Skin Glow Overnight : అందంగా కనిపించాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. కానీ, అందుకు వారు ఎటువంటి పద్ధతులు ఫాలో అవుతారు అనేది ముఖ్యం. ఇకపోతే చర్మం కాంతివంతంగా ఉంటేనే మనుషులు ఆడ అయినా మగ అయినా అందంగా కనిపిస్తుంటారు. అందుకుగాను మీరు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. చర్మతత్వాన్ని బట్టి పలు పద్ధతులు పాటించాలి. అయితే, అందరిలాగా కెమికల్స్ ఉండే ఆయిల్స్, మాయిశ్చరైజర్స్ వాడటం కంటే కూడా చిన్న చిన్న వంటింటి చిట్కాలు పాటిస్తే చాలు.. మీ చర్మం నిగారిస్తుంది. ఆ చిట్కాలు ఏంటి, ఎటువంటి పద్ధతులు పాటిస్తే మీ చర్మం తళ తళ మెరుస్తుందో ఈ స్టోరి చదివి తెలుసుకుందాం.
మల్లానీ మట్టితో చర్మం మెరుపు (multani mitti face pack) :
సాధారణంగా చర్మ నిగారింపు, సంరక్షణ అనేది కేవలం సెలబ్రిటీలకు ముఖ్యం అని కొందరు అంటుంటారు. కానీ, అది అందరికీ అవసరమైనది. చర్మ సంరక్షణకు సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా వాడే చిట్కాల్లో ఒకటి ముల్తానీ మట్టి. ఈ మట్టిని రాసుకుని కొద్దిసేపు ఉంచుకుంటే చాలు.. మీ చర్మం ఇట్టే మెరుస్తుంది. ముల్తానీ మట్టి పూర్వ కాలం నుంచి కూడా అందుబాటులో ఉందని పెద్దలు చెప్తుండటం మనం చూడొచ్చు. ఇకపోతే కలబందను జ్యూస్‌లా చేసుకుని తాగడం వల్ల చర్మం నిగారిస్తుంది. ఇకపోతే అలోవెరా ప్రొడక్ట్స్ చాలా ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అందులో కొన్నిటిని ముఖం మీద డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది.
ఇకపోతే మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా చర్మ ఆరోగ్యంపైన ఎఫెక్ట్ చూపుతాయి. ఈ క్రమంలోనే చర్మ సంరక్షణకు అవసరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ప్రతీ రోజు నిద్రించే ముందర ముఖాన్ని నీట్‌గా మంచి నీటితో కడుక్కోవాలి. అలా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందట. ఇక మార్కెట్ లో లభించే వివిధ ప్రొడక్ట్స్ కంటే కూడా సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించిన ఫ్రూట్స్, ఇతర పదార్థాలతో మీరే సెపరేట్ ప్యాక్స్ చేసుకున్నా మంచి ప్రయోజనాలే ఉంటాయి. ఏ సీజన్‌కు ఆ సీజన్ ఫ్రూట్స్ తీసుకుంటే మీకు మంచి ఉపయోగాలుంటాయి. యాపిల్, బనానాతో కూడా మీరు ప్యాక్‌గా చేసుకుని ముఖానికి రాసుకోవచ్చు. అలా చేయడం ద్వారా మీ ముఖం మీద ఉన్న చర్మం మరింత తేజోవంతంగా మారుతుంది. యాపిల్ పండ్లు కూడా చర్మ నిగారింపునకు దోహదపడతాయి.
యాపిల్‌తో చర్మ సౌందర్యం (Beauty with Apple Mask) :
యాపిల్ పైన పొట్టును తీసేసిన గుజ్జును మొత్తగా చేసి దానికి కొంచెం తేనే యాడ్ చేసి పేస్ట్‌లా తయారు చేసుకుని, దానని ఫేస్‌కు అప్లై చేస్తే మంచి ప్రయోజనాలుంటాయి. ఇలా యాపిల్ ప్యాక్‌ను మీ ఫేస్‌పై అప్లై చేసి ఉంచుకున్న తర్వాత నీట్‌గా హాట్ వాటర్‌తో క్లీన్ చేసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయి. ఈ ప్యాక్‌తో పాటు బాగా పండిన అరటి పళ్లను కూడా మీరు చర్మ సంరక్షణకు వాడుకోవచ్చు. బాగా పండిన అరటి పళ్లను గుజ్జుగా మొత్తగా చేసి దానికి కొంచెం తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దానికి కొంచెం తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.
అలా కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత వాటర్‌తో క్లీన్ చేసుకుంటే మీ స్కిన్ మెరిసిపోతుంది. ఇకపోతే చర్మ నిగారింపు, అందం కోసం చాలా మంది సెలబ్రిటీలు యాడ్స్ ఇస్తుంటారు. వాటిని చూసి ఆ ప్రొడక్ట్స్ వాడి వెంటనే ఎఫెక్ట్ చూపించాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. అలా మీకు ప్రొడక్ట్ పని చేసినట్లు అనిపిస్తుంది. కానీ అది తాత్కాలికం మాత్రమే. ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది.
బియ్యం పిండి భేష్ (Rice Flour) :
ఇక చర్మాన్ని తాజాగా మార్చేందుకుగాను సహజ సిద్ధంగా ప్రతీ ఇంట్లో లభించే బియ్యం పిండిని వాడటం చాలా మంచిది. బియ్యం పిండిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు స్కిన్ హెల్దీనెస్‌ను కాపాడటంతో పాటు ఫ్రెష్‌గా ఉంచుతాయి. చర్మంను సాఫ్ట్‌గా ఉంచుతూనే, మిమ్మల్ని యూత్ ఫుల్‌గా కనిపించేలా బియ్యం పిండి చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బియ్యం పిండితో ఇతరాలు మిక్స్ చేసి ప్యాక్ చేసే వాడినా మీకు మంచి ఫలితాలే ఉంటాయి. ఆలోవెరా అనగా కలబంద గుజ్జును బియ్యం పిండితో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ చేసుకుంటే చక్కటి ప్రయోజనాలుంటాయి. విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగాఉండే ఆలోవెరాలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కిన్ హెల్దీనెస్‌కు చాలా మంచివి.
తయారీ ఇలా (Making Tips) :
బియ్యం పిండి ఒక చెంచడు తీసుకుని దానికి ఒక చెంచడు కలబంద గుజ్జు, ఒక చెంచడు తేనె కలిపి మిశ్రమం తయారు చేయాలి.అలా తయారు అయిన మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి ఆ తర్వాత ఫేస్‌కు అప్లై చేసుకోవాలి. ఫేస్‌కు అప్లై చేసుకున్న తర్వాత ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచాలి. కొంచెం సేపు అలానే ఉంచిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే మీ చర్మం ఎంతో అందంగా నిగారిస్తుంది. ఇక పోతే చర్మం గరుకుగా ఉంటే సాఫ్ట్‌నెస్ కోసం కూడా బియ్యం పిండి ప్యాక్ వాడొచ్చు.
అయితే, ఈ సారి ఇందులో బియ్యం పిండితో పాటు బేకింగ్ సోడాను మిక్స్ చేసి ప్యాక్ తయారు చేసుకోవాలి. తేనె, బియ్యం పిండి, బేకింగ్ సోడా మూడింటిని ఒక గిన్నెలో తీసుకుని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. అయితే, బేకింగ్ సోడా ఒకటి చిటికెడు చాలు.. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. సమపాళ్లలో బియ్యం పండి, తేనె, చిటికెడు బేకింగ్ సోడా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత సున్నితంగా మర్దన చేసుకోవాలి. బాగా డ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకుంటే మీ స్కిన్ బాగా సాఫ్ట్ అవుతుంది.
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.