Food Recipes

Garlic Chicken Fry : గార్లిక్ చికెన్ ఫ్రై.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ చికెన్ టేస్టీగా రావాలంటే ఇలా చేయాల్సిందే..!

Advertisement

Garlic Chicken Fry : గార్లిక్ చికెన్ ఫ్రై.. స్పైసిగా ఇష్టపడే వారి కోసం ఈ చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది. స్పెషల్ గార్లిక్ చికెన్ ఫ్రై వేడివేడి అన్నంలో, జొన్న రొట్టెలో చపాతి పరోట రాగిసంకటి చిరుధాన్యాల రైస్ తో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు… చికెన్-750 గ్రామ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్-1 టేబుల్ స్పూన్, కారం ఉప్పు( రుచికి తగినంత) నూనె, నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు-2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు-20, ధనియాలు-1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి-7, దాల్చిన చెక్క-2 ఇంచులు, మిరియాలు-1 టేబుల్ స్పూన్, పసుపు-1/2 టీ స్పూన్, యాలకులు-3, లవంగాలు-3, ఉల్లిపాయ-1( పెద్దది),….

తయారీ విధానం… చికెన్ ముక్కలను శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్ లోకి చికెన్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ సగంచెక్క నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం.. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి లో ఫ్లేమ్ లో ఉంచి 2in దాల్చిన చెక్క, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, మూడు యాలకులు, మూడు లవంగాలు, ఏడు ఎండుమిర్చి, దోరగా వేయించుకోవాలి.

simple garlic chicken fry recipe in telugu

ఆ తర్వాత మసాలా దినుసులు చల్లారాక మిక్సీ జార్ లో మెత్తటి పొడిగా అయిన తర్వాత 20 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేయాలి ఈ పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యాగ్నెట్ చేసిన చికెన్ వేసి కలుపుకోవాలి. ఐ ఫ్లేమ్ లో ఉంచి రెండు నిమిషాలు చికెన్ వేగనివ్వాలి.

Simple Garlic Chicken Fry : గార్లిక్ చికెన్ ఫ్రై.. :

మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ లో ఉన్న వాటర్ అంత పోయి నూనె పైకి తేలేంతవరకు చికెన్ ముక్క ఉడికేంతవరకు (15 నిమిషాలు) వేయించుకోవాలి. ఆ తర్వాత మూత పక్కన పెట్టేసి చికెన్ ఫ్రై ని ఒక్కసారి కలిపి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని చికెన్ బాగా ఫ్రై అయిన నూనె పైకి వచ్చిన తర్వాతే ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసి చికెన్ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.

రెండు నిమిషాల తర్వాత రుచికి తగినంత కారం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి.. అంటే ఎంతో రుచికరమైన స్పైసి స్పైసి వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై రెడీ..

Read Also : Andhra Chicken Gravy Recipe : ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ.. ఈ కోడి కూరను ఇలా గ్రేవీతో చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది.. ఓసారి మీరూ ట్రై చేయండి!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

1 month ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

1 month ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

1 month ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

5 months ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

5 months ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

5 months ago