Catering Style Gongura Pachadi
Gongura Pachadi : గోంగూర పచ్చడి అనగానే చాలామంది వెంటనే నోటిలో లాలాజాలం ఊరిపోతుంది. నోరూరించే గోంగూర పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసా? మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా కేటరింగ్ స్టైయిల్లో గోంగూర పచ్చడిని చేశారా? అయితే ఇప్పుడు ఓసారి ట్రై చేయండి. ఈ గోంగూర పచ్చడిని ఇలా చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాల్లో గోంగూర కట్టలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు 4,టమాటలు 2, పసుపు 1/4 టీ స్పూన్,మెంతులు పొడి 1/4 టీ స్పూన్, ఇంగువ 2చిటికెళ్ళు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ.. ఫస్ట్ పాన్ లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి.
ఈ ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే దీంట్లోనే ఒక ఏడు ఎండు మిరపకాయలు తుంచి వేయండి. తుంచి వేయడం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా వేగి పచ్చడి రుచిగా ఉంటుంది. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలను కూడా లెక్కించుకుని వేసుకొని దీంట్లోనే ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి ఫ్లేమ్ లో పెట్టి ఏవి మాడకుండా బాగా వేయించుకోండి. ఈ పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు పులుపుకు తగ్గట్టు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దాన్నిబట్టి మీరు చూసుకొని కారం ఎంత తినగలరో దాన్నిబట్టి వేసుకోవాలి.
ఎండు మిరపకాయలు అన్ని బాగా వేగాలి. వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. టమాటా ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఆ పచ్చి వాసన పోయి ఆయిల్‌లో ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది. ఈ టమాటా ముక్కలు వేయించుకునేటప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు అలా వేగిన తర్వాత దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఒక రెండు గుప్పెళ్ళు వేసుకోండి.
సుమారుగా మీడియం సైజ్‌లో ఉన్న రెండు గోంగూర కట్టలు తీసుకోవాలి. ఆ తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో సుమారుగా ఒక అర గ్లాసు దాక నీళ్లు పోయండి. నీళ్లు పోసేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకసారి మొత్తం బాగా కలపండి. కలిపేసిన తర్వాత ఈ పాన్‌కి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. టమాటాలు గోంగూర అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి. అలా వచ్చేంతవరకు ఉడకనివ్వండి. 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికిస్తే.. బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గోంగూర మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా చల్లారనివ్వండి.
ఇప్పుడు ఈ గోంగూర మిశ్రమం మొత్తం బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోండి. మామూలుగా క్యాటరింగ్ వాళ్లు అయితే ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు. కాబట్టి వాళ్ళు గ్రైండర్ వేస్తారు. అదే మన ఇంట్లో మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు రోటిపై కావాలంటే దంచుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే మీరు సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే, ఒక్క పావు టీ స్పూను మెంతులు పొడి వేసుకోండి. వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతులను కలపండి. ఒకవేళ మీ దగ్గర మెంతులు పొడి లేకపోతే.. ఒక్క పావు టీ స్పూన్ మెంతుల్ని జీలకర్ర ధనియాలకు కలిపి ఆయిల్‌లోనే వేసి వేయించేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా చేయొద్దు. టేస్ట్ అంత బాగుండదు. ఒక నాలుగు ఐదు సార్లు పల్స్ తిప్పుకోవాలి. మిక్సీ జార్‌లో ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడ్ని ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపు కోసం దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాక ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేవరకు వేయించండి. ఆవాలు, జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి వేసుకోవాలి. దీంట్లోనే ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చాపచ్చాగా దంచి వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి వేగేటప్పుడే ఒక రెండు చిటికెళ్ళు ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. గోంగూర పచ్చడిలో ఇంగువ ఉంటేనే ఆ పచ్చడికా చాలా టేస్ట్ ఉంటుంది.
అలాగే, స్టౌ ఆఫ్ చేసేసి రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా పోపుని వేగనిచ్చేసి ఈ పోపు మొత్తాన్ని పచ్చళ్ళలో వేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే క్యాటరింగ్ స్టైల్‌లో గోంగూర పచ్చడి రెడీ. పచ్చడి వేడి వేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది ఈ పచ్చి ఉల్లిపాయలు కూడా మనకు పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మీ ఇంట్లో ఈ గోంగూర పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేయండి.
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.