Sweet Corn Pelala Pindi : తొలి ఏకాదశి రోజున చేసే స్పెషల్ ప్రసాదం పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. ఈ పేలల పిండిని ఎక్కువగా జొన్నలతో చేస్తారు. అయితే, జొన్నలు అందుబాటులో లేని వాళ్ళు ఈ పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలి? ఈ పేలాల పిండిని మొక్కజొన్నలతో కూడా చేస్తారు. జొన్నలు అందుబాటులో లేని వాళ్ళు చక్కగా ఇలా మొక్కజొన్నలతో కూడా పేలాల పిండిని తయారు చేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న గింజలు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. పాప్ కార్న్ చేసుకుంటాం కదా. ఆ మొక్కజొన్న గింజలు ఏవి ఒక చిన్న కప్పు తీసుకోవాలి.
అలాగే సగం కప్పు వరకు పుట్నాలు తినేసేన పప్పు అంటారు. సగం కప్పు తీసుకోవాలి. కొన్ని జీడిపప్పు, బాదంపప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. కొంచెం ఎండుకొబ్బరి రెండు యాలకులు, సన్నగా తురిమిన ఒక కప్పు బెల్లం ఇవన్నీ రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పేలాలు తయారు చేసుకుందాం. స్టవ్ అండ్ పాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు మొక్కజొన్న గింజల్లో నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటే పేలాలు చక్కగా వస్తాయి. ఇలా వేయిస్తూ ఉంటే కొంచెం సేపటికి బాగా వేగీ చక్కగా పాప్ అవుతున్నాయి. ఇప్పుడు మూతని కొంచెం పక్కకు పెట్టేసుకుని ఫ్లేమ్‌ని హైలో పెట్టేస్తే ఈ పేలాలు చక్కగా పేలుతాయి.
మధ్య మధ్యలో ప్యాన్ కలుపుకుంటూ ఉంటే చక్కగా పేలుతున్నాయి. మధ్య మధ్యలో ప్యాన్ కలుపుకుంటూ ఉంటే అన్నీ కూడా చక్కగా పేలుతాయి. ఇలా పేలడం ఆగిపోగానే వీటిని తీసి మరొక ప్లేట్‌లోకి వేసేసుకోండి. పేలాలు అన్ని కూడా చక్కగా పేలాయి. ఒక ప్లేట్ లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెయ్యి లేకుండా కూడా ఈ పేలాలని చేసుకోవచ్చు. నెయ్యి లేకుండా కూడా చక్కగా పేలుతాయి. మీడియం ఫ్లేమ్‌లో బాగా వేయిస్తూ ఉంటే కొంచెం సేపటికి చక్కగా పేలాలు వస్తాయి. మూతని పూర్తిగా క్లోజ్ చేయకుండా కొంచెం పక్కకు పెట్టుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. మధ్య మధ్యలో ప్యాన్ కలుపుకుంటూ ఫ్లేమ్‌ని మీడియంకి హైకి అడ్జస్ట్ చేసుకుంటే ఈ పేలాన్ని చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పేలాలన్నీ చేసుకోవాలి. నాన్ స్టిక్ పాన్ బదులుగా అడుగు మందంగల బాండీలో కూడా ఈ పేలాలు చక్కగా వస్తాయి.
నెయ్యి వేయకపోయినా కానీ చక్కగా వచ్చాయి. ఇలాగే అన్ని తయారు చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారే లోపు మరొక్క పక్కన ఫ్యాన్‌లో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు బాదం పలుకులు వేసుకొని వేయించుకోవాలి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. ఇవి వేయడం వల్ల పేలాల పిండి మరింత రుచిగా ఉండి పిల్లలు తినడానికి ఇష్టపడతారు. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. పేలాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. దీంతో పాటుగా రెండు యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మిగిలిన కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పుట్నాలు వేసుకోవాలి. ఒక కప్పు మొక్కజొన్నలు గింజలు తీసుకున్నాం కదా. అరకప్పు పుట్నాలు అర కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పుట్నాలు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయొచ్చు. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకోండి. మొక్కజొన్నలు ఎంత తీసుకున్నామో తురిమిన బెల్లం కూడా అంతే తీసుకోవాలి. ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకొని ఈ బెల్లం ఈ పొడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్లీ మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బెల్లం అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే.. కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. బెల్లం అంతా కూడా చక్కగా కలిసిపోయింది. పేలాల పిండి రెడీ అయిపోయింది. మిక్సింగ్ బౌల్‌లోకి తీసేసుకుని వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పలుకులు వేసుకొని కలుపుకోవాలి. ఈ పేలాల పిండిలో జీడిపప్పు బాదం పుట్నాలు, కొబ్బరి వేసుకోవచ్చు. మొక్కజొన్నలు యాలకులు బెల్లం ఉంటే సరిపోతుంది. హెల్తీగా పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ విధంగా జొన్నలు అందుబాటులో లేని వాళ్ళు మొక్కజొన్నలతో కూడా పేలాల పిండిని చేసి తొలి ఏకాదశి రోజున ప్రసాదంగా పెట్టొచ్చు.
Read Also : Tholi Ekadasi 2023 : తొలి ఏకాదశి ఎప్పుడు? ఈ ఏడాదిలో ఏ తేదీలో వస్తుంది? సమయం ఏంటి? ఎలాంటి ఆచారాలు పాటించాలి?
Anjeer : డ్రై ఫ్రూట్స్‌లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.