Best Bommidala Pulusu Recipe : బొమ్మిడాయి చేపల పులుసు.. ఎప్పుడైనా తిన్నారా? చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఈ బొమ్మిడాయిల చేపల పులుసును అక్కడి వారంతా చాలా ఇష్టంగా తింటుంటారు. చింతపండు కాంబినేషన్‌లో బొమ్మిడాయిలతో చేపలు పులుసు పెట్టుకున్నారంటే ఆహా ఏమి రుచి.. తినరా మైమరిచి అన్నట్టుగా లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఒకసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది. ఇంతకీ ఈ బొమ్మిడాయిల చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు… బొమ్మిడాయిలు-1/2 కేజీ, చింతపండు( నిమ్మకాయ సైజు), పసుపు-1 టీ స్పూన్, కారం ఉప్పు( రుచికి తగినంత), మిరియాలు-1 టీ స్పూన్, ధనియాలు-3 టేబుల్ స్పూన్, జీలకర్ర- 1టేబుల్ స్పూన్, ఆవాలు-1 టీ స్పూన్, మెంతులు-1 టీ స్పూన్, టమాటాలు-4, ఉల్లిపాయలు-5( మీడియం సైజు), పచ్చిమిర్చి-5, పచ్చి మామిడికాయ-1, వంకాయలు-( చిన్న చిన్న తెల్ల వంకాయ)-6, కరివేపాకు ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్-1 టేబుల్ స్పూన్,…
తయారీ విధానం.. బొమ్మిడాయిలను కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి..ఆ తర్వాత టమాటాలు మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్టులా తయారు చేసుకోవాలి. మామిడికాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా వెడల్పుగా ఉన్న కళాయి తీసుకొని నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత కొన్ని ఆవాలు మెంతులు చిటపట అన్న తర్వాత ఉల్లిపాయలు( కట్ చేయకూడదు) వేసి వంకాయలను నిలువుగా అడ్డంగా కట్ చేసి వేసుకోవాలి( గుత్తి వంకాయ కూరలో కట్ చేస్తామో అలాగా) నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి.( టమాటా ప్యూరీ) ఇప్పుడు టమాటా పేస్టు వేసి ఒక టీ స్పూన్ పసుపు ఆ తర్వాత చింతపండు రసం వేసి కలుపుకోవాలి.( మామిడికాయ, టమాట లో పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చింతపండు రసం చూసి వేసుకోండి)..
ఇప్పుడు రుచికి తగినంత కారం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఐ ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాలు పులుసు చిక్కటి గ్రేవీ అయ్యేంతవరకు ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి నూనె పైకి తేలేంతవరకు ఉడికించాలి. ఇప్పుడు (బొమ్మిడాయిలు)..చేపలున్నీ వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత మసాలా కోసం మరోవైపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ,మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మిరియాలు వేసి దోరగా వేయించుకోవాలి. మసాలా దినుసులు చల్లారాక మెత్తటి పౌడర్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు బొమ్మిడాయిలు పులుసులో మసాలా పౌడర్ వేసి నెమ్మదిగా ముక్క విరగకుండా కలుపుకోవాలి.
ఒక రెమ్మ కరివేపాకు వేసి మూత పెట్టుకోవాలి. రెండు నిమిషాలు ఉడికించాలి.. నూనె పైకి తేలేంతవరకు ఉడికించండి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన బొమ్మిడాయిల పులుసు రెడీ.. గమనిక: చిక్కటి గ్రేవీ దగ్గర అయిన తర్వాతే చాపలు వేసుకోవాలి చేపలు ఎక్కువగా ఉడికితే విరిగిపోతుంది..
Read Also : Chamadumpa Egg Pulusu : చామదుంప కోడిగుడ్డు పులుసు.. ఇలా చేశారంటే ఆ టేస్టే వేరబ్బా.. అదిరిపోయే కాంబినేషన్..!
Anjeer : డ్రై ఫ్రూట్స్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం కిస్మిస్ బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర… Read More
Mango Health Benefits : ఈ సమ్మర్ లో మామిడికాయలు మంచి ఆరోగ్య ప్రయోజనాలతో సమ్మర్ స్నాక్స్ ఈ మామిడికాయల… Read More
Atibala plant Benefits: అమితమైన ప్రయోజనాలను అందించే ఈ మొక్క అతిబల పిచ్చి మొక్కగా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఈ… Read More
Aloo curry : అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపలతో ఎప్పుడు చేసుకునే వేపుడు కుర్మా లాంటివి కాకుండా మంచి ఫ్లేవర్… Read More
Sky Fruit : స్కై ఫ్రూట్ మహిళల్లో పీసీఓడీ సమస్య ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ స్కై… Read More
Graha Dosha Nivarana : జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్నట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తరుచుగా… Read More
This website uses cookies.