Chicken Tomato Curry : చికెన్ టమాట కర్రీ ఎప్పుడైనా తిన్నారా? అయితే ఈసారి తప్పకుండా తిని చూడండి.. ఆ తర్వాత మీరే వావ్ ఎంత టేస్టీ అంటారు. అంత రుచిగా ఉంటుంది. చికెన్ టమాట కర్రీ ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు చేయాల్సిందిల్లా.. ఎలా తయారు చేయాలో తెలిస్తే చాలు.. రెస్టారెంట్ స్టయిల్‌లో అంత రుచి రావడానికి అందులో వాడే ఇంగ్రేడియంట్స్ ఏంటి? వాటిని ఎలా తయారుచేసుకోవాలి? చికెన్ టమాట కర్రీ తయారీలో ఎలా వాడాలి ఇప్పుడు తెలుసుకుందాం..
చికెన్ టమాటా కర్రీ కి కావలసిన పదార్థాలు..
చికెన్ 2 కేజీలు, పెరుగు పావు కేజీ, టమాట వన్ కేజీ , సన్నగా తరిమిన ఉల్లిపాయలు రెండు, నూనె 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు టేబుల్ స్పూన్, పసుపు రెండు టేబుల్ స్పూన్, కారం 5 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక టేబుల్ స్పూన్, చికెన్ మసాలా రెండు టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ఆరు పొడవుగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర ఒక కట్ట, ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, పెరుగు అన్ని వేసి బాగా కలుపుకోవాలి.. ఇప్పుడు మిక్సింగ్ చేసిన చికెన్ పది నిమిషాలు ఫ్రిజ్లో పెట్టుకోవాలి..
స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్న చికెన్ తీసి అందులో వేసి బాగా కలపాలి మూత పెట్టుకోవాలి చికెన్ లో ఉన్న నీళ్ల పోయేంతవరకు ఉడికించాలి.
పది నిమిషాల తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేయాలి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఫుల్ గా పెట్టుకొని పది నిమిషాలు ఉంచిన తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత ఇప్పుడు కారం, ఉప్పు సరిపోయే లేవు చూసుకోవాలి ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, చికెన్ మసాలా వేసి బాగా కలపాలి.
ఒక బౌల్లో ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని మరిగించాలి చికెన్ గ్రేవీ కోసం వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ స్లోగా ఉంచి పది నిమిషాలు ఉడికించాలి.. అంతే ఎంతో రుచికరమైన చికెన్ టమాటా కూర రెడీ.. పలావ్, బజార్ అన్నం, బిర్యానీ, చపాతి, రోటి పుల్కా వాటితో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సూపర్ సూపర్ యమ్మీ యమ్మీ చికెన్ టమాటా కర్రీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకోవచ్చు.
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.