
Phone Swab Test Detect COVID-19 Virus: కరోనా టెస్టును ఎంతో సులభంగా ఎవరికి వారే చేసుకోవచ్చు. మీ చేతిలో మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా నిర్ధారించుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. ఫోన్ ద్వారా స్వాబ్ సేకరించడమే.. కచ్చితమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు నిపుణులు. డయాగ్నోసిస్ బయోటెక్‌లోని UCL పరిశోధకుల నేతృత్వంలోని బృందం మొబైల్ ఫోన్‌ల స్ర్కీన్ నుంచి తీసిన శాంపిల్స్ ఉపయోగించి COVID-19 నిర్ధారణ చేసుకోవచ్చుని వెల్లడించింది. అందులోనూ ఈ కరోనా టెస్టుకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.
సాధారణంగా కరోనా టెస్టు కోసం ముక్కులో నుంచి స్వాబ్ సేకరిస్తారు. ఇదికొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలా కాకుండా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లపై తాకిన మరకలను స్వాబ్ లా శాంపిల్స్ సేకరించవచ్చు. ఇలా పరీక్షించిన వ్యక్తుల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. కొత్త పద్ధతి – ఫోన్ స్క్రీన్ టెస్టింగ్ (PoST) అని పిలుస్తారు. అధిక వైరల్ లోడ్ ఉన్న 81 నుండి 100% మంది ఫోన్లలో COVID-19 వైరస్ గుర్తించింది. ఇదియాంటిజెన్ ర్యాపిడ్ టెస్టుల వలె ఖచ్చితమైనదని పరిశోధకులు సూచిస్తున్నారు.
నిమిషం కన్నా తక్కువ వ్యవధిలోనే :
పోస్ట్ అనేది క్లినికల్ టెస్ట్ కాకుండా పర్యావరణ పరీక్ష.. నాసికా శుభ్రపరిచే పిసిఆర్ హానికరం కావొచ్చు.. కానీ, ఇది తక్కువ ఖర్చుతో కూడినదిగా చెబుతున్నారు. ఈ కరోనా టెస్టుకు శాంపిల్స్ తీసుకున్నాక ఒక నిమిషం కన్నా తక్కువ సమయంలో ఫలితాలు వస్తాయి. వైద్య సిబ్బంది కూడా అవసరం లేదు. మీకు మీరే ఈ కరోనా టెస్టును చేసుకోవచ్చు. పోస్ట్ శాంపిల్స్ సురక్షితంగా ఉంటాయి. అలాగే నేరుగా కాంటాక్ట్ కానవసరం లేదు.. SMS ద్వారా ఫలితాలను పొందవచ్చు.
కరోనా టెస్టులో కచ్చితమైన ఫలితాలు రావాలంటే ఎక్కువగా RT-PCR టెస్టులోనే ఉంటాయని అంటుంటారు. అయితే ర్యాపిడ్ టెస్టు త్వరగా రిజల్ట్ వచ్చినప్పటికీ వైరస్ కచితత్వాన్ని వంద శాతం చూపించలేదు. కరోనా టెస్టు చేయించుకుంటే నెగటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు వైరస్ పాజిటివ్ అయినా నెగటివ్ అని కూడా రావొచ్చు. కరోనా లేదనకుంటే పొరపాటే.. అది క్రమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కరోనా టెస్టుల్లో కొంచెం గందరగోళం నెలకొంటోంది. కరోనా పరీక్ష చేయించుకున్నా వైరస్ ఉందో లేదో నిర్ధారించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొనే వారు లేకపోలేదు.
అందుకే ఈ గందరగోళాన్ని దూరం చేసే కొత్త మెథడ్ అందుబాటులోకి వచ్చేసింది. అదే.. మొబైల్ స్వాబ్ కరోనా టెస్టు (Phone Swab Test)… దీనిద్వారా సులభంగా కొద్దిక్షణాల్లోనే కచ్చితమైన కరోనా టెస్టు ఫలితాన్ని పొందవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ టెస్టు కోసం మీరెక్కెడికో వెళ్లాల్సిన పనిలేదు కూడా. ఇంట్లోనే ఉండి ఈ కరోనా మొబైల్ స్వాబ్ టెస్టు చేేసుకోవచ్చు. ఫలితం కూడా కరెక్టుగా వస్తుందట.
మొబైల్ స్క్రీన్ మరకలతో టెస్టు :
కరోనా టెస్టు చేసే ముందు.. మీ మొబైల్ తీసుకోండి.. ఫోన్ స్క్రీన్ పై కనిపించే మరకల ద్వారా పరీక్ష చేయించుకోవచ్చు. ముక్కులోపల నుంచి స్వాబ్ తీసుకునే పరీక్ష చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఈ టెస్టు అయితే ఎలాంటి ఇబ్బంది పడనవసరం లేదు. ఈజీగా తొందరగా వంద శాతం రిజల్ట్స్ పొందవచ్చు.
కరోనా మొబైల్ స్క్రీన్ స్వాబ్ టెస్టులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా కరోనా టెస్టు కోసం నోటి లోపల నుంచి శాంపిల్స్ సేకరించాలి. అదే మొబైల్ స్ర్కీన్ స్వాబ్ టెస్టుల కోసం లాలాజల పరీక్ష చాలా సులభమైన పద్ధతిగా చెప్పవచ్చు. ఈ కరోనా స్వాబ్ కిట్లు ఇంటి వద్ద నుంచే టెస్టు చేసుకోవచ్చు. లాలాజలం తీసిన వెంటనే పరీక్ష చేయవచ్చు. కొన్ని క్షణాల వ్యవధిలోనే టెస్టు ఫలితాలు వచ్చేస్తాయి. ఇలాంటి పరీక్షలతో కరోనా లక్షణాలు లేకపోయినా వారిలో వైరస్ ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. అంతేకాదు.. ముందే గుర్తించడం ద్వారా వైరస్ వ్యాప్తిని తొందరగా నియంత్రణలోకి తీసుకురావచ్చు.
ఈ కొత్త విధానంలో కరోనా టెస్టు చేయించుకోవడం ద్వారా కరోనా వైరస్ సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించని వారిని తొందరగా గుర్తించేందుకు వీలుపడుతుంది. అదే ఇతర కరోనా టెస్టుల్లో అయితే సమయం ఎక్కువ పడుతుంది. ఐదు లేదా వారం రోజుల వరకు ఎదురుచూడాల్సి వస్తుంది. ఇంతలోనే కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది. దాంతో గుర్తించడం కష్టంగా మారుతోంది. వారికి తెలియకుండానే లక్షణరహిత కొవిడ్ బాధితులు ఒకరి నుంచి మరొకరికి సూపర్ స్ప్రెడర్లుగా మారిపోతున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఈ రకమైన మొబైల్ స్వాబ్ కరోనా టెస్టుతో అప్పటికప్పుడే కరోనా వందశాతం ఫలితాలను పొందవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.
అనుమానం వస్తే ఐసోలేషన్‌లోకి :
ఇంటి దగ్గరే కరోనా పరీక్ష చేసుకునే వెసులుబాటు ఉండటంతో తొందరగా ఫలితాలు పొందవచ్చు. అలాగే కరోనా కేసులను వేగంగా గుర్తించేందుకు ఈ కొత్త మెథడ్ అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందుగానే ఈ టెస్టు చేయించుకుని అనుమానం ఉంటే వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్లిపోవచ్చు. ఇతరులకు దూరంగా ఎవరికి వారే క్వారంటైన్ లో ఉండి చికిత్స కొనసాగించవచ్చు. ఇంతకీ లాలాజల పరీక్ష ఎలా పనిచేస్తుందంటే.. లూప్ మెడియటేడ్.. ఐసో థర్మల్ ఆమ్సిఫికేషన్ మెథడ్ సాయంతో పరీక్షిస్తారు. కరోనా పరీక్షలకు ఈ టెస్టు అద్భుతంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. కేవలం గంట వ్యవధిలోనే ఫలితాలు పొందవచ్చు.
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.