిక్ గా పనిచేస్తుంది. సంతాన సాఫల్య అవకాశాలను పెంచుతుంది. మహిళల్లో ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గర్భ సంబంధిత సమస్యలను దరిచేరకుండా నివారిస్తుంది. ఎందుకంటే ఈ మూలికలో ఫైటో ఈస్ట్రోజెన్ గుణాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే సమయంలో రిప్రొడక్టివ్ సైకిల్ పెరిగేందుకు సాయపడతాయి. మానసికరమైన ఒత్తిడులను కూడా తగ్గించగల సామర్థ్యం ఉంది. లాక్టేషన్ సామర్థ్యాన్ని కూడా సమృద్ధిగా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు.. గర్భిణీలకు ఈ మూలికలతో మరెన్నో ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
అశ్వగంధ (ashwagandha) :
ఫెర్టిలిటీ (సంతానోత్పత్తి) సమస్యలను నివారించడంలో అశ్వగంధ మూలిక అద్భుతంగా పనిచేస్తుంది. మహిళల్లో కంటే పురుషుల్లో లైంగికపరమైన ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సాయపడుతుంది. మీ లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. పురుషుల్లో ఎక్కకువగా నిపించే సైకోజెనిక్ ఇంపొటెన్స్ వంటి సమస్యలని దూరం చేయగలదు. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెంచడంలో అశ్వగంధ మంచి ఔషధంగా పనిచేయడమే కాదు…స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.
కొన్ని అధ్యాయనాలను పరిశీలిస్తే.. ఈ మూలికలను ఉపయోగించడం ద్వారా రిప్రొడక్టివ్ హార్మోన్స్ తగినంత స్థాయిలో ఉత్పత్తి అవుతాయి. మహిళల్లో నెలసరి సరిగా రాని వారిలో పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చేస్తాయి. కొంతమంది మహిళల్లో పీరియడ్స్ సరిగా రావు. అలాంటి మహిళలు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తే ఫలితం ఉండదు.
ఈ అశ్వగంధను వాడటం ద్వారా పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు దోహదపడతాయి. ప్రెగ్నెన్సీ సంబంధిత సమస్యల నుంచి తొందరగా బయటపడొచ్చు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే మీకు దగ్గరలోని ఆయుర్వేద ఔషధాలయం వెళ్లి నిపుణుల సలహాతో వాడుకోవచ్చు. తద్వారా ప్రెగ్నెన్సీ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ఆయుర్వేద మూలికలను ఎలాపడితే అలా వాడకూడదని గుర్తించుకోవాలి. ఆయుర్వే వైద్యంలో సూచించిన విధంగా మూలికలను వినియోగించుకోవాలి. ఏయో మోతాదులో మూలికలను తీసుకోవాలి? ఏ సమయంలో తీసుకోవాలనేది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు చాలామంది తెలియకుండా.. ఏ నిపుణల సలహాలు తీసుకోకుండా సొంతంగా వాడేస్తుంటారు. ఇలా చేయడం కూాడా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
అందుకే మూలిక వైద్యాన్ని తీసుకునేవారు తప్పనిసరిగా ఆయా మోతాదుల విధానం తెలుసుకోని వాడుకోవడం చాలా ఉత్తమం. ఏ ఔషధమైన సరే దానికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. అది పూర్తిస్థాయిలో పొంది అనారోగ్య సమస్యలను తగ్గించుకోవాలంటే మీరు సరైన పద్ధతిలోనే మూలికలను నిపుణుల సలహాలతో వాడాల్సి ఉంటుంది.
Read Also : Covid Symptoms In Children : చిన్నపిల్లల్లో కరోనా ప్రారంభ లక్షణాలతో జాగ్రత్త…!
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.